అయ్యయ్యో ద్రౌపది!

ఆంధ్రభూమి వార పత్రికలో అద్దం లో మనం శీర్షికన శ్రీమతి ఏ ఎస్ లక్ష్మి రాసిన వ్యాసం ఇది.

సాహిత్య పరిఙ్నానం లేని వారు సైతం సులభంగా చదివి అర్ధం చేసుకుని విషయం తెలుసుకోగలరీ వ్యాసం చదివితే. పుస్తకం చదవని వారు, చదవకూడదనుకున్న వారు కూడా విషయం గ్రహించగలరు. ఒక అభిప్రాయానికి రాగలరు.

చదివి నిర్మొహమాటమయిన అభిప్రాయాన్ని తెలపండి.

addam

Enter Your Mail Address

January 21, 2010 · Kasturi Murali Krishna · 11 Comments
Posted in: Uncategorized

11 Responses

  1. సాయికిరణ్ కుమార్ కొండముది - January 21, 2010

    నిర్మొహమాటంగా చెప్పాలంటే, ఈ వ్యాసరచయిత లక్ష్మిగారు చెప్పినట్లు ద్రౌపది రచయితను, వాడికి అవార్డు ఇచ్చినవారిని, వాడిని వెనకేసుకొస్తున్నవాళ్ళని చెప్పులతో కొడితే, చెప్పులకే అవమానం.

  2. lalita - January 21, 2010

    మనం హిందువులం అనుకోవడం మహా పాపమైపోయిందీ హిందూదేశంలో..
    రాముడినీ, కృష్ణుడినీ యెంత విమర్శించినా, వెక్కిరించినా మనం యేమీ మాట్లాడకూడదు. మాట్లాడితే ఛాందస భావాలున్నవాళ్ళం అవుతాం. కాలంతో పాటు నడవని, వెనకబడిన వాళ్లమవుతాం. సినిమాల్లో చూపించి, చూపించి అమ్మనీ, నాన్ననీ, గురువునీ వెక్కిరించడం, తిట్టడం అందరికీ అలవాటుగా చేసేసారు. ఇప్పుడు పిల్లలకి అవేమంత తప్పుగా అనిపించటంలేదు.. అలాగే మన దేవుళ్ళని కూడా ఎవరికి కావలసినట్లు వాళ్ళు మార్చేసుకుంటున్నారు. ఎంత గొడవ చేసి ఏమి ప్రయోజనం. రేపు వాటిని పాఠ్యపుస్తకంగా కూడా పెట్టవచ్చు. మన పిల్లలు చదవక తప్పని పరిస్థితి రావొచ్చు. దేశదేశాలా మన పురాణాలు నవ్వుల పాలూ కావచ్చు..
    అయినా శృంగారం ప్రబంధాల్లోలేదా అని అడ్డంగా వాదిస్తారేంటండీ ఈ పెద్దమనుషులు? ప్రబంధాలు యెంత మంది ప్రజలు చదువుతారు? భాష మీద సరైన పట్టు ఉంటే తప్ప ప్రబంధం చదవలేడు. అంత భాష మీద పట్టు వున్న వాడికి తప్పకుండా మానసిక పరిపక్వత వచ్చే వుంటుంది. అప్పుడు వాడు యేది చదివినా సమగ్రమైన అర్ధం చేసుకునే స్థితి లొనె వుంటాడు. కాని మరి ఈ పుస్తకమో… తెలుగు అక్షరాలు వచ్చిన ప్రతివాడూ చదవగలడు.. వాడికి మానసిక పరిపక్వత లేకపోవడం వలన విపరీతార్ధాలు తీస్తాడు.. సమాజం నాశనం అయిపోతుంది. దీనిని అరికట్టే మార్గమే లేదా..?

  3. M.V.AppaRao - January 21, 2010

    దుశ్శాసన కవులు

    నేటి రాజకీయ గ్రహాల్ని దేముళ్ళలా కొలిచే జనాలు ఈనాడుంటే!
    కొందరేమో ఇతిహాసాల్ని అతిగా మార్చేసి నవ్వులపాలు చేస్తుంటే;
    మనమేమో మతాన్ని అభిమతాన్ని చంపుకుంటాం!!
    మనకో గొప్పకవి దొరికాడని జబ్బలు చరచుకుంటాం!!

    ఇలాటి పనికిమలిన రాతగాళ్ళని తరిమికొట్టాలి.

  4. రవి - January 21, 2010

    క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం నాటిదని చెప్పబడుతున్న ఓ ఇతిహాసంపై రచన చేయాలంటే, అందుకు ఎంతో నిబద్ధత, నిజాయితీ కావాలి. అందులో రచయిత చెప్పిన విషయాన్ని లేదా స్పృశించిన కొత్తకోణాన్ని స్పష్టంగా గ్రహించి, ఆ విషయాన్ని సమకాలీన పాఠకులకు అందజేయగలగాలి.

    ఇవేవీ లేక, రచన వెలయించి, ఇదివరకు కావ్యాల్లో బూతులున్నాయి కదా, నా బూతులూ చదివి తరించండి, వాడెవడో అన్నప్పుడు లేని దుగ్ధ నేనప్పుడు వచ్చిందా అని మాట్లాడ్డం తర్కం కాదు. అదొక వితండవాదం.

    ద్రౌపది గురించి జాలంలో ఇన్ని చదువుతున్నా కూడా రచయిత ఈ రచన ఎందుకు రాశాడు, ఇందులో ఆయన చెప్పదల్చుకున్నదేమిటి, ఆ విషయం ఎంత స్పష్టంగా చెప్పాడు అన్న విషయం, మహాభారతం లో ఈయన శోధించి కనుక్కున్నదేమిటీ ఇవేవీ అంతుబట్టకుండా ఉన్నాయి.

  5. దుప్పల రవికుమార్ - January 21, 2010

    సరే, ఈ నవల సంగతీ, దీని రచయిత వ్యక్తిగత జీవితంలోని రాజకీయ ప్రాపకం గురించి వెంపర్లాడడం సంగతలా వుంచండి, కానీ ఈ ఎపిసోడ్ మొత్తంలో బెల్లం కొట్టిన రాయిలా వుండిపోయిన న్యాయనిర్ణేతల వ్యవహారం గురించే ప్రస్తుతం జరగాల్సిన అత్యవసర చర్చగా నేను భావిస్తున్నాను.

  6. కత్తి మహేష్ కుమార్ - January 21, 2010

    ఇప్పుడే నవల చదవడం ముగించాను.
    ఈ వ్యాసంలో విమర్శకురాలి పైత్యం బ్రహ్మాండంగా సాక్షాత్కరించింది. రచయిత వాక్యాల్ని out of context quote చేసి బాగానే పబ్బంగడుపుకుంటున్నారు. ఎస్.ఎల్.భైరప్ప ‘పర్వ’ మీద విమర్శకురాలి take చదివాక ఆవిడ స్థాయి తెలిసొచ్చింది.

    ఏదిఏమైనా ఇది నవల సేల్స్ కు మంచిదే. It will help in promoting reading and to make their own decision.

  7. మైత్రేయి - January 21, 2010

    పుస్తకం నెట్ లో వచ్చిన వ్యాఖ్య, ఇతర బ్లాగులు చదివాను కాని ఈ వ్యాసం చక్కగా సూటిగా ఉన్నది.

    వ్యతిరేకించే తప్పుడు కూడా చాలా విషయాలతో వ్యతిరేకించ కూడదు. అప్పుడు వాదన పలచన అవుతుంది.

    శృంగార వర్ణన, ఆమె పతులతో పాట్లు పడక సుఖం గా ఉన్నది అని రాసాడు అన్న ఇతర విషయాలు పెద్ద ఆర్గుమెంట్లు కాదు.నా ఉద్దేశ్యం లో అది పెద్ద తప్పూ కాదు. ఇది చిన్న పిల్లల పుస్తకం కాదు కదా.పతిని లేదా పతులనూ కామించటం తప్పు అని ఏ ధర్మ శాస్త్రం చెప్పదు. అసందర్భం గా వర్ణనలు ఉంటే రచయత రచన చేతగాని వాడు అని మాత్రమే చెప్పగలం.

    అసలు విషయం కొందరు పాత్రల చరిత్రకు మకిల అంటించాడు అని.
    కృష్ణుని పై, ఆయన వ్యక్తిత్వం పై మచ్చ వేసేట్లు గా ఉన్నది ఆమె కోట్ చేసిన వాక్యం.
    కృష్ణుడు ఆప్యాయం గా “తల్లీ కృష్ణా, నా చెల్లి కోసం వచ్చినప్పుడు నిన్ను కూడా పలకరించి వెళ్ళ గలుగుతాను కదా! ఈ కళ్యాణం తో మనం ఇంకా దగ్గర అవుతాం గదా ” అనటానికి,
    కృష్ణుడు కొంటెగా “నీవు నీ భర్త గూర్చి గాక నా గూర్చి ఆలోచించటానికి టైం ఉంటుంది కదా” అని రాయటానికి చాలా వత్యాసం ఉన్నది. దీన్ని బట్టి రచయిత ఇంకా ఏదో చెప్పదలుచుకొని జనాలు తంతారని లైట్ గా తప్పుడు విషయాన్నిsubtle చెప్పినట్లు తెలుస్తోంది.

    అలాగే భగవత్ స్వరూపమైన వ్యాసుల వారని కించ పరిచారని పుస్తకం నెట్ లో వ్రాసిన వారు కూడా వ్రాసారు.

    ఒక వ్యక్తి లేక చాలా పురాతనమైన పాత్ర యొక్క మూల స్వభావాన్ని మార్చి చూపించటం ఏ రచయితకూ తగదు. ఆ పాత్ర మత విశ్వాసాలతో ముడి పడినట్లయితే మరీ తప్పు. అది కోర్టులో వెయ్యదగ్గ తప్పు.

  8. Kasturi Murali Krishna - January 23, 2010

    మహేష్ కుమార్ గారు,

    ఇక్కడ చర్చ నవల గురించి, పైత్యాల గురించి కాదు. పైత్యాల చర్చ మరోసారి. అలాగే ఎదుటి వారి స్థాయిని నిర్ణయించేముందు ఒక్క క్షణం ఆగి ఎవరి స్థాయిని వారు విశ్లేషించుకుంటే మంచిది. ఇది సాహిత్య చర్చ మాత్రమే. ఇక్కడ వ్యక్తిగత పైత్యాలు, స్థాయిల నిర్ణయాలు అప్రస్తుతము, అనవసరము. వ్యాఖ్యలు సైతం వ్యాఖ్యాతల స్థాయిలు, పైత్యాలను ప్రదర్శిస్తాయి.

  9. కోడీహళ్లి మురళీమోహన్ - January 25, 2010

    http://pustakam.net/?p=3398

  10. కె.మహేష్ కుమార్ - February 1, 2010

    మురళీకృష్ణ గారూ, నిజంగా వ్యాసంలో రచయిత్రి నవల గురించి విశ్లేషించిందంటారా??? ఒకసారి గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి!

  11. Kasturi Murali Krishna - February 2, 2010

    మహేష్ కుమార్ గారూ,

    నా గుండెల మీద చేయివేసి మీరన్నమాట చెప్తాగానీ, మీరు ద్రౌపది పుస్తకం మీద చేయివేసి చెప్పండి, వ్యాసం లో out of context quote ఏది వుందో? అది ఏరకంగా out of contextఓ ?అదయ్యాక, పబ్బం గడుపుకోవటం అంటే ఏమిటి, అది ఈ సందర్భంలో ఎలా సరిపోదుందో? కాస్త వివరించండి. అలాగే, మీరొకటి గమనించారా, కందకు లేని దురద కత్తిపీటకు మల్లె ఎవరెవరో ద్రౌపది నవలను, ఏదేదో రకంగా సమర్ధిస్తూ, విమర్శించిన వారిపై వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారుకానీ, రచయిత నుంచి ఉలుకు లేదు, అవార్డు కమిటీ నుంచి పలుకు లేదు. ముందు నా ఈ సందేహాలకు నాకు సంతృప్తి కలిగేలా( convincingగా) సమాధానం ఇవ్వండి, ఆ తరువాత ఇంకొన్ని సందేహాలున్నాయి, ఆ తరువాత, గుండెలమీద చేయి సంగతి.

Leave a Reply