పాలపిట్ట పత్రికలో తీవ్రవాదం పుస్తక సమీక్ష!
ఏమిటీ పాలపిట్ట పత్రిక? ఎక్కడిదీ పత్రిక? అని ఆలోచిస్తున్నారా?
పాలపిట్ట అని ఒక కొత్త మాస పత్రిక మార్చ్ నెల నుంచీ ఆరంభమవుతోంది.
ఇది సాహిత్య మాస పత్రిక. సిసలయిన శ్ర్జనకి వేదిక. ఇది కేవలం సాహిత్య పత్రిక కాదు. సకల రంగాల్లోని శృజనాత్మక వ్యక్తీకరణలకు అనువయిన వేదిక. శ్ర్జనాత్మక ఆలోచనలు ఎక్కడవున్నా స్వీకరించి, పాఠకులకు చేర్చే వారధి ఇది.
నిజానికి, భారతి తరువాత పూర్తిగా సాహిత్యానికి, ఇతర కళలకు ప్రాధాన్యమిచ్చే పత్రికలు తెలుగులో కరవయ్యాయి. ప్రస్తుతం, కొన్ని సాహిత్య పత్రికలుగా చలామణీ అవుతూన్నా, వాటిలో తమ మాటకో, సిద్ధాంతానికో తాన అంటే తందానా అనేవారికే పెద్దపీట. తమకు నచ్చిన వారే సహితీమూర్తులు. వారు రచించేదే సాహిత్యం. అలాంటి పరిస్థితిలో, అన్నిరకాల వాదనలకూ, సిద్ధాంతాలకూ స్థానాన్నిస్తూ అసలయిన సాహితీసృజనకే ప్రాధాన్యం కల్పిస్తుందీ పత్రిక.
ఈ పత్రిక ముందుగా తయారు చేసిన నమూనా ప్రతిలో తీవ్రవాదం పుస్తకం సమీక్ష ప్రచురితమయింది.
ఇంకా ఈ పత్రిక గురించి వివరాలు కావాలనుకున్నవారు ఈ క్రింది చిరునామాలో సంప్రతించవచ్చు.
ఎడిటర్, పాలపిట్ట మాస పత్రిక,
16-11-20/6/1/1, 403.
విజయ సై రెసిడెన్సీ, సలీం నగర్
మలకపేట్-500044.
ఫోను- 9848787284.
February 8, 2010
·
Kasturi Murali Krishna ·
No Comments
Posted in: Uncategorized








Leave a Reply