పాలపిట్ట- కొత్త సంచిక చదివారా?

పాలపిట్ట, సాహిత్య మాస పత్రిక కొత్త సంచిక విడుదలయింది.

భారతి పత్రిక తరువాత అలా,టి ఉన్నత స్థాయి పత్రిక లేని లోటు సాహిత్య ప్రపంచంలో ఏర్పడింది. ఆలోటును పూడ్చే దిశలో ఆరంభమయిన పత్రిక ఇది.

ఈ సంచికలో మొత్తం 108 పేజేలున్నాయి. వెల 30/- రూపాయలు.

అట్టపైన సాధారణంగా కనబడే సినీ నటీమణులు ఈ పుస్తకం అట్టపైన కనబడరు.

palapitta

ఈ సంచికలో నాలుగు కథలున్నాయి. చరిత్ర, కళలు, సాహిత్యం, సంగీతాలకు సంబంధించిన యాసాలున్నాయి.

సాగర సంగమం సినిమా విశ్లేషణ వుంది. శాంత సుందరితో ఇంటెర్వ్యూ వుంది.

కొత్తగా అచ్చయిన పుస్తకాలున్నాయి. కొత్తగా అచ్చయిన పుస్తకాలలోంచి కొన్ని భాగాలను చదివేవేలూ వుంది. ముఖ్యంగా పుస్తక సమీక్షలకు ఎక్కువ పేజీలు కేటాయించటం చూడవచ్చు.

ఈ పత్రికలో ప్రత్యేకంగా కొందరు ప్రముఖులు చదువుతున్న పుస్తకాల వివరాలు వారి అభిప్రాయాలను తెలిపే శీర్షిక వుంది.  కవితలున్నాయి.

ఈ రకంగా, సృజనాత్మక కళకు సంబంధించిన లోతయిన వ్యాసాలను ఒక చోట చేర్చి అందించే తెలుగు పత్రిక ఇది. ఇలాంటి పత్రిక లేనిలోటు ఈ పత్రికను చూడగానే అర్ధమవుతుంది.

ఇప్పుడీ పత్రికను ఆదరించాల్సింది పాఠకులే. తెలుగులో పత్రికలు నడవాలంటే క్రైం, సెక్సులు తప్పనిసరి అన్న అపోహను తొలగించి, తెలుగువారు నాణ్యత కల ఉత్తమ పత్రికలను ఆదర్స్తారని నిరూపించాల్సిన బధ్యత ఉత్తమ సాహిత్యాన్ని కోరే ప్రతివారిపైన వుంది.

పత్రికను చదవండి. నిర్మొహమాటంగా అభిప్రాయాలను తెలపండి. సూచనలను చేయండి. పత్రిక అభివృద్ధికి తోడ్పడండి. కనీసం ఒకటయినా సాహిత్య పత్రిక తెలుగులోవుందని చెప్పుకునే వీలుకల్పించండి.

పత్రికకౌ సంబంధించిన వివరాలకు, తమ రచనలు పంపటానికి చిరునామా….

ఎడిటర్, పాలపిట్ట మాసపత్రిక
హ్.ణొ-16-11-20/6/1/1,403
విజయ సై రెసిడెన్సీ
సలీం నగర్, మలక్ పేట్
హైదెరాబాద్-500036.
ఫోను-9848787284.

Enter Your Mail Address

March 18, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

Leave a Reply