ఎం ఎఫ్ హుస్సేన్ వివాదం- మరో కోణం!

ఎం ఎఫ్ హుస్సేన్ వివాదాన్ని సగటుమనిషి దృక్కోణం లోంచి రాసిన సగటుమనిషిస్వగతం ఇది. ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురితమయింది. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

sagatu

Enter Your Mail Address

April 4, 2010 · Kasturi Murali Krishna · 11 Comments
Posted in: నా రచనలు.

11 Responses

 1. Srinivas - April 4, 2010

  I completely agree with the author’s opinion. I’m glad that finally someone thinking like a common man, not like a so called “Intellectual”

  Srinivas

 2. Nachiketa - April 4, 2010

  మీరు మీ ఆర్టికల్ లో ఎం.ఎఫ్.హుసేన్ వివాదాలను మాత్రమే కాక ఆయన కళనే విమర్శించారు. ఇంకా చెప్పాలంటే మొత్తంగా మోడరన్ ఆర్ట్ నే విమర్శించారు. ఇందుకు మీకున్న అర్హత ఏమిటో నాకు తెలియలేదు.
  http://en.wikipedia.org/wiki/Modern_art
  http://en.wikipedia.org/wiki/File:Picasso_Outside2.jpg

  మీ లెక్కన పై పాబ్లో పికాసో చిత్రం కూడా సుత్తితో కొట్టి సాగదీసి అరగ దీసినట్లుంటుంది. పికాసో కూడా గొప్పవాడయాడంటే కారణం ఆయన పూర్వజన్మ సుకృతమా?

  పైగా ఇది సగటు మనిషి దౄక్కోణం అన్నారు, అప్పటికి సగటు మనుషులందరి తరఫునా వకాల్తా తీసుకున్నట్లు. సగటు మనిషికి సత్యజిత్ రే సినిమా చూపించినా అది పెద్దగా నచ్చకపోవచ్చు. అంత మాత్రం చేత సత్యజిత్ రే సాధారణ దర్శకుడు కాబోడు.

  మీకు ఎం. ఎఫ్. హుసేన్ చిత్రాలు ఆయన నగ్న దేవతల పెయింటింగులకి ముందే నచ్చలేదా, లేక ఆ తరువాత అవి వంకర గీతలు గా కనిపిస్తున్నాయ? లేక ఆయన వివాదాలలోకి రాకముందు ఎప్పుడు హుసేన్ పెయింటింగులు చూడలేదా?

 3. కత్తి మహేష్ కుమార్ - April 4, 2010

  మీ సగటు మనిషి హిందుత్వవాదండోయ్! అది భలే తెలిసిపోతోందే!!

 4. చదువరి - April 4, 2010

  సగటు మనిషి ఆలోచనలు సగటు మనిషి ఆలోచనల్లాగే ఉన్నాయి. సగటు మనిషి పట్ల సగటు మే..తావి ఆలోచనలు కూడా సగటు మేతావి ఆలోచనల్లాగానే, వెగటుగానే ఉన్నాయి.

 5. కళాభిమాని - April 4, 2010

  అసలు సగటు మనిషికి అర్థం కాని కళలెందుకు? మేథావులమని పేరు చెప్పుకుని వాటిని పట్టుకుని ప్రజల నమ్మకాల్ని కూలదోసే కుహనా మేథావుల కోసమా?

 6. MBS Prasad - April 5, 2010

  good article. A small correction. ‘Ghotaka Brahmachari’ means ‘bogus bachelor’. Hanuman should not be called so. Ghotaka in Sanskrit means horse. Horse looks normal and pious till it spots a mare. Hence the adage.

 7. kasturimuralikrishna - April 5, 2010

  i stand corrected. thank u.

 8. కత్తి మహేష్ కుమార్ - April 5, 2010

  అయ్యా కళాభిమానిగారూ,
  కళలూ,సాహిత్యం,సైన్సూ కేవలం సగటు మనిషికి అర్థమవ్వడం కోసం ఆగిపోతే ప్రగతి జరగదు. ప్రస్తుతం ఉన్న నమ్మకాల్ని కూలదోస్తేగానీ కొత్త విలువలు పుట్టుకురావు. మేధావులు,కళాకారులూ, సాహితీవేత్తలు,శాస్త్రవేత్తలు చెయ్యాల్సింది అదే. అప్పుడే పురోగతి సాధ్యమవుతుంది. ఇప్పటివరకూ అలాగే జరిగింది. ఇకముందా అలాగే జరుగుతుంది.

 9. MBS Prasad - April 6, 2010

  It is an old debate whether art is for art sake or people’s sake. Modern-day intellectuals condemn old poets for writing about Gods and kings and that too in Sanskrit. They should have been written about commoner’s life in local lingo, they argue. Artists like MFH are obscure and a commoner has every right to complain. A critic might view the same thing in a different perspective, but he cannot take away the right of a commoner. I am a commoner and agree with writer’s views on MFH. I am equally interested to know the view of renowned critics on his works. How many of his paintings are hung in world famous Museums? Will somebody be able to tell?

 10. కళాభిమాని - April 6, 2010

  @కత్తి మహేష్ కుమార్,
  కొత్త విలువలా? ఎలాంటివి?
  మీరు ప్రోత్సహించే పెళ్ళికి కాకుండానే సహజీవనం, లాంటివా?
  ఇలాంటివి సమాజానికి మేలు చేస్తాయా? సిగ్గు సిగ్గు.

 11. రవి - April 7, 2010

  సగటు మనిషి ఆలోచన గురించి ఇంతకంటే సున్నితంగా ఎవరూ చెప్పలేరేమో.

  - “రోడ్డు పక్కన చాక్ పీసుతో బొమ్మలు గీసే చిత్రకారుడి బొమ్మ చూస్తూ..”

  అంతే కాదండోయ్. రోడ్డు పక్కన పొట్టకూటి కోసం కళాసృజన చేసే ఆ అపురూపమైన కళాకారుడు దేవతల నగ్నత్వం గురించి, ప్రాచీన శిల్పాల గురించి ఆలోచించడు. పైగా తన తోటి ప్రజలను “కళ” పేరుతో నగ్నంగా బొమ్మలు గీసి మథనపెట్టడు. ఇంకా చెప్పాలంటే, హనుమంతుడి బొమ్మనూ, ఏసుక్రీస్తు బొమ్మనూ ఒకే రకమైన ఆర్తితో చిత్రించగలడు.అతడికి తను హిందువో, హిందుత్వవాదో కూడా తెలియదు. తెలిసినది కడుపాత్రం మాత్రమే. ఆశ్చర్యం కదండీ!

  ఎంతైనా ఈ దేశంలో సగటుమనిషి సగటుమనిషే, మేతావులు మేతావులే.

Leave a Reply