సౌశీల్య ద్రౌపది-ఇప్పుడు పుస్తక రూపంలో!

మార్చ్ నెల ఆంధ్రభూమి మాస పత్రికలో ప్రచురితమయిన నవలిక సౌశీల్య ద్రౌపది ఇప్పుడు పుస్తక రూపంలో వస్తోంది.

నవల చదివినవారు, వ్యక్తిగతంగా, ఫోను ద్వారా, ఎస్సెమ్మెస్ ల ద్వారా తమ అభిప్రాయాలను తెలిపారు.

తెనాలిలో జరిగిన ఒక సభలో మహిళలు స్వచ్చందంగా, తమలో తాము మాట్లాడుకుని, ధనం సమీకరించి, పుస్తక ప్రచురణకు తమవంతు విరాళాన్ని అందించారు. ఇది నిజంగా నన్ను కదిలించిన సంఘటన.

photoఆ సభలో కొందరు హేతువాదులు, వామ పక్ష భావాల కామ్రేడ్లు గొడవ చేయాలని ప్రయత్నించారు. వారడిగిన ప్రశ్నలకు సమాధానిచ్చి వారి వాదనను పూర్వ పక్షం చేశాను. ఒక పక్క ఈ గొడవ జరుగుతూండగా, సభలో వున్న ఆడవారు మౌనంగా తమ దగ్గర వున్న ధన్నాన్ని సేకరించి, నా చేతిలో పెట్టి, మేము అరిచి గోల చేయలేము. మా వంతుకి మీరు  చేస్తున్న  ప్రయత్నానికి ఇది మా తోడ్పాటు, అన్నారు.

అంతేకాదు, నవలను తెనాలిలో ఆవిష్కరింపచేయమనీ అడిగారు. అందుకు తగ్గ ఏర్పాట్లు వారే చేస్తామనీ అన్నారు.

నవల చదివిన ఒక కాజీపేట వ్యాపారవేత్త, నన్ను వచ్చి కలిసి, నవల ప్రచురణలోనేకాదు, నవలను పదిమందికీ చేరువ చేయటంలోనూ సహాయపడతానని వాగ్దానం చేశారు.

నవల చదివి విజయవాడ నుంచి  గాంధీ పథం  పత్రిక సంపాదకుడు రాసిన వుత్తరంలో కొంత భాగం ఇదిగో!

draupadi

నవల చదివిన అనేకులు ఈరకంగా స్పందించటం నాకు ఆనందాన్ని కలిగించింది.

పురాణ పాత్రలను అనుచితంగా  చిత్రించి దిగజార్చి చూపటం పట్ల ప్రజలలో మౌనంగా రగులుతున్న ఆవేశం అర్ధమయింది. ఇది tip of the iceberg మాత్రమే!

ఇలాంటి అనేక అనుభవాల ఫలితంగా ఇప్పుడు సౌశీల్య ద్రౌపది నవలను నేను పుస్తక రూపంలో ప్రచురిస్తున్నాను.

మిగతా వివరాలు త్వరలో…….

Enter Your Mail Address

April 7, 2010 · Kasturi Murali Krishna · 3 Comments
Posted in: నా రచనలు.

3 Responses

 1. మందాకిని - April 7, 2010

  అభినందనలు!!

 2. రవి - April 7, 2010

  “పురాణ పాత్రలను అనుచితంగా చిత్రించి దిగజార్చి చూపటం పట్ల ప్రజలలో మౌనంగా రగులుతున్న ఆవేశం అర్ధమయింది…”

  బాగా అన్నారు. భావప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడే హేతువాదులు, మీ సభలో గొడవ చేయడం ఆశ్చర్యంగా ఉంది.

 3. kasturimuralikrishna - April 8, 2010

  రవి గారూ

  హేతువాదులు గొడవ చేసేది వారి భావ ప్రకటన స్వేచ గురించి మాత్రమే!

Leave a Reply