పాలపిట్ట- కొత్త సంచిక విడుదలయింది…..

పాలపిట్ట- కొత్త సంచిక విడుదలయింది.

ఏప్రిల్ నెల పాలపిట్ట మాస పత్రిక విడుదలయింది.

ఆలస్యంగా విడుదలయినా, ఆననందం కలిగిస్తుంది.

కొత్త పత్రిక క్రెడిబిలిటీ పెరగాలంటే సమయానికి విడుదలవటం అత్యంత ప్రధానమయిన అంశం. ఆలస్యం అయిన కొద్దీ రక రకాల వ్యాఖ్యలు వినిపిస్తాయి. కాబట్టి పత్రికను సకాలం లో ప్రచురించటం పత్రిక విజయవంతమవటానికి తొలీడుగు అని ప్రచురణ కర్తలు గ్రహించాలి. పాఠలుల విశ్వాసాన్ని చూరగొనాలి.

papittaఈ నెల సంచికలో ప్రధానంగా శ్రీ శ్రీ గురించి, గోరటి వెంకన్న గురించి ప్రత్యేక వ్యాసాలున్నాయి. గోరటి ఇంటెర్వ్యూ కూడా వుంది. ఈ రెండు విశయాలు ఈ నెల పత్రిక ప్రత్యేక ఆకర్షణలు.

ఇవికాకేన్ సదాశివ, ముకుంద రామారావు, కాత్యాయని విద్మహే, అఫ్సర్, ఎస్ నారాయణ స్వామి, కేపీ అశోక్ కుమార్, వెల్చేరు నారాయణ రావ్ వంటి రచయితల వ్యాసాలు, రూప్ కుమార్ డబ్బీకార్, వైదేహి శశిధర్, ఎలనార వంటి కవుల కవితలు, సమీక్షలు వున్నాయి.

కొల్లూరి సోమ శంకర్ అనువాద కథ వుంది.

ఇలా విభిన్నమయిన సాహిత్యాంశాలను పొందుపరచుకున్న పత్రిక విడుదలయింది. కొనండి. చదవండి. అభిప్రాయాలు తెలిపి పత్రికను ప్రోత్సహించండి. తెలుగు పత్రికా రంగంలో సాహిత్య పత్రికలకూ మనుగడ వుందని నిరూపించండి..

Enter Your Mail Address

April 15, 2010 · Kasturi Murali Krishna · 3 Comments
Posted in: pustaka paricayamu

3 Responses

 1. రాజేంద్రకుమార్ దేవరపల్లి - April 15, 2010

  అయ్యా,ఎన్ని దుకాణాల్లో అడిగినా ఈ పాలపిట్ట పత్రిక గురించి మాకేమీ తెలీదంటున్నారు మా వూళ్ళో.మీరైనా ఆ పత్రిక వారిని ఓసారి అడిగి చూడండి,విశాఖపట్నం అనే ఊరు పత్రికకాపీలు వెళ్తున్నాయా లేదా అని.

 2. సుజాత - April 15, 2010

  మురళీ కృష్ణ గారూ,
  మంచి పత్రికను సకాలంలో విడుదల చేయడమొక్కటే కాదు, కాస్త పుస్తకాలు చదివే అలవాటున్న వాళ్లకు ఈ పత్రిక సమాచారం చేరేలా కూడా చేస్తే వాళ్ళ నుంచి మరి నలుగురికి చేరుతుంది. ఈ పత్రిక గురించి విని బయట స్టాండ్స్ లో ప్రయత్నిస్తే(అమీర్ పేటలో) అలాంటి పత్రిక ఉన్నట్లు తెలీదన్నాడొకాయన.

  పోనీ చందా కట్టించుకుంటారా? ఆ వివరాలు మీరైనా ఇవ్వండి! సాహితీ విలువలున్న పత్రికలకు(.(అందులో సినిమా టిట్ బిట్సూ,సెలబ్రిటీల కబుర్లూ ఉండవు కాబట్టి) కాస్త ప్రమోషన్ అవసరం కొన్ని కాపీలను ఉచితంగా అందించడం వగైరా.

  ఉచిత సలహాలకు అన్యధా భావించరని తలుస్తాను.

 3. kasturimuralikrishna - April 15, 2010

  దేవరపల్లి గారూ,

  విశాఖలో ఏ దుకాణంలో దొరుకుతాయో తెలుసుకుని చెప్తాను.

  సుజాత గారూ,

  మీది ఉచిత సలహా కాదు, సముచిత సలహా!

  పత్రిక అడ్రెసు క్రితం టపాలో ఇచ్చాను. అయినా అడిగారు కాబట్టి మరోసారి;

  ఎడిటర్, హౌస్ నెంబర్-16-11-20/6/1/1, 403, విజయ సాయి రెసిడెన్సీ, సలీం నగర్, మలకపేట, హైదెరాబాద్- 36. ఫోను- 9848787284.

Leave a Reply