నేను రాసిన ఘాటయిన రివ్యూ….

ఆంధ్రభూమి వారపత్రికలో నేను రాసిన రివ్యూ ఇది. వున్నది వున్నట్టు రాసే అరుదయిన అవకాశాన్నిచ్చిన ఆంధ్రభూమి కి కృతౙ్నాతలు.

review

Enter Your Mail Address

May 17, 2010 · Kasturi Murali Krishna · 11 Comments
Posted in: pustaka paricayamu

11 Responses

 1. వంశీ - May 17, 2010

  ఘాటు అనగానేమి? వివరింపుడి!

  పత్రికల్లో “ఘాటుగా” అంటే ఇంతియే అని శలవిస్తే ఇక మీరు ఆ పత్రికలకు పంపించకుండా బ్లాగులో రాసుకోడం మేలు. పైగా పద్మ అని ఉందేమిటి ? అది మీ కలం పేరా?

  భవదీయుడు
  వంశీ

 2. Kasturi Murali Krishna - May 17, 2010

  వంశీ గారూ,

  ఇది ఘాటే. ఘాటు సాపేక్షం. అవును, పద్మ నా కలం పేరు.

 3. Srinivass - May 17, 2010

  ఘాటు మీకు తగిలినట్లుంది. దీన్ని రివ్యూ అని కూడా అంటారా?

 4. SIVARAMAPRASAD KAPPAGANTU - May 17, 2010

  మేదావి అంటే:

  1 దేవుణ్ణి నమ్మ కూడదు.
  2 కమ్యూనిస్టు అయ్యి ఉండాలి. లేదా అధమం, కమ్యూనిస్టు అభిమాని అయ్యి ఉండాలి.
  3 ఏదన్నా పుచ్చు యూనివర్సిటీలో పని చెయ్యని ప్రొఫెసర్ అయ్యి ఉండాలి.
  4 పక్క హేటు వాది అయ్యి ఉండాలి.
  5 అతితెలివి చూపిస్తూ పిడివాదం చేస్తూ ఉండాలి.
  6 ఉరి శిక్ష రద్దు చెయ్యాలి అని అప్పుడప్పుడూ కేకలు వేస్తూ ఉండాలి.
  7 ఇలా పుస్తకాలలో హిందూ మతం గురించి దుమ్మెత్తి పోస్తూ ఉండాలి.
  8 మానవ హక్కుల గురించి గంభీరంగా మాట్లాడ గలగాలి (అవసరమైనప్పుడు, పైనించి వచ్చిన ఆదేశాల ప్రకారం. మళ్ళి అందరి సామాన్య మానవుల గురించిన హక్కుల గురించి మాట్లాడితే మేధావితనం ఎగిరిపోతుంది!)
  9 అందరూ అవునంటే కాదనాలి. కాదంటే అవుననాలి.
  10 శత్రు దేశాల సరిహద్దులకి వెళ్లి ఆ కంచే మీదగా వాళ్లకి గులాబీ పూలు ఇస్తూ ఉండాలి. అప్పుడప్పుడూ కొవ్వొత్తులు పట్టుకు తిరగాలి, ఎందుకో మరి తెలియదు.

  ఇవన్ని ఉన్నవాళ్ళే మేధావులు. ఈ లక్షణాలు లేనివాళ్ళను మేధావులు అనరు. మీరేమో పాపం అ రహ్కాయిత తన మేధావి తనాన్ని నిరూపించుకుంటూ ఉంటే, ఇలా ఘాటుగా విమర్శిస్తే ఎలాగండి. వాళ్ళు బతిగేది ఎట్లా!

 5. అబ్రకదబ్ర - May 17, 2010

  విమర్శ ఘాటుగా ఉండాలి, సమీక్ష ఉన్నదున్నట్లుండాలి. ఆ రెండు ప్రక్రియలకీ బహు సున్నితమైన తేడా ఉంది. విమర్శకుడికి కటువుగా ఉండే అవకాశం ఉంది. సమీక్షకుడికి లేదు. ‘ఉన్నదున్నట్లు ఘాటుగా రాయబడ్డ సమీక్ష’ అనగానేమి? ఆ రెంటినీ కలగలిపిన మూడో ప్రక్రియా ఇది?

 6. వంశీ - May 17, 2010

  నా “ఘాటు” ప్రశ్నంపు పాటలోని చరణ పల్లవులను రెండిటినీ రొఖ్ఖంగా కలిపి (పల్లవి చరణాలంటే బాగోదని!- అవేవో ఆడవారి పాదాలనుకుని ప్రజలు పరిగెత్తుకొచ్చే ప్రమాదమున్నది!) అబ్రకదబ్ర పట్టుకున్నారు.

  మీరు ఆ నా ఘాటు పాటలోని చరణమును “సాపేక్షము” అని తేల్చివేసితిరి. అయిననూ సాపేక్షానికీ ఒక ప్రమాణమున్నది. ఆ ప్రమాణమును మీరు ఎలా నిర్వచింతురని అడిగితిని మహానుభావా మార్తాండతేజా! అంతే కానీ వేరే ఉద్దేశం లేదు!

 7. మంచు - May 17, 2010

  శివప్రసాద్ గారు
  మేదావి అంటే: అంటూ మీరు ఇచ్చిన పది పాయింట్ల నిర్వచనం వేరే చొట (నా బ్లాగులొ) వాడుకొవచ్చా.. తెలుపగలరు.
  మంచు

 8. Sandeep - May 17, 2010

  నాకు నచ్చిందండి మీ విమర్శ!

 9. Kasturi Murali Krishna - May 17, 2010

  శ్రీనివాస్, మంచు, సందీప్ గారు ధన్యవాదాలు.

  అబ్రకదబ్ర, వంశీ గారూ,

  కాలాన్ని బట్టి పదాలు, పదాల అర్ధాలు, ఉపయోగాలూ మారతాయి.

  ఇప్పుడు సమీక్షకూ. విమర్శకూ నడుమ తేడా చెరిగిపోయింది. రెండూ కలసి రివ్యూ అయిపోయాయి.

  ఇలాంటి కొన్ని పుస్తకాలను ప్రామాణికాలుగా నిర్ణయించారు. అలాంటివి మన మేధావుల అకాడెమిక్ ప్రపంచంలో untouchables. ఎమ్మే తత్వశాస్త్రం చదివేవారికి ఇది ఒక reference book. అలాంటి పుస్తకాన్ని సమీక్షిస్తూ విమర్శించటం, అదీ, రెండుముక్కల్లో,, కాస్త ఘాటే, మా స్థాయిలో. ఇక ఘాటుకు ప్రామాణికాలు పెద్ద చర్చ అవుతుంది. అది మరోసారి.
  శివరాం ప్రసాద్ గారూ,

  మేధావుల పది పాయింట్లు అభ్యుదయవాదులకూ సరిపోయేట్టున్నాయి. గమనించండి.

 10. SIVARAMAPRASAD KAPPAGANTU - May 17, 2010

  అభ్యుదయ వాదులు!! ఎవరండీ వాళ్ళు? కొన్ని పడి కట్టు మాటలు నోటన చేర్చి వామ పక్ష వాదాలను చాలా జాగ్రత్తగా ప్రచారం చేస్తుంటారు వాళ్ళేనా?

  మంచు గారూ. నేను నా బ్లాగులో మేధావి అంటే అని ఒక వ్యాసం వ్రాద్దామని అనుకున్నాను, కొడవటిగంటి కుటుంబరావుగారి మేధావి నిర్వచనాన్ని కూడా ఉదాహరించి. ఈ పది లక్షణాలు ఏవో కొన్ని మాత్రమె, మనం రోజూ చూస్తుంటే మన చుట్టుపక్కల కనపడే మేధావులు ఇంకా కొన్ని లక్షణాలను ప్రకోపిస్తూ ఉంటారు. హాయిగా వాడుకొండి మీ బ్లాగులో.

 11. రవి - May 17, 2010

  మురళీకృష్ణ గారు, ఇదొక చాపకింద నీరులా వ్యాపిస్తున్న జాడ్యం. కొన్నేళ్ళుగా వ్యాపిస్తూ, ఈ మధ్య బలంగా వేళ్ళూనుకుంది. ఎత్తిచూపి మంచిపని చేశారు.

Leave a Reply