దశావతారం-ఒక దోషావతారం.

నార్సిస్సస్ గురించి అందరికీ తెలుసు.తన అందం చూసి తనని తానే మోహించిన వ్యక్తి అతడు. తన అందం చూసి మురిసిపోవటాన్ని నార్సిసం అంటారు. ప్రతి కళాకారుడిలో నార్సిజం తప్పనిసరిగా వుంటుంది. అది లేకపోతే, కళాకారుడు కళను సృజించలేడు.అయితే, ఈ నాసిజం హద్దులుదాటితే, అతని కళ దెబ్బతింటుంది.కళ స్థానాన్ని కూడా కళాకారుడే ఆక్రమిస్తాడు. ఇందుకు మంచి ఉదాహరణ కమలహాసన్ నిర్మించి నటించిన దశావతారం!

కమలహాసన్ నటనాపటిమ గురించి ఎవరికీ సందేహాలు లేవు. మన దేశంలో వున్న అత్యద్భుతమయిన నటులలో అగ్రస్థానాన్ని ఆక్రమిస్తాడు. మన సినిమాల్లో నటులకు తమ నటనను ప్రదర్శించేందుకు సరయిన అవకాశాలు రావు. అయినా సరే, తానే తన నటన ప్రతిభను ప్రకటించే రీతిలో సినిమాలు రూపొందిస్తూ వస్తున్నాడు కమల్. ఇది చేయటానికి కూడా నటుడికి ఆత్మ విశ్వాసంతో పాటూ, నార్సిజం కూడా అవసరమే. అయితే, దశావతారం చూస్తూంటే, కమల్ నార్సిజం హద్దులు దాటిందని పిస్తుంది.

ఎప్పుడయితే, నటుడి ఇమేజీ కోసమని స్క్రిప్టును విస్మరిస్తారో అప్పుడు నటుడే కాదు సినిమా కూడా దెబ్బ తింటుంది. దశావతారం సినిమాలో కమల్ ఉన్నాడు. అద్భుతమయిన స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కానీ స్క్రిప్తు లేదు.

సినిమాలో ఎంత సేపూ కమల్ పాత్రలను ఎలా తెరపైకి తేవలన్న ఆత్రం తప్ప వారిని కథలో విడదీయరాని భాగంగా చేయాలన్న తపన కనబడదు.ఎదో ఒకటి చేసి తెరపైన గోల చేయాలన్న ఆత్రం తప్ప కథను ఒక పద్ధతి ప్రకారం, ఒక సన్నివేశంలోంచి, మరో సన్నివేశంలోకి, అవిచ్చిన్న ధారలా కథనాన్ని రూపొందించాలన్న ఆలోచన లేదు. దాంతో, తెరపైన ఒకదాని తరువాత మరొకతి అర్ధంలేని సన్నివేశాల పరంపరలు,  కాలము, స్థలాలతో సంబంధం లేకుండా, వస్తూంటాయి. పోతూంటాయి. కొన్ని నవ్విస్తే, మరికొన్ని విసుగు కలిగిస్తాయి. చిరాకు తెప్పిస్తాయి.

time and space గురించి ఆలోచిస్తే,  దశావతారం లో అవి ఏకోశానా కనబడవు. లాజిక్ సునామీకన్నా 1200 సవంత్సరాలముందే ఎక్కడికో కొట్టుకు పోతుంది. సినిమా అంతా ఏపాత్రను చూసినా అది కమల్ హాసనా అని వెతకటంలో సరిపోతుంది. ఒక దశలో మల్లికా అనిచెప్పి ఆ పాత్రకూడా అతనే వేశాడేమో అన్న అనుమానం వచ్చింది. పది పాత్రలు వేసేయాలన్న ఆత్రం తప్ప ఆ పాత్రలను సరిగా తీర్చిదిద్ది, వాటికి విషిష్టమయిన వ్యక్తిత్వాన్నిచ్చి, ప్రత్యేకంగా నిలిపి, మరపురాని నటన ప్రదర్శించాలన్న ఆలోచనను కమల్ ప్రదర్శించలేదు. పొడుగు వాడిలా, సిక్కు గాయకుడిలా, ముసలామెలా కమల్ వేయాల్సిన అవసరమే లేదు. అవి అర్ధం లేని పాత్రలు. దళిత నాయకుడి పాత్ర కావాలని చొప్పించారు. పదో పాత్ర కావాలి కదా! ఇక కిరాయి హంతకుడిలా, దట్టించిన మేకప్ తో అసహ్యంగా వున్నాడు. కృత్రిమత్వం తెలుస్తూనేవుంది. బుష్ పయిన జాలి కలిగింది. 13 వ శతాబ్దం వీరుడిని చూస్తే పాపం పిచ్చివాడు అనిపించింది. గుడిలో అంత రక్త పాతం చేసి, హీరోయిజం తప్ప సాధించిందేదీ లేదు. హీరోగా కమల్ ముసలివాడయిపోయాడని తెలిసింది. వయసుకు తగ్గ విభిన్న పాత్రలపయిన దృష్టి పెడితే మంచిది. దేవుడున్నాడా లేడా అన్న చర్చ తెలికగా, పనికిరాని రీతిలో వుంది. చివరి దృష్యంలో, హీరో, హీరోయిన్లు, పడవ దగ్గర నిలబడి, ప్రేమ మాటలు మాట్లాడుతూంటే, నేపధ్యంలో ప్రజలు అటూ ఇటూ పరుగిడుతూంటారు. అంతా సునామీలో చిక్కి గోలగా వుంటే వీళ్ళాకసలీ చర్చ ఎలా చేయాలనిపించిందనిపిస్తుంది. గమనిస్తే, వెనక మనుషులు, అక్కడక్కడే చుట్టూ తిరుగుతూ వేదన నటిస్తున్నారని తెలుస్తుంది. కమల్ తన మేకప్పుపయిన చూపిన శ్రద్ధ సినిమాలో ఇంకే అంశంపయిన చూపలేదని ఇది నిరూపిస్తుంది.

ఇక జపాన్ వాడి పాత్రలో కమల్,  deformed చీనా వాడిలా అనిపించాడు. సీబీఐ వాడి పరిశోధన చూస్తే, మన దేశంలో తీవ్ర వాదులు ఇంత స్వేచ్చగా ఎలా తిరుగుతున్నారో అర్ధమవుతుంది.ఇక సంగీతం గోల గోలగా వుంది. ఒక్క నాయిక పాడే పాట వినసొంపుగా వుంది. ఇళయరాజా లేని లోటు తెలుస్తోంది. సునామి స్పెషల్ పరవాలేదనిపిస్తుంది.అయితే, సినిమా చూసిన తరువాత రోడ్డు మీద కనబడిన ప్రతివాడూ వేశమేసుకున్న కమల్ అనిపిస్తారు.

కమల్ కు ఒక ఉచిత సలహా.వొచ్చే సినిమాలో అన్ని వేశాలూ ఆయనే వేస్తే, ప్రేక్షకులకు కమల్ ను వెతికే బాధ తప్పుతుంది. స్క్రిప్టు పయిన అప్పుడూ దృష్టి పెట్టకపోతే, ఆ సినిమా కమల్ ఒక్కడే చూసుకోవాల్సివస్తుంది.          

Enter Your Mail Address

June 27, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.

No Responses

 1. నవీన్ గార్ల - June 27, 2008

  >> వొచ్చే సినిమాలో అన్ని వేశాలూ ఆయనే వేస్తే,
  అప్పుడు ప్రక్షకుడి పాత్ర కూడా ఆయన ఒక్కరే వేయాల్సుంటుంది ;)

 2. రవి - June 27, 2008

  హహహ బాగా వడ్డించారు.

 3. vak50 - June 27, 2008

  http://tiramisu167.blogspot.com/
  please see this link

 4. సుజాత - June 27, 2008

  మీరిక పుస్తకాల సమీక్షతో పాటుగా సినిమా సమీక్ష కూడా రెగ్యులర్ గా చేయాలండి!

  పొడుగు వాడి సంభాషణలు ఒక్కటంటె ఒక్కటీ అర్థం కాలేదు నాకైతే! బుష్,కరీముల్లా ఖాన్,ఒట్టి పిండి ముద్దలు! పాత్ర, మేకప్ పరం గా కూడా! ‘మల్లిక వేషం కూడా..” బాగా చెప్పారు.

  సునామీ సంఘటన కూడా మీరు చెప్పినట్టే ఉంది. దాదాపు అందరికీ ఇలాగే అనిపించింది. ఒక్క బలరాం నాడార్ పాత్ర ఒక్కటే బాగుంది.

  ఎక్కువ అంచనాలు పెట్టుకున్న సినిమాలన్నీ ఇలా నిరాశ పర్చడం సినిమా సూత్రం కాబోలు.

 5. సుజాత - June 27, 2008

  ఇంకొక మాట! హరి హరన్ ‘రాహిని మాత్రం ‘(రాయిని మాత్రం) అని పాడటం పంటికింద రాయి.

 6. కె.మహేష్ కుమార్ - June 27, 2008

  బాగా చెప్పారు. కమల్ హాసన్ ను ఆ self love నుండీ ఎవరైనా బయట పడెయ్యాలి. కాకపోతే “లోక నాయకుడా” అని పాడి దాన్ని ఇంకా చిక్కగా చేసినట్టున్నాడు ఈ సినిమా డైరెట్రు.

 7. ashok - June 27, 2008

  baasu…..

  neti heros vishyaniki vasthe natana ante theliyadu…navarasala poshana ante theliyadu. mukam lo e rasam choopinchaleru…rodla venta adukku thine pichhivaani laga aa gaddalu , juthhu, mukam…..(inka vundi)

 8. వేదాంతం శ్రీపతిశర్మ - June 27, 2008

  దశావతారం చలనచిత్రం దోషావతారమే! సందేహం లేదు.
  పెరుమాళ్ వారి ఉత్సవ విగ్రహాన్ని ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్లి ఆఖరుకి శ్మశానంలోకి కూడా తీసుకుని వెళ్లి చిత్రీకరించవలసిన గొప్ప ఇతివృత్తమా ఇది? ఎందరి మనోభావాలను హింసించి వుంటుంది ఈ పైత్యం?
  మేకప్ మీద ఈ నటుడి హావభావాలు, నటనా కౌశలం ఎవరు చూడ గలిగారు?
  ఇది మేకప్ కూడా కాదు! ఇది మాస్క్ అని అనాలి.నేను కూడా పది మాస్కులు తగిలించుకుని దిగిపోతాను. ఎవరు చెప్ప గలరు?
  ‘ లోకనాయకుడ ‘ పాట నాకైతే ‘ దొంగ నా…’
  అని తిట్టినట్లున్నది.
  కరడు గట్టిన టెరరిస్టులకు ఈ సినిమా వరుసగా పది సార్లు విరామం లేకుండా చూపిస్తే చాలు. అన్ని సమస్యలూ తీరిపోతాయి!
  కమలహాసన్ ఒక గాఢమైన పాత్ర, చక్కని కథ, భావ విన్యాసం గల సన్నివేశాలు, చక్కని సంగీతం ఎంచుకుని నటిస్తే ఇంకనూ చూసే అభిమానులున్నారు.
  కాకపోతే ఆయనకు సంభవిస్తున్న అర్థరహితమైన ఒరవడుల బరువుతో ఈ చిత్రంలో చూపించినట్లు ఆయనలోని నటన,ఇతర కళలు అట్టడుగుకు మునిగిపోవు సూచనలు కనిపిస్తున్నాయి.

 9. Rambabu - July 8, 2008

  You should stop this type of open statements.
  First of all you must understand how the movie is.
  12వ శతాబ్దంలో మొదలైన ‘దశావతారం’ చిత్ర కథ నేటి కాలంలో ముగుస్తుంది. 12వ శతాబ్దంలో శైవులకు, వైష్ణువులకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉంటుంది. అప్పటి శైవ రాజు రెండవ కుళోత్తుంగ చోళుని(నెపోలియన్) అరాచకాలతో పేట్రేగి పోతూంటాడు. విష్ణు భక్తుడైన రంగరాజ నంబి(కమల్ హాసన్) ఆ రాజుకు ఎదురు తిరుగుతాడు. దాంతో శివ నామస్మరణ చేయమని అతనిపై రాజు ఒత్తిడి తెస్తాడు. ఒప్పుకోని నంబికి మరణ దండన విధిస్తాడు చోళుడు. తనను ఉరి తీసే సమయంలోనూ నంబి విష్ణు విగ్రహాన్ని వదలడు. ఆ విగ్రహంతో పాటు నంబి మృతదేహాన్ని సముద్రంలో పారేయిస్తాడు చోళుడు. ఆ తర్వాత కథ నేటి కాలంలోకి మారుతుంది. ఈ ఆధునిక కాలంలో కమలహాసన్ అమెరికాలో సైంటిస్టుగా కనపడతాడు.అతను బయోవార్ కి సంభందించిన వైరస్ తయారుచేస్తాడు.కానీ రియలైజ్ అయ్యి దాన్ని అంతం చెయ్యాలనుకుంటాడు. ఒప్పుకోని అక్కడి వారు మరో తెల్లవాడ్ని (మళ్ళీ కమలే) అతన్ని లేపేయమని పురమాయిస్తారు.
  all the charecters is this movies is related to sunami not to story. If you don’t know how to coment in a movie stop this blog or else i have to complaint on you.

Leave a Reply