ఇదే ప్రగతా?
నేటి ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సగటుమనిషిస్వగతం శీర్షికన ప్రచురితమయిందీ వ్యాసం.
July 11, 2010
·
Kasturi Murali Krishna ·
One Comment
Posted in: నా రచనలు.
నేటి ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సగటుమనిషిస్వగతం శీర్షికన ప్రచురితమయిందీ వ్యాసం.
July 11, 2010
·
Kasturi Murali Krishna ·
One Comment
Posted in: నా రచనలు.
One Response
అమెరికాలో పంతొందేళ్ళ వయసుకన్నా తక్కువ పిల్లలతో సంపర్కం రెండుపార్టీల
ఇష్టత ఉన్నా శిక్షార్హం.
నెట్ ద్వారా లైంగిక కార్యక్రమాలు చేసే పెద్దమనుషులను ఏరిపట్టే ఓ ప్రత్యేక
విభాగం ఉంది. దొరికిన వారిని కఠినంగా శిక్షిస్తున్నారు.
ఇక్కడ విచ్ఛలవిడి శృంగారం అనుకుంటారు చాలా మంది. తక్కువ వయసులో
తల్లులయ్యే శాతం కూడా ఎక్కువేకదా? అవును. వాటికి కారణాలు వేరే. నేర
ప్రవృత్తి. ఆ ప్రవృత్తిపట్ల ఆరధనా భావం, తెలిసీ తెలియని వయసులో
తల్లితండ్రుల అవివేకంవల్ల చెదిరే మనసులు, కలిగే ఇన్సెక్యూర్ అవస్థలవల్ల
స్వాంతనకోసం వెంపర్లాడే మనసుతో తనువులకలయిక, డ్రగ్స్ వైపు అడుగులేయుట -
*హై* గా ఉన్నప్పుడు జరిగే సెక్సువల్ ఇంటెరాక్షన్స్. సిన్గిల్ పేరెంట్
సిస్టం, మారు తండ్రి లేక తల్లి – వాటివల్ల కలిగే నష్టాలు కష్టాలు …
కానీ! మనది ఘన సంస్కృతి. కనీసం అలా చెప్పుకుంటాం.
కస్తూరి మురళీకృష్ణగారి ఆవేదన నిజంగా ఆలోచింపచేసేదిగా ఉంది. ఐతే,
అటువైపునుండి రెచ్చగొట్టే ఘనులను కట్టడిచేసే న్యాయం చట్టం మాటేమిటి?
ఇప్పటికి ఎందరు దొరికారు, ఎందర్ని దొరకపట్టటానిక్ వ్యూహాలు పన్నారు? అసలు
ఎందికిలా జరుగుతోందీ? వీటీమూలాలేంటి?
చట్టం న్యాయం గట్టిపడనంతవరకూ ఇత్యాది హేయ విపరీత మానసిక రోగాలు
పెగుగుతూనే ఉంటాయి. కేవలం కాయితంపై గీతలైన చట్టాలు దేన్నీ ఆపలేవు.
కానీ!! తల్లితండ్రులు మాత్రం ఆపగలరు. ఎలా?
ఎగువ మధ్యతరగతి లేక పై తరగతుల్లో ఉన్న కుటుంబాల్లో మాత్రమే కంప్యూటర్ +
ఇంటర్నెట్ ఉంటుంది. మధ్యతరగతి జీవాల్లో కంప్యూటర్ మాత్రమే ఉండే
అవకాశాలున్నాయి.
ఎగువ మ.త లేక పై తరగతుల్లోని తల్లితండ్రులు డబ్బు సంపాదనపై చూపినంత
ఇంటరెస్టు లేక సంపాదనకై వెచ్చించే సమయం పిల్లలు ఏంచేస్తున్నారూ అనే
పార్శ్వంపై చూపకపోవటం వారి దౌర్భాగ్యం. ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ఇళ్ళలో
తల్లితండ్రులు, పిల్లలు ఏఏ వెబ్సైట్లను చూస్తున్నారూ? ఏఏ అప్లికేషన్స్ ని
వాడుతున్నారూ లాంటి ఇట్టే పట్టేయవచ్చు. అలానే ప్రాక్సీని సెటప్ చేస్కునో
లేక ఫైర్వాల్ ని సెటప్ చేస్కునో యాక్సెస్ ని కంట్రోల్ చేయవచ్చు. ఐతే
రుచిమరిగిన ప్రాణి బయటకు వెళ్ళి నెట్ సెంటరులో ఈ కార్యకలాపాలు సాగించదా?
ఇక ఇంకోజాతి – ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళి ఇలాంటి క్రీడలు జరుపుట
వీక్షించుట – దీనికి మందు లేదు కేవలం చట్టం తప్ప. ఐతే, ఇది సదరు
ఇంటర్నెట్ సెంటర్ వ్యాపారికి మూలాధారం. కావున, చట్టాని కొనటానికి
ప్రయత్నిస్తాడు వాడు. మరి పరిష్కారం ఏంటీ?
నా దృష్టిలో ఇలాంటివాటికి కారణాలు – సమయాన్ని సరైన విధానంలో
వాడుకోవలేకపోవటం ఒక ఎత్తైతే, మానసిక వెతలు మరియూ గాయాలు వాటిని
పంచుకునేందుకు వెతుకులాటలో వేసే తప్పటడుగులు, ఒత్తిడులు [పీర్
ప్రెషర్స్], అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలని మార్కులు తెచ్చే యంత్రాల్లా
తయారు చేస్తున్న కార్పోరేట్ కాలేజీలు, స్పోర్ట్స్ అనేదానికి అర్ధంలేకుండా
చేసిన విద్యాలయాలు, క్రికెట్ మాత్రమే స్పోర్ట్ అని చిత్రిస్తున్న మీడియా.
వీటివల్ల కలుగుతున్న అంతరాలు పెనుభూతాలై డ్రగ్స్ వైపుకి విచ్ఛలవిడి
శృంగారం వైపుకీ నెట్టబడుతున్నారు టీనేజీ పిల్లలు.
ఆడపిల్ల పెళ్ళివయసు పద్దెనిమిదినుండి పదహారుకో లేక ఇంకా తక్కువకో
మొగపిల్లాడి వయసు ఇరవై ఒకటినుండి తక్కువకు మార్చాలి అని ఇంతకముందు ఎక్కడో
ఓ చర్చ జరిగినట్టు లీలగా గుర్తుంది. అంబానాథ్ అనే బ్లాగరి యొక్క బ్లాగ్
లో అనుకుంటా.
Leave a Reply