నా బ్లాగుకు వర్షాకాలం వచ్చింది!

అవును, నా బ్లాగుకు వర్షాకాలం వచ్చేసింది. నల్లటి మేఘాలు దట్టంగా అలముకున్నాయి. తీవ్రమయిన గాలులు, ఘోరంగా, ప్రచండ వేగంతో వీస్తున్నాయి. ఇంత జరుగుతున్నా, వాన వస్తుందో, లేదో తెలియని పరిస్థితి. నా బ్లాగు కూడా అలాంటి డోలాయమాన పరిస్థితిలో వచ్చింది.

వాన రాకడా, ప్రాణం పోకడా చెప్పలేమంటారు. అలాగే, ఇకపయిన, నేను ఎప్పుడు పోస్టింగ్ చేస్తానో తెలియని పరిస్థితి ఏర్పడింది. నేను నాందేడ్ వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చింది.

నాకు, మా ఆఫీసులో ప్రమోషన్ వచ్చింది. నాందేడ్ లో పోస్టింగ్ వచ్చింది. దాదాపుగా ఒక సంవత్సరం అక్కడ పని చేశాను. చివరికి విసిగి, లాంగ్ లీవ్ పెట్టి, ఎండాకాలమంతా ఇంట్లో, రాసుకుంటూ, పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ, బ్లాగుతూ గడిపేశాను. కానీ, ఇప్పుడిక వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చింది. కాబట్టి, రేపు నాందేడ్ ప్రయాణమవుతున్నాను.ప్రతి శని, ఆది వారాలు హైదెరాబాదు వస్తాను. కానీ, ఆ రెండు రోజులలోనే వారమంతా ఇవ్వాల్సిన రాతలు రాసేసి ఇచ్చేసి పోవాల్సివుంటుంది. అయినా సరే, వీలున్నప్పుడలా బ్లాగుతూనేవుంటాను. నాందేడులో కూడా అవకాశాన్ని చూసుకుని బ్లాగుతాను. ఎలాగయినా బ్లాగ్లోకంలో మితృలతో connect అయి వుండాలనే నా పట్టుదలను, అకుంఠిత దీక్షను మితృలంతా గుర్తించి, అభినందించి, ప్రోత్సహించాలని వేడుకుంటున్నాను. ఎప్పుడు వస్తుందో తెలియని వర్షంలా వర్షించే నా రాతలు కోతలను అనుభవించి ఆనందించాలని ప్రార్ధిస్తున్నాను.

మళ్ళీ ఎప్పుడో నాకు మంచి రోజులు వస్తాయన్న ఆశతో, ఆకశంతో సంబంధంలేకుండా వర్శిస్తున్న తడి కళ్ళతో, రేపు నాందేడ్ ప్రయాణమవుతున్నాను.

ఇకపయిన, హైదెరాబాదులో పడే ప్రతివర్షం నా కన్నీటి ధార  అని గ్రహించ ప్రార్ధన! 

Enter Your Mail Address

June 30, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

No Responses

 1. chavakiran - June 30, 2008

  >> ఎప్పుడు వస్తుందో తెలియని వర్షంలా వర్షించే నా రాతలు కోతలను అనుభవించి ఆనందించాలని ప్రార్ధిస్తున్నాను.

  tappakuMDaa..

 2. సుజాత - June 30, 2008

  నాందేడ్ నుంచి కూడా అవకాశం కల్పించుకుని మరీ రాయాలని కోరుతున్నాను. మీ రాతలు రెగ్యులర్ గా చదివే వాళ్ళలో నేనొకరిని. నిన్ననే మీ రాజ తరంగిణి కథలు చదివాను. దాని గురించి మీకు రాద్దామని నేననుకుంటుంటే, మీరు కాస్తా దూర తీరాలకు వెళుతున్నారు.

 3. cbrao - June 30, 2008

  We miss you.

 4. Purnima - June 30, 2008

  All the Best for you new posting!! Have fun.. memantaa mee kosam eduru choostuntaamu..

  anukuntaamu gaani.. vaana lo koodaa boledu andam untundi. kurise chinukullaa.. mee manasu loni aksharaalu koodaa blog pai kuravaali ani korukuntoo..

  purnima

 5. రాజేంద్ర - June 30, 2008

  మీరు మరీనండి మురళీ గారు,మీ అభిమాన చిత్రరాజాలు పాండురంగడు,దశావతారం అక్కడికి రావాఏంటి?వాటి బాబులుకూడా వస్తాయి.

 6. రాజేంద్ర - June 30, 2008

  మన్నించాలి,ఇందాక కరంటు పోవటం తో వ్యాఖ్యసగములో ఆగిపోయింది.నాందేడ్ ఎంతదూరం లేండి,అయినా వారంవారం హైదరాబాద్ వస్తానంటున్నారు కదా!మీరు మరిన్ని ఉన్నతశిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..

 7. netijen - June 30, 2008

  క్షేమంగా వెళ్ళి, బ్లాగంగా రండి!
  సమయమున్నప్పుడల్ల బ్లాగండి!
  మరిన్ని శిఖరాలు అధిరోహించండి!
  మీ రాతలు కోసం ఎదురుచూసే వారున్నారు..

 8. sujata - June 30, 2008

  Dont worry. Edi jariginaa, mana manchike lendi. God Bless you. Good luck.

 9. jyothi - June 30, 2008

  congratulations and all the best ..
  we dont miss u. becos u ll be in hyd and write more in weekends..

  take care

 10. కస్తూరి మురళీకృష్ణ - June 30, 2008

  బ్లాగు మితృలందరికీ ధన్యవాదాలు. నేను కూదా వీలయినంత వరకూ ఎదో ఒకటి బ్లాగుతూండే ప్రయత్నం చేస్తాను.తిరిగే కాలు, తిట్టేనోరూ ఊరుకోనట్టే బ్లాగే వేలు కూడా ఊరుకోదు.(నాది ఒక వేలి రాత).
  సుజాత గారూ,

  రాజతరంగిణి కథలు చదివానని చెప్పి ఊరించారు. త్వరగా మీ అభిప్రాయం బ్లాగు ద్వారానయినా, నాకు వ్యక్తిగతంగా ఏ మెయిలు ద్వారా నయినా తెలుప ప్రార్ధన.

  రేపు సగటు మనిషి స్వగతంతో సెలవా మరి. ఇక పయిన సగటు మనిషిని మంగళ వారం బదులు శనివారానికి తరిమేస్తున్నాను.

  అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఆకాశం కురుస్తానని బెదిరిస్తూనేవుంది. నా కళ్ళు మాత్రం కాలువలయి, వరదలయి, అయ్యూఅ ఇక చెప్పలేను.

Leave a Reply