మహమ్మద్ రఫీ- శ్రద్ధాంజలి.
ఈవేళ సాయంత్రం
ఆరున్నరకు, త్యాగరాయ గాన సభ మినీ హాలులో మహమ్మద్ రఫీకి శ్రద్ధాంజలి అర్పిస్తున్నాము.
రఫి పాటలలోని వంపులను, సొంపులను, ఇంపులను, కెంపులను నేను వివరిస్తూంటే, రాధాకృష్ణ గారు గానం చేస్తారు.
అందరికీ ఇదే ఆహ్వానం.
టీవీ కార్యక్రమాల శ్రద్ధాంజలుల్లా అవగాహన రాహిత్యాలు, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు, పైపై మాటలు వండవు. రఫీ పాటలను మనసుతో విని, మనసులోలోతుల స్పందనలను మాటలలఒ వ్యక్త పరచే వ్యాఖ్యలతో వుంటుందీ కార్యక్రమం.

తప్పకుండారండి. మీ అభిప్రాయాలను, సూచనలనూ నిర్మొహమాటంగా తెలపండి.
July 30, 2010
·
Kasturi Murali Krishna ·
No Comments
Posted in: సంగీత మహారధులు

Leave a Reply