రంగనాయకమ్మ గారూ, పద్మలత నేను కాదు……

మన బ్లాగులోకంలో అనానిమస్సు వ్యాఖ్యలున్నట్టే , పత్రికల ప్రపంచంలో మారుపేర్ల విమర్శలుంటాయి.
ఇటీవలె నవ్యలో రామాయణం ఆధారంగా రంగనాయకమ్మ గారికీ కొందరికీ వాదోపవాదాలు జరిగాయి.

ఆ వాదనలలో పద్మలత అన్న పేరుతో కొన్ని వాదనలు ప్రచురితమయ్యాయి.

ఆ పేరుతో రాసినది నేనేనని రంగనాయకమ్మ గారూ ఆమె సన్నిహితులూ భావిస్తున్నట్టు నాకు తెలిసింది.

నేను పద్మలత పేరుతో ఎలాంటి రాతలు రాయలేదు.

ముఖ్యంగా, నేను విమర్శలను నా పేరుతోనే చేస్తాను. మరోపేరూ, మారు పేర్లతో నేను విమర్శలు చేయను. అదీగాక, రంగనాయకమ్మ గారంటే నాకు అభిమానము వుంది. గౌరవము వుంది. పైగా, ప్రస్తుతం జరిగిన వాదోపవాదాలు అనవసరమనీ, సమయం వ్యర్ధం అవటం తప్ప మరేలాభమూ లేదని నా అభిప్రాయం. అసలింత వివాదమే వ్యర్ధమని నా అభిప్రాయం. కాబట్టి, నేను ఇలాంటి   చర్చల జోలికి పోనే పోను.

నేను పద్మ పేరుతో ఆంధ్రభూమిలో పుస్తక సమీక్షలు రాస్తాను. ఎందుకంటే ఆంధ్రభూమిలో పవర్ పాలిటిక్స్ అని మరో శీర్షిక వుంది కాబట్టి.  అంతే తప్ప సాధారణంగా నేను మారుపేరు వాడను.

కాబట్టి నవ్యలో ఆ రాతలు రాసిన పద్మలత నేను కాదు. అదెవ్వరో నాకు తెలియదు. పద్మలత రాతలకు కానీ, నవ్యలో వివాదానికి కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు.

నాకేదయినా నచ్చకపోతే, అవసరమనిపిస్తే, నేను రచనలద్వారా ఆ వాదనని పూర్వ పక్షం చేస్తాను కానీ చర్చలు, వాదనలకు దిగను.

మరోసరి నొక్కిచెప్తున్నాను నాకు వీటితో ఎలాంటి సంబంధం లేదు.

ఇటీవలే ఒక సందర్భంలో నేను నా సన్నిహితులతో ఒక మాటన్నాను. ఒక చెవి కొరికే పామువల్ల ఒక ఎడిటర్ నన్ను అపార్ధం చేసుకున్నాడు. అప్పుడు… నేను అనేమాటలకన్నా, అనని మాటలవల్లనే నాకు సమస్యలు వస్తాయని. ఇప్పుడు దాన్ని మార్చి నేను రాసే రాతలకన్నా, రాయని రాతలవల్లే నాకు సమస్యలు వస్తాయనాల్సివస్తున్నది.

Enter Your Mail Address

November 7, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

Leave a Reply