పుస్తక ప్రదర్శనలో సైన్స్ ఫిక్షన్ కథలు పుస్తకం.

ఇవాళ్తి పుస్తక ప్రదర్శనలో నా సైన్స్ ఫిక్షన్ కథలు అనే కొత్త పుస్తకం లభ్యమవుతుంది.

ప్రెస్ నుంచి తిన్నగా పుస్తక ప్రదర్శనకే ప్రయాణమవుతోంది.

నేను ప్రస్తుతం ప్రాణహిత పుష్కర స్నానంలో వున్నాను. కాబట్టి, నా స్నేహితుడు పుస్తకాలను ఎక్సిబిషన్ చేరుస్తున్నాడు.

పుస్తకావిష్కరణ సభలాంటిదేమీ లేకుండా తినగా అమ్మకానికి చేరుకుంటోందీ పుస్తకం.

నవోదయా వారు సోల్ డిస్ట్రిబ్యూటర్ ఈ పుస్తకానికి. కాబట్టి స్టాల్ నంబరు 25 లో మాత్రమే ఈ పుస్తకం లభ్యమవుతుంది. బ్లాగరులంతా ఈ పుస్తకాన్ని కొని, చదివి, తమ నిర్మొహమాటమయిన అభిప్రాయాలతో నాకు ప్రోత్సాహం ఇస్తారని ఆశిస్తున్నాను.

నేను సోమవారం నుంచీ ఎక్సిబిషన్ కు వస్తాను. ఈ స్టాలులో అందరినీ కలుస్తాను.

Enter Your Mail Address

December 17, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

Leave a Reply