అకాడెమీవారేమన్నారంటే……….

1150 కి అకాడెమీ వారు ముహూర్తాన్ని నిర్ణయించినా, అరగంట ఆలస్యంగా వచ్చారు అద్మినిస్తృఏటివ్ ఆఫీసర్.

వచ్చింది అసలు ఆఫీసరు కాదు. అసలాయన సెలవులో వుండటంతో పిళ్ళై అనే ఆయన వచ్చాడు.

ముందుగా, ఆయన , శ్రీనివాస్ గారికి ఈ సమాచారం ఎందుకో తెలుసుకున్నాడు. ఆ తరువాత మీరేదయినా అవార్డుకోసం ప్రయత్నిస్తున్నారా? అని అడిగాడు.

కాదు, అవార్డులెలా ఇస్తారో తెలుసుకుందామని అని సమాధానం ఇచ్చారు శ్రీనివాస్.

అయితే వివరాలివ్వటం కుదరదన్నాడాయన.

నాకు ఈ సంవత్సరం అవార్డు కమిటీ వివరాలు కాదు, అయిపోయిన సంవత్సారానివి అని శ్రీనివాస్ చాలా మార్లు చెప్పిన తరువాత ఆయన గారికి విషయం అర్ధమయింది.

వెంటనే గతంలో ఇచ్చిన సమాచారాన్నే ఇచ్చాడు.

మాకు కావాల్సింది  ఎవరెవరు ఏయే రచనను నామినేట్ చేశారు, దానికి వారు చెప్పిన కారణాలేమిటి, ఏయే రచన గురించి ఎవరెవరు ఎలా అభిప్రాయాలను వ్యక్తం చేశారు? ఇతర రచనలను ఏయే వ్యాఖ్యలతో తిరస్కరించారు? ద్రౌపదిని ఇతర రచనలకన్నా ఎలా మిన్నగా నిర్ణయించాౠ? ఆ వివరాలు కావాలి అని అడిగారు శ్రీనివాస్.

కాస్త తర్జనలు భర్జనల తరువాత ఆ వివరాలను త్వరలో అందచేస్తామని అన్నారు. వారీ వివరాలు ఇచ్చిన వెంటనే అవి మీముందుంటాయి.

అసలు విషయాలు అందరికీ తెలుస్తాయి.

నిజానికి మీడియా వారు ఈ పని చేసి ఎక్స్క్లూజివ్ న్యూస్ ఐటం అంటూ వేసుకోవచ్చు. కానీ, వారికి అక్రమ సంబంధాలు, ఆత్మహత్యలు, హత్యలు, నేరాలను పరిశోధించి చూపటంలో వున్న ఆసక్తి పరిశోధనాత్మక విషయ సేకరణపైన లేదు కాబట్టి మనలాంటి మామూలు వ్యక్తులు రంగంలోకి దూకాల్సివస్తోంది.

మిగతా వివరాలు త్వరలో……

Enter Your Mail Address

December 28, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: ద్రౌపది

Leave a Reply