నా సరికొత్త పుస్తకం తయారవుతోంది……..

నా సరికొత్త పుస్తకం తయారవుతోంది.

ఆంధ్రభూమి వార పత్రికలో సీరియల్ గా వస్తున్న శ్రీ కృష్ణదేవరాయలు మార్చి నెలాఖరులోగా పుస్తక రూపంలో విడుదలవుతోంది.

సీరియల్ గా వస్తున్న సమయంలో ఆ నవలకు వస్తున్న విశేష స్పందన నాకు ఆనందాన్ని కలిగించటమేకాదు,  ఆత్మ విశ్వాసాన్ని పెంచింది కూడా.

ఒక మంచి రచన వున్నట్టు తెలిస్తే తెలుగు పాఠకులు దాని విస్మరించరన్న నా నమ్మకానికి వూపు నిచ్చింది.

కిరాయి హంతక విమర్శకులు నా రచనలను ఎంతగా తక్కువ చేయాలని చూసినా, పాఠకుల ఆదరణ పెరుగుతోందే తప్ప తగ్గటంలేదు.

శ్రీ కృష్ణదేవరాలు సీరియల్ కు వస్తున్న స్పందన ఈ నిజాన్ని నిరూపిస్తుంది.

పుస్తకం గురించిన వివరాలు త్వరలో……

Enter Your Mail Address

February 27, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

Leave a Reply