మొత్తానికి నాకూ ఓ అవార్డు వచ్చింది!

అవును ఇది నిజం!!1

ఈ ఉగాది రోజు ప్రొద్దున్నే వసుధ పత్రిక ఎడిటర్ ఫోను చేసి నాకు అభినందనలు తెలిపారు. ఎందుకో నాకు అర్ధం కాలేదు. అప్పుడాయన చెప్పారు, ఆంధ్ర సారస్వత సమితి వారు నాకు ఉత్తమ జర్నలిస్టు అవార్డిచ్చారని ఈనాడు స్థానిక ఎడిషన్ లో వచ్చిందని చెప్పారు.

నేను వృత్తిరీత్య జర్నలిస్టును కాను. మరి నాకు ఉత్తమ జర్నలిస్టు అవార్డేమిటా? అనుకున్నాను. ఆయన నాతో పరాచికాలాడరు. కాబట్టి అది నిజమే అయివుండాలి. కానీ నాకు ఎలాంటి సమాచారమూ లేదు. అందుకే ఆనందించాలో, జాగ్రత్త పడాలో అర్ధం కాలేదు. తొందరపడి ముందే కూసే కోయిలల పరిస్థితి గుర్తుతెచ్చుకుని మౌనంగా వున్నాను.

మధ్యాహ్నం కోడిహళ్ళి మురళీ మోహన్ ఫోను చేసి చెప్పాడు. సాక్షి దిన పత్రిక  లో  అవార్డు వచ్చిన వారి జాబితాలో నా పేరు వుందని చెప్పాడు. అప్పుదు పత్రిక తీసి నేనూ చూసుకున్నాను. దాన్లో ఎంబీయస్ ప్రసాద్, శ్రీవల్లి రాధికల పేర్లు వుండటం తో వారితో ఫోనులో మాట్లాడాను. కానీ అధికారికంగా నాకు ఎలాంటి సమాచారము లేదు. కనీసం ఫోనూ లేదు. అందుకని నేను ఎవ్వరితో ఇన్నాళ్ళూ చెప్పలేదు.

ఇవాళ్ళ వుత్తరం వచ్చింది. నన్ను ఉత్తమ జర్నలిస్టుగా గుర్తించారు. అవార్డు ఇచ్చారు.

ఇన్నిరోజులుగా నేను రకరకాల ప్రక్రియలలో పాఠకులు మెచ్చే రీతిలో రచనలు ఎన్ని చేస్తూన్నా, నాకు పాఠకుల మెప్పు , ఆదరణలు లభిస్తున్నాయి తప్ప సాహిత్య ప్రపంచంలో ఎలాంటి గుర్తింపు లభించలేదు. నేను అందుకోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు.

ఇప్పుడు, నాకు ఎలాంటి పరిచయాలూ లేని మచిలీపట్నానికి చెందిన ఆంధ్ర సారస్వత పరిషత్ వారు నన్ను జర్నలిస్టుగా గుర్తించి , బహుమతినివ్వటం నాకు ఆనందాన్నే కాదు, సంతృప్తినీ ఇస్తోంది. నా ప్రతిభను గుర్తించేవారు, అభినందించేవారు వున్నందుకు ఎంతో ఆనందంగా వుంది. ఇదిగో నాకీ బహుమతిని ధ్రువీకరిస్తూ అందిన పత్రం. మే నెల 8వ తారీఖున మచిలీపట్నం వెళ్ళి అందుకోవాలీ అవార్డును.

అందరికీ ధన్యవాదాలు. బహు కృతఙ్నతలు.

Enter Your Mail Address

April 11, 2011 · Kasturi Murali Krishna · 10 Comments
Posted in: Uncategorized

10 Responses

 1. రాజేష్ జి - April 11, 2011

  చాలా సంతోషంగా ఉంది మురళికృష్ణ గారు. అభినందనలు. మీ సాహిత్యసేవను గుర్తించిన ఆంధ్ర సారస్వత పరిషత్ వారికి కృతజ్ఞతలు.

  #సాహిత్య ప్రపంచంలో ఎలాంటి గుర్తింపు లభించలేదు. నేను అందుకోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు.
  :( “ఆ” గుర్తింపులు చేపల బజారులో కొనుక్కునే స్థాయిలో ఉన్నాయి. మీరు ప్రయత్నం చేయకపోవడమే మంచిది. మీకు నా మద్దతు!

 2. jayadev.challa - April 11, 2011

  abhinandanalu sir

 3. బాలు - April 11, 2011

  కంగ్రాట్సండీ, భూమి వీక్లీలో మీ పవర్ పాలిటిక్స్ రెగ్యులర్గా చదువుతాన్నేను. చాలా బాగుంటాయి.

 4. కొత్తపాళీ - April 11, 2011

  మీరు దైనందిన రిపోర్టింగ్ చెయ్యకపోయిన వివిధ పత్రైకల్లో సమకాలీన విషయాల మీద మీరు రాసే విశ్లేషణలు బాగుంటాయి. ఆ విధంగా మీరు జర్నలిస్టే. అందుకోండి, అవార్డుతోబాటు మా అభినందనలు కూడా.

 5. padmarpita - April 11, 2011

  Congrats:)

 6. KumarN - April 12, 2011

  Muralikrishna gaaru,
  Congratulations!.
  Keep writing what you are writing. We are here to read them, and there are very few awards that are worth mentioning anyway!! You are above than many stupid awards out there.

 7. Jyothi valaboju - April 12, 2011

  Congratulations.. you deserve it..

 8. కోడీహళ్లి మురళీమోహన్ - April 12, 2011

  అభినందనలు!

 9. ramani - April 16, 2011

  అభినందనలు!

 10. కొల్లూరి సోమ శంకర్ - April 20, 2011

  చాలా సంతోషంగా ఉంది మురళి గారు. అభినందనలు.

Leave a Reply