శ్రీకృష్ణదేవరాయలు, పుస్తకావిష్కరణ సభ.

ఈనల 3ఒవ తారీఖున గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో నేను రచించిన శ్రీకృష్ణదేవరాయలు పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది. సమయం సాయంత్రం 6 గంటల 30 నిముషాలు.

శ్రీ బొల్లేపల్లి సత్యనారాయణగారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

నేను రేపు రాత్రి నర్సాపుర్ ఎక్స్ప్రెస్ లో బయలు దేరి ముందు విజయవాడ వెళ్తాను. విజయవాడలో కొందరు పత్రికల  ఎడిటర్లను కలుస్తాను. మధ్యాహ్న భోజనం తరువాత గుంటూరు ప్రయాణమవుతాను.

గుంటూరులో పుస్తకావిష్కరణ సభ జరిగిన తరువాత మళ్ళీ రాత్రి నర్సాపుర్ ఎక్స్ప్రెస్ లో తిరిగి హైదెరాబాద్ వచ్చేస్తాను.

ఇది నా గుంటూరు ప్రయాణ ప్రణాళిక.

అయితే, ఈ పుస్తకావిష్కరణ సభ వల్ల నేను ఈనెల హాసం క్లబ్ సభకు హాజరు కాలేక పోతున్నాను.

ఈనెల 26 న శంకర్ జైకిషన్ లలో శంకర్ మరణించిన రోజు. ఎంతో అన్యాయానికి గురయ్యాడు శంకర్ తన జీవిత కాలంలో. అతని వల్ల లాభం పొందిన వారందరూ అతడికి అన్యాయం చేశారు. అతడిని అణగ ద్రొక్కటానికి మొత్తం సినీ పరిశ్రమ ఒకటయింది. అయినా, ఆయన వీలు చిక్కినప్పుడల్లా అత్యద్భుతమయిన సంగీతాన్ని సృజిస్తూ, కళా నైపుణ్యాన్ని ఎవరయినా తాత్కాలికంగా అణగద్రొక్కగలరు కానీ శాశ్వతంగా అణచివేయలేరని నిరూపించాడు. అనేక కారణాలవల్ల ఆయన శంకర్ జైకిషన్ బ్యానర్ కు పునర్వైభవాన్ని సాధించలేక పోయినా, సంగీత దర్శకుల జంటలో ఒకరు పోతే ఇంకొకరు వొంటరిగా మనలేరన్నదాన్ని తప్పని నిరూపించాడు.

ఒంటరిగా శంకర్ సృజించిన కొన్ని మధురమయిన పాటలు. ఇవి.

జబ్ భి యే దిల్ ఉదాస్ హోతాహై
గీత్ గాతాహు మై, గుంగునాతాహు మై
చలొ భూల్ జాయె జహాన్ కొ దొ ఘడీ
చత్రి న ఖొల్ ఉడ్ జాయెగీ
తుమ్హారె బిన్ గుజారేహై
పర్దేశియా తెరే దేశ్ మే
ఎక్ చెహెరా దిల్ కే కరీబ్ లగ్తా హై
పూచా జో ప్యార్ క్యా హై
హం నహీ భూలేంగే
గోరియా హై కలాయియా

ఇంకా బోలెడన్ని గొప్ప పాటలు సృజించాడు.

ఈ సారి హాసం క్లబ్ లో ఆయనకు శ్రద్ధాంజలి ఏర్పాటు చేశాను. కానీ నేనుండను. మీరయినా కార్యక్రమాన్ని చూసి ఆనందించండి.

Enter Your Mail Address

April 28, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

One Response

  1. chavakiran - April 30, 2011

    Special Discount on this book @ Kinige
    http://kinige.com/koffer.php?id=6

Leave a Reply