ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇప్పుడు చూపుతోంది…నేను అప్పుడే రాశాను.

స్వామీజీలు, బాబాజీల గురించి ఆంధ్రజ్యోతి చానెల్ ఇప్పుడు చూపుతోంది.

కానీ, నేను 1999 లోనే మర్మయోగం అని ఒక నవల రాశాను. ఆంద్రప్రభ వారపత్రికలో సీరియల్ గా వచ్చింది. మంచి ఆదరణ పొందింది. కానీ 35 వారాలు రావాల్సిన సీరియల్ 22 వారాలకే పూర్తయింది.

ఈ నవలను ఎమెస్కో బుక్ క్లబ్ వారు ప్రచురించారు. అప్పుడూ చక్కని ఆదరణ లభించింది. ఈ నవల ద్వారా యోగ పట్ల ఆసక్తివున్నవారనేకులు, యోగ సాధన చేస్తున్నవారూ నాకు పరిచయమయ్యారు.

ఈ నవలలో నేను పరమహంసోపనిషత్తు ఆధారంగా అసలు యోగులను గుర్తించటం, దొంగ యోగులను, భ్రష్టయోగులను, అసలు యోగులనుంచి వేరు చేసి చూడటం వంటి విషయాలను, నవల రూపంలో వివరించాను.

ఇది సీరీయల్ గా వస్తున్న సమయంలో దీన్ని ఆపేందుకు కొందరు స్వామీజీలు ప్రయత్నించారు. చివరికి ఒక స్వామీజీ, దీన్ని ఆపి తన జీవిత చరిత్ర సీరియల్ ఆరంభిస్తే 10000 సర్క్యులేషన్ పెంచుతానని వాగ్దానం చేసి నా సీరియల్ ఆపించాడు. తరువాత ఆయన జీవిత చరిత్ర సీరియల్ ఆరంభమయింది. ఇది ముందుమాటలో కూడా రాశాను.

ముందుమాటలో మరో విషయం రాశాను మర్మయోగాఆఆఆఅం నవల ప్రధానోద్దేశ్యం యోగాను గ్లోరిఫయ్ చేయటం కాదు. యోగులను విలన్లుగా చూపటం కాదు. ప్రజలలో యోగాపట్ల వున్న అపోహల ఆధారంగా కొందరు. ప్రజల బలహీనతలతో ఆడుకుంటూ, ఎలా సొమ్ము చేసుకుంటున్నారో చూపటం, మన ప్రాచీన సాహిత్యంలో, పొందుపరచి వున్న లక్షణాలను ఆధునిక వ్యాపార యోగుల లక్షణాలతో పోల్చి చూపి నిజానిజాలను వివరించటం”,

” భారతీయ ధర్మం పై ఉన్న అపోహలను మరింతగా పెంచి ధర్మం లోని అసలు విషయాలను మరుగు పరచి, తమ తమ స్వార్ధాలు, లాభాలు, భోగాలకోసం ప్రజలను బలహీనులుగా చేస్తున్న ఈ భ్రష్టయోగుల అసలు స్వరూపం బట్టబయలు కావాలంటే మనం మన ధర్మం గురించి తెలుసుకోవాలి. భగవంతుZడు మనిషి ఆత్మవిశ్వాసం కావాలి కానీ, బలహీనత కాకూడదు. ఆత్మవిశ్వాసాన్ని బలహీనతగా మార్చే ఈ కలుపుమొక్కలను ఏరి వేస్త కానీ ధర్,అ ప్రక్షాళా ద్వారా ధర్మ పునరుజ్జీవనం సాధ్యం కాదు.”

ఇవి నా ముందుమాటలోని కొన్ని అంశాలు. నవలలో ఇంకా అనేకం వివరించాను.

జర్నలిస్టులు నిరూపణలతో వార్తలు రాస్తారు. రచయితలు, నిజాల ఆధారంగా రచనలల్లుతారు. కానీ ఇరువురి లక్ష్యం ఒకటే. నిజాలాను సమాజంలో ప్రకటించటం.
నా నవల చదివి ఎవరయినా నా మాటలలో సత్యాన్ని గ్రహించవచ్చు.”

Enter Your Mail Address

July 25, 2011 · Kasturi Murali Krishna · 2 Comments
Tags: , , ,  · Posted in: నా రచనలు.

2 Responses

  1. రావు లక్కరాజు - July 25, 2011

    భగవంతుడు మనిషి ఆత్మవిశ్వాసం కావాలి కానీ, బలహీనత కాకూడదు.
    ———
    చాలా బాగా చెప్పారు.

  2. krsna - July 26, 2011

    Where do I get this book? is there e-book for this copy? or could you send it through VPP? Please share your mail id.

Leave a Reply