నేను-షమ్మీ కపూర్.

నిన్న ప్రపంచ తెలుగు మహా సభలో వుండగా అమ్మ ఫోను చేసింది.

నీకో విషాద వార్త, అంది.

నాకు విషాద వార్తలేవీలేవు, అయినా ఏమిటది? అని అడిగాను.

బాధపడవద్దు, నీ జంగ్లీ, జన్వర్, బద్ తమీజ్, పగ్లా కహీకా, ప్రిన్స్,రాజ్ కుమార్, చోటా సర్కార్, లాట్ సాహెబ్, ప్రొఫెసర్ పోయాడు. అంది.

అలాగా, అని పెట్టేశాను.

కళాకారులకు మరణం అంటూ వుంటే అది వాళ్ళు కళను సృజించటం ఆగొపోవటమే, అని నా అభిప్రాయం. అందుకే, నాకు ఎలాంటి బాధ అనిపించలేదు. ఎందుకంటే, షమ్మి కపూర్ కళాసృజన ఎప్పుడో ఆగిపోయింది.

జీవితాన్ని పూర్తిగా అనుభవించాడు. జీవించాడు.

షమ్మి కపూర్, హీరోగా నటించటం ఆపటంతోటే సినిమాలలో రొమాన్స్ అన్నది అంతం అయిపోయింది. ఇప్పుడు పోయింది, అనాటి అధ్భుతమయిన కళాకారుడి గుర్తుగా వున్న భౌతిక శరీరం మాత్రమే. తన సినిమాల ద్వారా, సినిమాలలో ప్రదర్శించిన అనేక హావభావాల ద్వారా తర తరాలను షమ్మి కపూర్ ప్రభావితం చేస్తూనేవుంటాడు.

నేను పదో తరగతి పరీక్ష  చివరిది రాసిన తరువాత అమ్మ నన్ను అమితాభ్ సినిమా ది గ్రేట్ గాంబ్లర్ కు తీసుకువెళ్ళింది. నాకా సినిమా నచ్చలేదు. ఇంటికి వచ్చి అన్నయ్యతో అదేచెప్పాను. అదేరోజు వాడు ఒక పాత సినిమా చూసి వచ్చాడు. వాడికి అది మరోసారి చూడాలని వుంది. నీకో అద్భుతమయిన సినిమా చూపిస్తానని, మరుసటి రోజు నన్ను ఒక హిందీ సినిమాకు తీసుకెళ్ళాడు.

అప్పటికి నాకు హిందీ సరిగ్గా రాదు. అన్ని సబ్జెక్టుల్లోకీ హిందీలోనే మార్కులు తక్కువ వచ్చేవి. 20 పాస్ మార్కంటే అతి కష్టం మీద 19 దాకా లాగేవాడిని. టీచర్లు దయ తలచి ఒక మార్కుకలిపి ముందుకు నెట్టేవారు.

అందుకే హిందీ సినిమా అంటే నేనంత ఇష్టం చూపలేదు. అదీ పాత సినిమా! కానీ, ఏదో ఒకటి సినిమా చూసే చాన్సు దొరుకుతుంది కదా, ఎందుకు వదలుకోవటం అని వెళ్ళాను.

ఆ సినిమా  నా పై ఎంతగా ప్రభావం చూపిందంటే, నేను, నా అభిప్రాయాలి, ఆలోచనలు, సర్వం మారిపోయాయి. జీవితాంతం నన్ను వెన్నంటి వుండే ముగ్గురు ప్రాణ స్నేహితులు నాకు పరిచయమయ్యారు. నా  వెంట వుంటూ, ప్రతిక్షణం ఎలాంటి పరిస్థితిలోనయినా, నాకు మార్గదర్శనం చేసే ముగ్గురు స్నేహితులు వారు.  మహమ్మద్ రఫీ, శంకర్ జైకిషన్, షమ్మీ కపూర్ అనే ఆ ముగ్గురు స్నేహితులు ఈనాటికీ నాతోనే వున్నారు. నా ఊపిరిలో ఊపిరయి, నా రక్తం లో రస్క్తమయి, ప్రతి ఆలోచనలో వారయిపోయారు.జంగ్లీ సినిమా నాలో రొమాంటిక్ ఆలోచనలకు ఊపిరి పోసింది. సైరాబాను అందానికి కొలబద్ద అయింది. ఈ సినిమాతో హిందీ సినిమాల , పాటల ప్రపంచాల ద్వారాలు తెరచుకున్నాయి. ఉర్దూ నా అభిమాన భాష అయింది.

నిజానికి రొమాన్స్ అన్నది నేను రఫీ పాటల ద్వారా, షమ్మీ నటన ద్వారా తెలుసుకున్నాను. అందుకే, అందమయిన యువతిని చూస్తే, ఏయ్ గుల్బదన్, ఫూలోంకి మహెక్ కాటోంకి చుబన్ అని పాడాలని పిస్తుంది, ఇస్ రంగ్ బదల్తీ దునియామే, ఇన్సాన్ కి నీయత్ ఠీక్ నహీ, నిక్ లాన కరో తుం సజ్ ధజ్ కే ఈమాన్ కి నీయత్ ఠీక్ నహీ, అని చెప్పాలని వుంటుంది, బదన్ పె సితారె లపేటె హువె, ఓ జానె తమన్నా కిధర్ జారహేహో, జరా పాస్ ఆవో, తొ చైన్ ఆజాయే, అని కవ్వించాలనుంటుంది. లాల్ చడీ మైదాన్ ఖడీ అని కవ్వించాలని వుంటుంది. తుం సె అచ్చా కౌన్ హై, అని ఏడ్పించాలని వుంటుంది. దిల్ లేగయీ. లేగయీ, లేగయీ, ఎక్ చుల్బులీ, నాదినీ అని పాడుకోవాలని వుంటుంది. జబ్ ముహబ్బత్జవాన్ హోతీహై, హర్ అదా ఇక్ జుబాన్ హోతీహై, అని చెప్పాలనుంటుంది. ఇషారో ఇషారోమె దిల్ లేనె వాలి, బతాయే హునర్ తూనె సీఖా కహాన్ సే అని అడగాలివుంటుంది. దీవాన హువా బాదల్, సావన్ కి ఘటా చాయీ, యేదేఖ్ కె దిల్ ఝూమా, లీ ప్యార్ నె అంగ్డాయీ అని ఆనందించాలని వుంటుంది. కాష్మీర్ వెళ్ళినప్పుడు, బోట్ లో కూచుని, ఒక వంక సైరాబానూను మరో వంకా షర్మీలా టాగోర్ ను ఊహిస్తూ, కిస్ కిస్కో ప్యార్ కరూ, కైసే ప్యార్ కరూ అని పాడుతూంటే దూరం నుంచి ఆశా పారేఖ్, ఓ మెరే సోనారె సోనారె సోనా అని పాడుతున్నట్టు ఊహించుకుని ఎంత ఆనందించానో.తారీఫ్ కరూ క్యా ఉస్కీ జిస్నె తుమ్హే బనాయా అని నా స్నేహితులను ఎంతగా పొగడుకున్నానో.

షమ్మీ కపూర్ పాటలు పాడుతూ, కిసీన కిసీసె కభీన కభీ కహీన కహీ దిల్ లగానా పడేగా అనుకుంటూ, జానె మెర దిల్ కిసె ఢూంఢ్ రహాహై ఇన్ హరీ భరీ వాదియోమె, అనుకుంటూ, మద్ హోష్ హవా మత్వాలె ఫిజా, సంసార్ సుహానా లగ్తాహై, కర్ లేన కిసీసె ప్యార్ కహీన్ దిల్ అప్న దివానా లగ్తాహై అని ఒక్కడినే పాడుకుంటూ, మనసంతా కళ్ళు చేసుకుని, హృదయమంతా రొమాంటిక్ ఊహలతో నింపుకుని, సౌ బరస్ కే జిందగీ సె అచ్చేహై, ప్యార్ కే దో చార్ దిన్, అని తపించిన రోజులెన్నో.

ఓ అందమయిన అమ్మాయివెంటపడి, అకేలే అకేలే కహా జారహెహో, హమే సాథ్ లేలో జహాన్ జారహేహో, అని ప్రాధేయపడాలనీ, దీవానేక నాం తో పూచో, ప్యార్ సె దేఖో కాం తో పూచో, చాహె ఫిర్ న మిల్నా, అని బ్రతిమిలాడాలనీ, యూ తో హమ్నే లాఖ్ హసీన్ దేఖే హై తుంసా నహీ దేఖా అని చెప్పాలనీ, బద్ తమీజ్ కహో యా కహో జాన్వర్, మెరా దిల్ తుఝీ పె ఫిదా హోగయా అనాలనీ, ముఝె అప్నా యార్ బనాలో ఫిర్ దేఖో మజా ప్యార్ కా అని సవాల్ చేయాలనీ ఎన్నెన్నో ఊహలకు జీవం పోశారు నా స్నేహితులు.

చివరికి ఒక రోజు నా కలలు రూపు పోసుకుని వస్తే, సలాం అప్కీ మీఠీ నజర్ కో సలాం, కియా హంసె జాదూ అసర్ కో సలాం అన్నాను. తుం నె ముఝే దేఖా హోకర్ మెహెర్బాన్, రుక్ గయీ యే జమీ, థం గయా ఆస్మాన్ అని మోకాళ్ళపై కూచుని కళ్ళల్లో చూస్తూ చెప్పాను.
.ఐసీతొ మెరీ తక్దీర్ నహీ, తుంసాజొ కొయీ మహ్బూబ్ మిలే దిల్ ఆజ్ ఖుషీ సే పాగల్ హై ఏయ్ జానె వఫా తుం ఖూబ్ మిలే అని ఆనందించాను. కభి హం నె నహీ సోచా థా ఐసా దిన్ భీ ఆయేగా అని ఎగిరాను. హం ప్యార్ కె తూఫానోమె గిరేహై, హం క్యాకరే అని గెంతాను. కొయి ప్యార్ హమేభీ కర్తాహై, హం పర్ భి కోయీ మర్తాహై, హమే తుం క్యాకహె, మొహబ్బత్ కే ఖుదా హం హై, అని పిచ్చిగా పాడుకున్నాను. మెరీ మొహబ్బత్ సదా రహేగీ, జవాన్ రహేగీ అని వాగ్దానం చేశాను. జనం జనం కా సాథ్ హై నిభానేకో, సౌ సౌ బార్ మైనే జనం లియా అని చెప్పాను. ఆమెకు కోపం వస్తే ఎహెసాన్ తెరా హోగాముఝ్ పర్ దిల్ చహతాహై జో కహెనేదో అని వేడుకున్నాను. కోపం తగ్గక పోతే హై దునియా ఉసీకీ జమానా ఉసీకా అని ఏడ్చాను.

ఇప్పుడు మా అమ్మాయితో రెమ్మామ్మా రెమ్మామ్మా రే పాడుతున్నాను. చక్కే మె చక్కా చక్కేకి గాడీ అని కారులో పాడుకుంటున్నాము. తనని నిద్ర పుచ్చుతూ మై గావూ తుం సోజావో పాడతాను. అందుకే షమీ కపూర్ ఎప్పుడో చెప్పాడు, తుం ముఝేయూ భులాన పావోగె, జబ్ కభీభీ సునోగె గీత్ మెరే సంగ్ సంగ్ తుం భి గుంగునావోగే అన్నాడు.

అందుకే ఇప్పుడు షమ్మీ మరణిస్తే నాకు విషాదం లేదు. బాధ లేదు. ఎందుకంటే, నా వ్యక్తిత్వం రూపు దిద్దుకుంటున్న సమయంలో నాకు సరయిన మార్గ దర్శనం చేసి నన్ను సరయిన దారిలో పెట్టి సరయిన ఊఅహలు, ఆలోచనలిచ్చిన అధ్భుతమయిన వ్యక్తులు నాకు పరిచయమయ్యారు. ఎప్పటికీ నన్ను వెన్నంటే వుంటారు.

యే మేల దోఘడీక దో దినోంకి హై బహార్
సమయ్ కి బహెతి ధార్ కహతి జాతిహై పుకార్,
మెహెమాన్ కబ్ రుకేంగె కైసె రోక్ జాయెంగె
కుచ్ లేకె జాయెంగె, కుచ్ దేకె జాయెంగె.సవేరే వాలి గాడీసె చలేజాయేంగే
అన్నాడు. ఉదయం 5 గంటల బండీకి వెళ్ళిపోయాడు.

అవును మన ప్రేమ భిమానం అనురాగాలను వెంట తీసుకుని వెళ్ళిపోయాడు షమ్మి కపూర్. మనకు జీవితాంతం మరువలేని అనుభూతులను ఎన్నెన్నో  ఇచ్చాడు.    అందుకే కళాకారులు భౌతుక శరీరాన్ని విడిస్తే బాధ కలుగదు. సృజన చేయలేని దుస్థితి నుంచి, నిర్వ్యాపార జీవితం నుంచి విముక్తి కలిగినందుకు ఆనందం కలుగుతుంది. వారి కళను తలుచుకోవటాన్ని మించిన నివాళి మరొకటి లేదు.

Enter Your Mail Address

August 15, 2011 · Kasturi Murali Krishna · 3 Comments
Posted in: నీరాజనం

3 Responses

 1. phani - August 15, 2011

  beau philosophy….

  woh saare gaane jindagi bhar gungunate hee reh jaate hain dil mein….

  khoobsurat ka tamanna aur kitna sundar ho sakta hain?

 2. mbs prasad - August 23, 2011

  well written
  Shammi’s Songs are clerverly used at appropriate places
  I am glad you focussed more on his songs than his acting

 3. shravan - September 5, 2011

  after reading your article I realised that to what extent a cinema actors and their songs can inspire, not only inspiring, shaping a persons personality…..when i compare your personality and present article,totally my perception on movies changed…. your article simply eye opener for me who feels cinema is only a entertainer ….

Leave a Reply