ఇకపై ప్రతి శనివారం ఆంధ్రప్రభలో ప్రపంచతంత్రం,

అవును,ఇకపై ప్రతి శనివారం ఆంధ్రప్రభలో ప్రపంచతంత్రం అనే శీర్షికను ఆరంభిస్తున్నాను. ఇది ప్రతి శనివారం ఎడిట్ పేజీలో వస్తుంది. ప్రపంచ రాజకీయాలను, రాజకీతాలాటల వెనుక దాగిన సత్యాలను విశ్లేషించి వివరిస్తుందీ శీర్షిక, ఆంధ్రభూమిలో నేను రాసిన పవర్ పాలిటిక్స్ ను ఇష్టం గా చదువుతూ, ఆ శీర్షిక ఎందుకు ఆపేశానని కోపంగా అడిగిన వారంతా, ఇకపై ప్రతి శనివారం ఆంధ్రప్రభ ఎడిట్ పేజీలోని ఈ శీర్షికను చదివి తమ నిర్మొహమాటమయిన అభిప్రాయాలను తెలుపుతారని ఆశిస్తున్నాను.

నేను దాదాపుగా 11 ఏళ్ళు నడిపిన పవర్ పాలిటిక్స్ శీర్షికను గత నవంబర్ లో రాయటం మానేశాను. ఎందుకని? అని ఎందరో అడుగుతున్నారు. కొందరు నన్ను ఆ శీర్షిక ఆపినందుకు తిట్టారు కూడా. కొందరు సంతోషించారు. ఇంకొందరు ఇప్పుడు తమ రాజకీయ పాండిత్యం చూపించే వీలుదొరికిందనీ ఉవ్విళ్ళూరుతున్నారు. ఎవరేమనుకున్నా నేను ఆ శీర్షిక ఆపటం మాత్రం జరిగిపోయింది.

నా రచన జీవితంలో బోలెడన్ని శీర్షికలి రాశాను. ఆపేను. కానీ, పవర్ పాలిటిక్స్ మాత్రం వాటన్నిటికన్నా ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుంది. గత 10ఏళ్ళుగా, నా జీవితంలో ఒక భాగమయిపోయింది. దాన్ని ఆపటమంటే నా శరీరంలో విడదీయరాని అంగాన్ని నేనే కోసుకున్నట్టు. కానీ, ప్రతి విషయానికీ అంతం వుంటుంది. ఊపిరి వున్నంత వరకూ ముందుకుసాగటమే మనిషి పని. అందుకే, మై జిందగీ క సాథ్ నిభాతా చలాగయా, హర్ ఫిక్ర్ కో ధువేమె ఉడాతా చలాగయా… అనుకుంటూ ముందుకు సాగిపోతున్నాను.

అయితే, ఆ శీర్షిక మానేయాలని నిశ్చయించినప్పుడు మాత్రం మనస్సులో …యే ఫూల్ చమన్ మే కైసా ఖిలా, మాలీ కి నజర్ మే ప్యార్ నహీ… అని మాత్రం అనిపించింది. తోట మాలి ప్రతి చెట్టునూ ప్రేమగా పెంచుతాడు. ప్రతి పూవునూ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాడు. పత్రిక సంపాదకుడు కూడా తోటమాలి లాంటివాడే. పత్రిక ఆయన పెంచే తోట. దానిలోని శీర్షికలు ఇతర రాతలు ఆ తోటలో పూచిన పూలు. తన పత్రికలోని ప్రతి శీర్షిక గురించి సంపాదకులకు అవగాహన, అనురాగం, దాని పట్ల గర్వం వుండాలి. అవి లేనప్పుడు, ఆ పూవు ఎంత అందమయినదయినా, అపురూపమయిన దయినా, వ్యర్ధమే. ఇది గ్రహింపుకు వచ్చాక ఇక ఆ శీర్షిక నడపటం అర్ధవిహీనమని రాయటం మానేశాను.
మనసులో మరో పాట మెదిలింది.

కహాసే యే ఫరేబే ఆర్జూ ముఝ్ కో కహాలాయా
జిసే మై పూజ్ తా థా ఆజ్ తక్, నిక్లా వొ ఇక్ సాయా,
ఖతా దిల్ కీ హై మై, శర్మాగయాహూన్……

నిజం….. మనం ఒకరిని నమ్ముతాము. ఆ నమ్మకంతో ఇంకొకరిని నమ్మిస్తాము. వారు మనల్ని నమ్ముతారు. ఇక్కడ ఎవరిని నమ్ముతామో వారే మన నమ్మకాన్ని వమ్ముచేస్తే…..?

అందుకే, శీర్షిక మానేస్తున్నానని నిర్ణయించుకున్నప్పుడు
హం నే హర్ జీనేవాలేకో ధన్ దౌలత్ పే మర్తే దేఖా, దిల్ పె మర్ నే వాలే మరేంగె భికారీ…..  సబ్ కుచ్ సీఖా హం నే , నా సీఖీ హోషియారీ….. అన్న పాట పదే పదే పాడుకున్నాను. అవును, నేను ఎన్నో నేర్చాను కానీ, హషియారీ మాత్రం నేర్వలేదు. అది నాకు రాదుకూడా…..

అందుకే, చల్ నా హి జిందగీ హై, రుక్ నా హై మౌత్ తేరా, బఢ్తాహి చల్ ముసాఫిర్, హర్ సాస్ ఎక్ రవానీ అనుకుంటూ ముందుకు సాగిపోతున్నాను. ఫలితంగా ఆంధ్రప్రభలో ప్రపంచతంత్రం అనే అంతర్జాతీయ రాజకీయాలటలను విశ్లేషించే శీర్షికను ఆరంభిస్తున్నాను. ఈ శీర్షికకూడా మీ ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాను.

Enter Your Mail Address

December 23, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

Leave a Reply