ముఖచిత్రం ఇలావుంటే పుస్తకాన్ని ఎవరయినా కొంటారా?

 హారర్ కథల పుస్తకానికి అతి కష్టపడి ముఖచిత్రాన్ని తయారు చేశాక, ముఖచిత్రం ఇలా వుంటే ఈ పుస్తకాన్ని ఎవరయినా కొంటారా? అన్న సందేహాన్ని పలువురు వ్యక్త పరుస్తున్నారు. కొంటారన్న విశ్వాసం నాకుంది కానీ, తెలుగులో తొలి హారర్ కథల సంపుటి ఇది, ఇది విఫలమయితే మరెవ్వరూ హారర్ కథల జోలికి పోరు. విజయవంతమయితే ఇతరులకు ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఇక్కడున్న కవర్లను చూసి ఏదయితే బాగుటుందో, వున్నవాటిల్లో ఏది మెరుగో చెప్తూనే, ఇదే కవర్ అయితే మీరు కొంటారో లేదో నిర్మొహమాటంగా చెప్పండి. ఎందుకంటే పలువురు ఇదే సందేహాన్ని వ్యక్తం చేయటంతో మరో రెండు రకాల ముఖచిత్రాలు తయారు చేస్తున్నాను. కానీ, ఇక్కడున్న వాటిగురించి మీ నిర్మొహమాటయిన అభిప్రాయాలు చూసిన తరువాత మిగతా వాటి గురించి సీరియస్ గా ఆలోచిస్తాను.

ఇవిగో హారర్ కవర్లు.

 

Enter Your Mail Address

January 30, 2012 · Kasturi Murali Krishna · 11 Comments
Posted in: నా రచనలు.

11 Responses

 1. voleti - January 30, 2012

  రాం గోపాల్ వర్మ సినిమాల్నే చూసిన వాళ్ళు, చూసి తట్టుకునే పిచ్చోళ్ళు చాలా మంది వున్నారు.. బొమ్మ బాగానే వుంది.. ఎవరు చదివిన, చదవక పోయినా “నేనింతే” అనుకుంటూ వర్మ ని ఆదర్శంగా తీసుకుని ముందుకి వెళ్ళిపోవడమే..

 2. srinivasaraov - January 30, 2012

  not creating any interest to purchase,sorry to say this

 3. chavakiran - January 31, 2012

  బాగుంది.

 4. murali - January 31, 2012

  baga ledu .. kathalu harrar vaina antha bayapettela avasaramaa ?

 5. Mahendar Reddy - January 31, 2012

  Cover page is nice, I’ll deffinitely prefere a book with this cover page.

 6. sravya - January 31, 2012

  for me it is scaring and not creating interest to purchase.
  I read some of the stories of yours.
  they are good.

 7. పారదర్శి - January 31, 2012

  అచ్చుతప్పు – హారర్ కు బదులుగా హర్రర్ అని ముఖచిత్రం పై ఉంది. ముఖచిత్రం నచ్చలేదు.

 8. ఆ.సౌమ్య - January 31, 2012

  కొంచం భయంగానే ఉంది. మరీ ఇంత భీభత్సమైన బొమ్మ అవసరమా? కొంచం ఆలోచించండి.

 9. పారదర్శి - January 31, 2012

  వో కౌన్ థీ? చిత్రంలో లా అందమైన దెయ్యం (తెల్ల చీరతో) ముఖచిత్రంగా పరిశీలించండి.

 10. జ్యోతి - February 3, 2012

  మరీ ఇంత భయంకరమైన ముఖచిత్రం అవసరమా?? నాకైతే నచ్చలేదండి..

 11. జ్యోతి - February 3, 2012

  మురళీకృష్ణగారు నాదో డౌట్… పేరు హారర్ ఆ హర్రర్ ఆ ??

Leave a Reply