చిత్ర మాస పత్రికలో నా ఇంటెర్వ్యూ…

చిత్ర మాపత్రిక  ఫిబ్రవరి నెల సంచికలో నాతో ముఖాముఖీ ప్రచురితమయింది. ప్రింట్ మీడియాలో ఇది నా తొలి ఇంటర్వ్యూ.

 

Enter Your Mail Address

February 3, 2012 · Kasturi Murali Krishna · 3 Comments
Posted in: నా రచనలు.

3 Responses

 1. SriRam - February 3, 2012

  తెలుగులో M. V. R. శాస్త్రి గారు చరిత్ర మీద శోధించి మంచి పుస్తకాలు రాసినా, కన్నడం లో ఉన్న S.L. భైరప్ప లాంటి రచయితలు ప్రస్తుతం మనకు లేరని పిస్తుంది. మీరు ఆయనలాగా సీరియస్ రచనలు రాయటానికి ఎందుకు ప్రయత్నించకుడదు. ఆయన రాసిన దాటు, పర్వ, వంశవృక్షం, అవర్ణ మొద|| పుస్తకాలు చాలా బాగుంటాయి. తెలుగు రచయితల స్థాయిని ఒకమెట్టు మీరు పెంచటానికి ఎందుకు ప్రయత్నించకుడదు?

 2. SIVARAMAPRASAD KAPPAGANTU - February 4, 2012

  “…రంగుటద్దాలువదలి, కుల, వర్గ, వర్ణ, ప్రాంతీయ, భాషా సిధ్ధాంతాల సంకుచితాలు వదలి, కథను, కథగా చూసి, కథను కథగా రాసే రచయితలకు ఉత్సాహం, ప్రోత్సాహం ఇవ్వాలి. అసలైన కథలను ప్రజలకు చేరువ చెయ్యాలి. అప్పుడు తెలుగు సాహిత్యం బాగుపడుతుంది. అసలైన కథలు వ్రాసే వారికి ఊపు వస్తుంది…”

  అద్భుతమైన మాటలు చెప్పారు మురళీ కృష్ణ గారు. తెలుగు సాహిత్యపు దురదృష్టం ఎమంటే బాగా వ్రాయగలిగిన శక్తి ఉన్న అద్బుత రచయితలు, 1950 దశకం నుండి కూడా వామపక్షపు బారిన పడి తమ రచనా శక్తికి తమకు తామే గ్రహణం పట్టించుకున్నారు. సామాజిక స్పృహ అంటే లెప్టిస్ట్ భావజాలాన్ని విపరీతంగా ప్రచారం చెయ్యటమే అన్న భావన కలిగించి, సంఘాలు పెట్టుకు మరీ ఊరేగారు. ఇది మన తెలుగు సాహిత్యానికి తీరని దెబ్బ. ఈ దురదృష్ట పరిణామాం నుంచి తెలుగు సాహిత్యం ఇంకా కోలుకోవాలిసి ఉన్నది. అలనాటి ఆ అద్భుత రచయితలకు ఈ వామపక్ష దయ్యం పట్టకుండా ఉండి ఉంటె ఎన్నెన్ని ఆణిముత్యాలు వచ్చేవో కదా అని తలుచుకుంటే బాధ కలుగుతుంది.

  లేకితనంగా ద్రౌపది మీద వ్రాయబడ్డ ఒక పుస్తకాన్ని, పైగా తమకున్న శక్తితో దానికి అవార్డు కూడ “ఇప్పించుకున్న” ద్రౌపది పుస్తకం మీద ప్రతి విమర్శ చేస్తూ చక్కటి పుస్తకం వ్రాశారని మీ బ్లాగ్ చూసినతరువాతే తెలిసింది. ప్రస్తుత కాలం ప్రకారం, మంచి కన్నా చెడుకే ఎక్కువ ప్రచారం మన మీడియా ఇస్తుంది కదా ఆ క్రమంలోనే మీరు వ్రాసిన పుస్తకానికి తక్కువ ప్రచారం, ఆ ఇతర పుస్తకానికి అనవసరపు ప్రచారం జరిగినాయనుకుంటాను.

  మంచి రచనలు చేస్తున్నందుకు అభినందనలు. మీ పుస్తకాన్ని ఈసారి విజయవాడ వెళ్ళినప్పుడు “కొని” చదువుతాను.

 3. Kasturi Murali Krishna - February 4, 2012

  శ్రీరాం గారూ, మీరు నా రచనలేవీ చదవలేదనుకుంటాను. భైరప్ప గారిపైన మీ అభిప్రాయాన్ని మార్చాలని నేను ప్రయత్నించను.

  కప్పగంతు శివరామ ప్రసాద్ గారు,

  మీ చివరి వాక్యంలో కాస్త సవరణ. మీ పుస్తకాన్ని కాదు, పుస్తకాలను అనివుంటే మరింత సంతోశం. ధన్యవాదాలు.

Leave a Reply