సన్ ఫ్లవర్ వార పత్రికను చూశారా…….

మచిలీపట్నం దగ్గరి చల్లపల్లి నుంచి  ప్రచురితమవుతున్న సకుటుంబ సపూర్ణ వారపత్రిక సన్ ఫ్లవర్.

ఈ పత్రిక ఇటీవలి కాలంలో పెనుమార్పులతో సంపూర్ణంగా రూపాంతరం చెంది సర్వాంగ సుందరంగా అలంకరించుకుని మీ ముందుకు వస్తోంది.

ఇంతవరకూ కృష్ణా జిల్లాలకే పరిమితమయిన ఈ పత్రిక త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా లభ్యమయి, తెలుగు పత్రికా రంగంలో నెలకొని వున్న పెద్ద లోటును పూడ్చేందుకు సిద్ధమవుతోంది.

సన్ ఫ్లవర్ పత్రికలో విభిన్నమయిన సీరియళ్ళు, అలరింపచేసి ఆలోచింపచేసే కథలతో పాటూ వినూత్నమయిన శీర్షికలున్నాయి.

వీటిల్లో పాఠకులను అమితంగా ఆకర్శిస్తున్న శీర్షిక ఇదీ మన లోకం. ఈ శీర్షికలో మన ఎదురుగానే వున్నా మనం గమనించని అధ్భుతమయిన విషయాల ప్రకటన వుంటుంది.

సన్ ఫ్లవర్ స్మృతి అన్నది ఒక ప్రత్యేక శీర్షిక. ఈ శీర్షికలో, 19వ శతాబ్దపు తెలుగు పత్రికలలో ప్రచురితమయిన శీర్షికలను పాఠకుల ముందుకు తేవటం జరుగుతుంది.. ఇదొక కలెక్టర్స్ ఐటెం లాంటిది.

సన్ ఫ్లవర్ అతిథి, ఒక ప్రత్యేకమయిన శీర్షిక. ఇందులో, ప్రతి వారం ఒక అతిథి తన ఆలోచనలను, అనుభవాలను, ఆనందాలనూ పాఠకులతో పంచుకుంటాడు.

ఇంకా, వేదగణితం, బాలల సాంప్రదాయ గీతం. పద్య కవిత్వం, సాహిత్య వ్యాసాలు వంటి అనేక ఆకర్శణీయమయిన శీర్షికలున్నాయి. వార పత్రికలలో కనబడని, సాహిత్యం, వినోదము, విౙ్నానాత్మకమయిన శీర్షికలు, పిల్లలకు, పెద్దలకు, అన్ని వయసులవరికీ ఆనందం కలిగించేవి వున్నాయి.

పత్రిక గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్న వారు, ఈ క్రింది అడ్రసుకు రాయవచ్చు. సన్ ఫ్లవర్ బిల్డింగ్, మున్సిఫ్ స్ట్రీట్, 5వ వార్డు, చల్లపల్లి, కృష్ణా జిల్లా.

లేక ఈ క్రింది నంబరుకు ఫోను చేయవచ్చు.
7382616924.

Enter Your Mail Address

March 25, 2012 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized

One Response

  1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి - March 25, 2012

    గతజన్మలోనో అంతకు ముందో నాకొక కాపీ పంపుతామనో పంపిస్తామనో అన్నారు మీరు ఎదురుచూపులతోనే యుగాలు గడిచిపోతున్నాయి నాకు ఖళ్ ఖళ్ …

Leave a Reply