నా రాతలు.- నా కోతలు.

ఇటీవలి కాలంలో ఎవరు కలిసినా నన్ను ఒకే ప్రశ్న అడుగుతున్నారు. రాయటం మానేశావేంటి? అన్న ప్రశ్నను ప్రతిఒక్కరూ తప్పని సరిగా అడుగుతున్నారు. కొందరు తిన్నగా పవర్  పాలిటిక్స్ ఎందుకు రాయటంలేదని అడుగుతూంటే, ఇంకొందరు    భూమిలో  ఉద్యోగం  మానేశావా? అని అడుగుత్న్నారు.   అందరికీ ఇదే నా సమాధానం.

నేను రాయటం మానేయలేదు.

ప్రస్తుతం నేను వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో రియల్ స్టోరీ రాస్తున్నాను. ఒక వారం క్రైం కథ రాస్తే, ఒకవారం, స్ఫూర్తివంతమయిన రియల్  స్టోరీ రాస్తున్నాను.

నవ్య వార పత్రికలో క్రైం కథలు వారం వారం రాస్తున్నాను. డిటెక్టివ్ శరత్ అన్న పాత్ర ద్వారా నేర పరిశోధనకు ప్రాధాన్యం ఇస్తూ `రాస్తున్నాను. నవ్యలోనే శైశవ గీతి అనే శీర్షిక నిర్వహిస్తున్నాను. ఈ శీర్షికలో ప్రముఖుల జీవితాలపై బాల్యానుభవాల ప్రభావాన్ని విశ్లేశిస్తున్నాను.

ఆంధ్రప్రభలో సగటుమనిషిస్వగతం ప్రతిమంగళ వారం వస్తుంది.

ఇంకా, ఈభూమిలో పాడుతా, తీయగా- నవలనుంచి సినిమా వరకు అన్న రెండు శీర్షికలు రాస్తున్నాను.

పాలపిట్టలో  కమర్షియల్ క్లాసిక్స్ అన్న శీర్షిక రచిస్తున్నాను.

ఇవి చాలనుకుంటాను నేను రాయటం మానలేదని, మాననని నిరూపించటానికి.

ఈ రాతల్లోనె నా కోతలు కూడా వున్నాయి, గం,అనించండి.

Enter Your Mail Address

August 30, 2012 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply