నా ఈ రచనలు చదువుతున్నారా?

ఈమధ్య రకరకాల కారణాలవల్ల అనుకున్న రీతిలో పోస్టులను అందించలేక పోతున్నాను. దాంతో నేను వివిధ పత్రికలలో రచిస్తున్న విభిన్నమయిన రచనలను అందించలేక పోతున్నాను. అందరూ అన్ని పత్రికలు చదవరు కాబట్టి నా అన్ని రచనలు లభ్యమయ్యే వేదికగా నా బ్లాగును మలచాలన్న కోరిక అందుకే తీరటంలేదు. అందుకే, కనీసం అన్నిటినీ పొందుపరచలేకపోతున్నా, కనీసం, ఏయే పత్రికలలో ప్రచురితమవుతున్నాయో తెలపాలని అనుకుంటూంటే ఇవాళ్ళ కుదిరింది. అదీ, అనుకోకుండా ఇంట్లో వుండాల్సిరావటం వల్ల.

ప్రతి వారం నవ్య వార పత్రికలో క్రైం కథలు వస్తున్నాయి. వీలయినంత వరకూ క్రైం కథల రచనలోని విభిన్న ప్రక్రియలను ప్రతిబింబించాలని ప్రయత్నిస్తున్నాను. ఇదే పత్రికలో శైశవగీతి అనే శీర్షికనూ రచిస్తున్నాను.

ప్రతి మంగళ వారం ఆంధ్రప్రభలో ఎడిట్ పేజీలో సగటుమనిషిస్వగతం శీర్షిక రచిస్తున్నాను.

వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం లో రియల్ స్తోరీలు రాస్తున్నాను. ఈ ఆదివారం బయోడైవర్సిటీ కి సంబంధించిన కథ వస్తుంది.

పాలపిట్ట మాస పత్రికలో కమర్షియల్ క్లాసిక్స్ శీర్షికన క్లాసిక్ కమర్షియల్ సినిమాలను పరిచయం చేస్తున్నాను. ఈ నెల, అంటే అక్టోబర్ సంచికలో 1949లో విడుదలయిన అందాజ్ పరిచయం వుంటుంది.

ఈభూమి మాస పత్రికలో పాడుతా తీయగా శీర్షికన ఆగస్తు నెలలో కైఫి ఆజ్మీ గేయాల విశ్లేషణ ప్రచురితమయింది.అక్తోబర్ నెలలో కవి నీరజ్ పాటల పరిచయం వుంటుంది. ఈ పత్రికలోనే రాస్తున్న మరో శీర్షిక  నవల నుంచి సినిమా వరకూ లో ఆగస్టు సంచికలో రాబిట్ ప్రూఫ్ ఫెన్స్ నవల సినిమాల పరిచయం వుంది. అక్టోబర్ నెలలో జురాసిక్ పార్క్ నవల సినిమాల పరిచయం వస్తుంది.

దాదాపుగా సంవత్సరం నుంచీ తయారీలో వున్న భయానక కథల సంపుటి అక్తోబర్ నెలలో విడుదల కావచ్చు. 

భారతీయ తత్వచింతన పుస్తకం తయారీలో వుంది. పాడుతా తీయగా తయారీలో వుంది. నా సైన్స్ ఫిక్షన్ నవల, వార్తలో సీరియల్ గా వచ్చింది, పునహ్ సృష్టికి పురిటినొప్పులు, ఎమెకో వారు ప్రచురిస్తున్నారు. 

ఇవీ టూకీగా ఈ నెల నా రచనలు. వీలయినన్ని చదివి నిర్మొహమాటంగా మీ అభిప్రాయాన్ని తెలపండి.

Enter Your Mail Address

September 26, 2012 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized

One Response

 1. srikanth - September 27, 2012

  అచ్చు తెలుగు పుస్తకాలకు ప్లీజ్ visit :

  http://www.logili.com/

  మీకు బాగా నచ్చిన పుస్తకాల గూర్చి మీ అభిప్రాయాలను,
  రివ్యూ లను వ్రాసి ఈ మెయిల్ అడ్రస్ కు పంపించండి
  review@logili.com
  నచ్చిన రివ్యూ లను మీ పేరు లేక మీ కలం తో ప్రచురింపబడును.

Leave a Reply