అనంతపూర్ లో నా అనుభవాలు.

కోడీహళ్ళి మురళీ మోహన్, నాగసూరి వేణుగోపాల్ లు విద్వాన్ విస్వం పై తెచ్చిన పుస్తకం తరువాత సర్దేశయ్ తిరుమలరావు గారిపైన పుస్తకం తెస్తున్నారు. సర్దేశాయ్ తిరుమలరావు గారి రచనలు చదివిన తరువాత నా అభిప్రాయాన్ని కోడీహళ్ళికి నిర్మొహమాటంగా చెప్పాను. అయితే, అనంతపూర్ లో తిరుమలరావు గారి సహచరులను ఇంటర్వ్యూ చేయటానికి రమ్మని ఆయన అడిగితే ఒప్పుకున్నాను. ఈ రకంగా అయినా అక్కడి రచయితలను కలవ్వచ్చన్నది నా ఆలోచన.

అనుకున్నట్టుగానే అనంతపూర్ వెళ్ళాం. తిరుమలరావు గారితో పరిచయమున్న వారిని కలిసినతరువాత ఆయన పైన నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. మురళీమోహన్, నాగసూరిలు చేస్తున్న పనిలోని గొప్పదనం, ఆవశ్యకతలు నాకు అర్ధమయ్యాయి. అకాడెమీలు,విమర్శకులు తమ రంగుటద్దాల, వొంటిస్థంభాల భవంతులలో చల్లగా వుంటూ కాలంగడుపుతూ ఆశ్రయించినవారికి బహుమతితాళ్ళువేసి ప్రామాణికతలు కల్పించి బ్రతికిస్తూంటే, అసలయిన సాహిత్యాన్ని రచయితలను భావితరాలకు పరిచయం చేసి సజీవంగా వారిముందు నిలిపే బాధ్యతను వ్యక్తులే నిర్వహించాల్సివుంటుంది. వీరిద్దరూ అలాంటి గురుతర బాధ్యతను నిర్వహిస్తున్నారు. అందుకే నా సంపూర్ణసహకారాన్ని అందిస్తున్నాను.

పనిలో పనిగా నేను చిలుకూరి దేవపుత్ర, మధుశ్రీ, రాధేయ వంటి రచయితలతో పాటూ సింగమనేని నారాయణ ను కూడా కలిసాను. బోలెడన్ని విషయాలు చర్చించాము. ఈ సందర్భంలో సింగమనేని గారితో నేను దిగిన ఫోతో ఇది.

Enter Your Mail Address

November 11, 2012 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply