విశ్వనాథ కథలు- విమర్శ- ఉపోద్ఘాతం.

విశ్వనాథ కథలగురించి చర్చ ఆరంభించేముందు కొన్ని అప్రస్తుతంగా అనిపించే అవసరమయిన విషయాలు ప్రస్తావించుకోవాల్సి వుంటుంది.

ప్రపంచంలో ఇతరుల పాలనలో వున్న దేశాల సాహిత్యంలో ఒక సారూప్యత వుంటుంది. ఇది చాలా ప్రధానమయిన విషయం.

ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి. ప్రతి దేశంలో అనేక విభిన్న ఆచార వ్యవహారాలు, పద్ధతులు, జీవన విధానాలూ వుంటాయి. ఎవరికి వారికి వారివారి పద్ధతులు గొప్ప. కానీ, ఎప్పుడయితే ఈ ప్రజలు పరాయి పాలనలోకి వస్తారో, అప్పుడు, వీరు తమ స్వీయ పద్ధతుల స్థానంలో పాలకుల వ్యవహారాలను ఆచరించాల్సి వస్తుంది. ఇది, పాలకుల ఆధిక్యతకు నిదర్శనం. కానీ, అందరూ పాలకుల ఆధిక్యతను ఆమోదించరు. కొందరు, తమ స్వీయ పద్ధతులను కొనసాగించాలని చూస్తారు. దాంతో ఘర్షణ మొదలవుతుంది. ఈ ఘర్షణలో స్థానికులను ఒకటిగా చేయటంలో, పాలకుల పట్ల స్థానికులలో వ్యతిరేకత పెరగటంలో , వారి ప్రాచీన పద్ధతులు ప్రధాన పాత్ర వహిస్తాయి.

అయితే, బానిసలుగా కొంత కాలం మనటం వల్ల స్థానికులలోనే వేర్వేరు దృక్కోణాలు ఏర్పడతాయి. పాలకులు ప్రామాణికంగా భావించినదాన్ని నమ్మి తమనితాము కించపరచుకునేవారు,ఇందుకు భిన్నంగా, తమ గొప్పతనాన్ని నమ్ముతూ, పాలకులను తక్కువ చేసేవారూ తయారవుతారు. ఏదయినా విషయాన్ని అన్నికోణాలలో చూసి వివరించేవారు అరుదవుతారు. సాధారణంగా ఈ పని మేధావులు, కళాకారులు చేస్తారు. కానీ, అనేక సందర్భాలలో కళాకారులు సైతం అవేశాలకు గురవుతారు. పాలకులను నమ్మేవారి హేళనకూ గురవుతారు. కానీ, వీరు తమ జాతి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని ఉద్దీపితం చేస్తారు. వారి కళ ప్రాధాన లక్ష్యం అదే.

అలెక్స్ హేలీ పేరు అందరికీ పరిచయమే. ఈయన ప్రధానంగా రూట్స్ రచించింది, మన వామపక్ష విమర్శకులు ప్రచారం చేసినట్టు, అణచివేతను దోపిడీనీ చూపటానికి కాదు. అలెక్స్ హేలీ రచనలో అడుగడుగునా, తన పూర్వీకులను అనాగరికులుగా భావించిన వారి అమానుష అనాగరికత పట్ల ఆక్రోషం, తన తెగ వారి ఔన్నత్యాన్ని ప్రదర్శించటం.

ఈ రచనలో చివరలో ఒక సంఘటన వుంటుంది. ఎంతో కష్టపడి తన పూర్వీకుల తెగను కలుసుకుంటాదు అలెక్స్. అప్పుదు, తన వారిని చూసి సీగుపడతాడు. ఎందుకంటే వారంత నల్లగా తాను లేనందుకు. తన నలుపులో తెలుపు కలిసినందుకు తాను అపవిత్రుడనని సిగ్గుపడతాడు. న్యూనత భావానికి గురవుతాడు.

చినువా అచెబె అనే నైజీరియా రచయిత వున్నాడు. ఆయన తల్లి తండ్రి క్రైస్తవం స్వీకరించారు. కానీ, కాస్త స్వతంత్రం రాగానే అచెబె, తన క్రీస్టియన్ పేరును వదిలి, సాంప్రదాయిక పేరు పెట్టుకున్నాడు. అతడి రచనలన్నీ తన తెగ ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని చూపించేవే. ఆయన రచించిన థింగ్స్ ఫాల్ అపార్ట్ నవలనూ వామపక్షీయులు అణచివేతకు ప్రతీకగా నిలపాలని తహతహలాడతారు. కానీ అచెబె రచనలలో అణచివేత కన్నా క్రీస్టియన్ మిషనరీల వల్ల తాము కోల్పోయిన తమ తనాన్ని ప్రదర్శించటమే వుంటుంది. మిషనరీల అన్యాన్ని ఎత్తి చూపటమే వుంటుంది. అచెబె రచనా శైలి కూడా ప్రాచీన తెగలు కథలు చెప్పే పద్ధతిలో వుంటుంది. వారు పండుగలు పబ్బాలు నిర్వహించుకునే విధానన్ని చూసి గర్విస్తున్నట్టుంటుంది.

అచెబె చెప్పే ఆఫ్రికా కథ వొకతుంది. ఒక ఆఫ్రికా తెగవారి పక్క గ్రామంలో మరో తెగ వారు వచ్చారు. ఈ కొత్తగా వచ్చిన వారికి దేవుళ్ళు లేరు. వారు పాత తెగ వారి దగ్గరకు వచ్చి మీ దేవుళ్ళను మేము వాడుకోవచ్చా అని అడిగారు. పాత తెగవారు జాలిపడి తమ దేవుళ్ళనిచ్చారు. కానీ ఒక నియమం పెట్టారు. అదేమిటంటే, కొత్త తెగవారి దేవుళ్ళను పాత తెగ దేవుళ్ళ కొడుకులని పిలవాలి తప్ప పాత తెగల దేవుళ్ళ పేరుతో పిలవవద్దు. అంటే ఆఫ్రికా తెగలలో ఎవరికి వారికి ప్రత్యేకత, స్వాతంత్ర్యం వుండాలని వుండేది తప్ప, తమ దేవుళ్ళను అందరిపై రుద్దాలనీ, అందరూ తమ దేవుళ్ళనే పూజించాలనే సంకుచితత్వాలు లేవన్నమాట.

విశ్వనాథ సత్యనారయణ రచనలను కూడా, ఈ నేపథ్యంలో మనము అర్ధం చేసుకోవాల్సి వుంటుంది. విష్లేషించాల్సి వుంటుంది.

Enter Your Mail Address

November 12, 2012 · Kasturi Murali Krishna · 6 Comments
Posted in: విశ్వనాథ కథాసాహిత్యం.

6 Responses

 1. కొత్తపాళీ - November 12, 2012

  చాలా బాగా చెప్పారు. ఈ పద్ధతిలో వ్యాసాల పరంపర రాస్తున్నారని ఆశిస్తున్నాను.

 2. Vamsi M Maganti - November 13, 2012

  interesting! sustain it pls….

 3. Halley - November 13, 2012

  మంచి పోస్టు . మీరు చెప్పే రకం రచనలు ఈ లైబ్రరీలో చాలానే ఉన్నాయి http://multiworldindia.org/multiversity/multiversity-library/ .
  మల్టీవర్సిటి గురించి ఇక్కడ http://multiworldindia.org/multiversity/

 4. ఫణీంద్ర - November 13, 2012

  సుమారు ఇదే మోస్తరులో ఓ సీరీస్ మొదలుపెడదామని చాలా కాలం నుంచీ బద్ధకిస్తున్నాను. మీరు అందుకోండి… ఆ వెనుకనే మేమూ వస్తాం…

 5. తాడేపల్లి - November 13, 2012

  బాగా వ్రాశారు. మీ ప్రపంచజ్ఞానం మాకు ఆదర్శప్రాయం.

 6. venki - May 3, 2013

  Thank’s for providing interesting Stories,,,,,,,,,,,,,,,

Leave a Reply