సినారె పంపిన ప్రశంసా పత్రం.

గత నెల ఈభూమి మాస పత్రికలో సినారె పాటలను విశ్లేషిస్తూ ఒక వ్యాసం రాశాను. ఆ వ్యాసానికి ఎంతగానో ప్రతిస్పందన లభించింది. అది చదివి మా అమ్మ అయితే, ఇకపై హిందీ వాళ్ళ గురించి రాయటం మానేసి తెలుగు వాళ్ళ గురించి రాయమని ఆదేశించింది.  ఇప్పుడు, ఈభూమి ఎడిటర్, సినారె స్వయంగా ఆ వ్యాసం గురించి  తన అభిప్రాయాన్ని రాసి ఈభూమికి పంపగా దాన్ని నాకు అందచేశాడు.
ఇది సినారె నుంచి నేను అందుకున్న రెండవ అభినందన. మొదటి అభినందన మైకెల్ జాక్సన్ జీవిత చరిత్ర రచనకు లభించింది.

ఈ ఉత్తరం చివరలో సినారె  నా పొరపాటును ఎత్తి చూపారు. అవును, ఆ పాట రాసింది ఆరుద్ర. సినారెకు, ఆరుద్రకు, పాఠకులందరికీ క్షమార్పణలు.

ఇదిగో సినారె ఉత్తరం.

Enter Your Mail Address

December 24, 2012 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: నా రచనలు.

2 Responses

 1. TVS SASTRY - December 25, 2012

  శ్రీ మురళీకృష్ణ గారికి,
  మీ వ్యాసాలను చదువుతున్నాను.చక్కని శైలి.మంచి విషయాలను ఎన్నుకొని మీరు వ్రాస్తున్న వ్యాసాలన్నీ అభినందించతగినవే!’ఈభూమి’ మాసపత్రిక మెయిల్ id ని దయచేసి తెలియజేయగలరు.

  భవదీయుడు,
  టీవీయస్.శాస్త్రి

 2. Kasturi Murali Krishna - December 25, 2012

  address of eebhoomi
  104, lumbini enclave, opp. nims, panjagutta, hyderabad-82.
  phone; 23399241.
  email; eebhoomi@gmail.com.

  thank u for the compliment…

Leave a Reply