అనంతపూర్ లో ఆ అరగంట చాలు పరిచయ సభ.

ఈ నెల 20వ తారీఖున అనంతపూర్ లో ఆ అరగంట చాలు పరిచయ సభ జరుగుతుంది. ఈ సభలో ఆ అరగంట చాలు పుస్తకంతో పాటూ సాగితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం, అదివో అల్లదివో కథల సంపుటి ల పరిచయం కూడా జరుగుతుంది.

ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక రచయిత పని రచన చేయటంతోనే సరిపోదు. ఆ రచనను బ్రతికించుకోవటమూ, దాన్ని పదిమందికీ చేరవేయటమూ కూడా రచయిత బాధ్యతనే అవుతోంది. ముఖ్యంగా ఆ రచయితకు, మన సాహిత్య రంగంలో పేరు రావటానికి అవసరమయిన నాలుగు లక్షణాలలో ఏ వొక్కటీ లేకపోతే ఇక తన గురించి తానే చెప్పుకోవాలి. తన రచనల గురించీ తానే చెప్పుకోవాలి. వాటిని తానే ప్రచురించుకుని, తానే నెత్తికెక్కించుకుని వీధి వీధి తిరుగుతూ పాఠకులకు పరిచయం చేస్తూ వుండాలి. ఎందుకంటే ఇలాంటి రచయితలకు పాఠకులుంటారు కానీ, ఆ పాథకులు మౌన పాథకులు. చదువుతారు. మెచ్చుకుంటారు. వూర్కుంటారు. కానీ ఆ రచన గురించి రాయరు. వేదికలెక్కి చెప్పరు. దాంతో ఎంత మంచి రచన అయినా కొన్నాళ్ళకు మరుగున పడిపోతుంది. అందుకని మంచి రచనలను ఆదరించే పాఠకులున్నా వారికి మంచి రచనలున్నట్టు తెలిసేవీలు లేక రచయితలు నిరాశకు గురవుతున్నారు. వారి రచనలు మరుగున పడిపోతున్నాయి.

ఈ మాఫియా ముఠాల గుప్పిట్లో చిక్కిన వ్యవస్థలో నా రచనలను పాథకులకు చేరవేసేందుకు నేను రక రకాల పద్ధతులను అనుసరిస్తున్నాను. దాన్లో భాగమే, నా పుస్తకాల గురించి నేనే ప్రచారం చేసుకోవటం. అందుకని వీలయినన్ని వేదికలను ఎంచుకోవటం. వాతిని వుపయోగించుకోవటం.

ఈ ప్రయత్నంలో భాగమే పుస్తకం ప్రచురణ కాగానే దాని గురించి రాష్ట్రంలో పలు ప్రాంతాలలో సభలు జరపటం. అయితే, మన సాహిత్య సంస్థలూ అందరు రచయితలను గుర్తుంచుకుని చదివి మెచ్చి పిలిచి సభలు చేసే స్థితిలో వుండవు. విమర్సకులు ఇల్లెక్కి కూసే రచయితల నలిగిన పేర్లే వారికీ తెలుస్తాయి. అదీగాక, మన సాహిత్య సంస్థలకు నిధులుండవు. అందుకని వారిని సభ చేయమని అడిగితే మొహమాటానికి ఒప్పుకున్నా, ఇబ్బందులలో పడతారు. అందుకని, నేను తోటి రచయితలను కూడగట్టుకుని ఒక పథకం ఆలోచించాను. రచయితలు ఒక జట్టుగా ఏర్పడి సభలను ఆయా ప్రాంతాల సాహిత్య సంస్థల ఆధ్వర్యంలో జరిపించుకుంటారు. సభలు వీలయినంత సింపుల్ గా ఆర్భాటాలు లేకుండా జరుగుతాయి. సభలకయ్యే ఖర్చులను ఈ ముగ్గురు రచయితలు పంచుకుంటారు. ఇలా, ఎవరి పైనా భారం వేయకుండా, తనపైనా అధిక భారం పడకుండా రచయితకు తన పుస్తకం గురించి పది ప్రాంతాలలో పాథకులకు పరిచయం చేసే వీలు చిక్కుతుంది. ఆ తరువాత ఆ పుస్తకాన్ని పాథకులెలా ఆదరిస్తారో అది పుస్తకం నాణ్యత పైనే ఆధారపడివుంటుంది.

ఈ పథకంలో భాగంగా, నేను, కోడిహళ్ళి మురళీ మోహన్. ఎం. వెంకటేశ్వర్ రావు లము కలిసి అనంతపూర్ లో వెన్నెల సాహితీ సంస్థ ఆధ్వర్యంలో మా పుస్తకాల పరిచయ సభను నిర్వహిస్తున్నాము. సహృదయంతో మా తపనను అర్ధం చేసుకుని, మా ప్రయత్నానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. మా సాహిత్యం మీద మాకున్న నమ్మకంతో , పాథకుల విచక్షణపైన వున్న విస్వాసంతో ఈ ప్రయత్నాలను చేస్తున్నాము. ఈ సభకు అందరూ ఆహ్వానితులే.
ఆహ్వానపత్రం ఇదే.

Enter Your Mail Address

January 16, 2013 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

One Response

  1. Sowmya - January 16, 2013

    మురళీకృష్ణ గారికి:
    రచయితలే కలిసి ఇలా పుస్తక పరిచయ సభలు ఏర్పాటు చేసుకోవడం అన్న ఆలోచన చాలా బాగుంది. ఈ చిన్న ప్రకటనలో ఉన్న టైపోలు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టాయి. కొంచెం సరిచూసుకోండి… (పాథకులు..పాథకులు అని అన్నిసార్లు చదువుతూ ఉంటే…ఏదో మేము పాతాళ వాసులం అన్నట్లు తోచింది నాకు!) :-)

Leave a Reply