నేను హుబ్లి వెళ్తున్నాను.

tనేను 27న హుబ్లి వెళ్తున్నాను. 28 ఉదయం 12 గంటలకు,హుబ్లిలో జరిగే వందేళ్ళ దక్షిన భారత కాల్పనిక సాహిత్యం సభలో వందేళ్ళ తెలుగు కథ తీరు తెన్నుల గురించి ఒక విమర్సన పత్రం సమర్పించేందుకు వెళ్తున్నాను. నా అభిప్రాయాలను, ఆలోచనలను అందరికీ వినిపించేందుకు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతవరకూ తెలుగు కథ విమర్సకులు విస్మరించిన కొన్ని స్వరాలనయినా వినిపించాలని, తెలుగు కథ విమర్శకులు ఒక పద్ధతి ప్రకారం ఎలా కొన్ని రకథలు, కొంతమంది రచయితలు, కొన్ని భావాలకే తెలుగు కథను పరిమితంచేసి తెలుగు సాహిత్య పరిథిని కుదించివేశారో వివరించటానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను.
ఇంతవరకూ నేను ఏ సభలో మాట్లాడినా అప్పటికప్పుడు మాత్లాడటమే తప్ప ముందుగా తయారయి వెళ్ళిందిలేదు. కానీ, ఈసారి నేను పేపర్ సబ్మిట్ చేయాలని చెప్పటంతో ముందుగా వ్యాసాన్ని తయారుచేసుకుని వెళ్తున్నాను. అక్కడ పేపర్ ప్రెసెంట్ చేయటం అయిన తరువాత నా రాత ప్రతిని బ్లాగులో వుంచుతాను. నా ఈ ఉపన్యాసంలో విస్వనాథ వారి కథా సాహిత్య విశ్వరూపాన్ని సూక్షంలో ప్రదర్సిస్తున్నాను.
Programme Sheet

Enter Your Mail Address

January 26, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply