ఆంధ్రజ్యోతిలో ఆ అరగంటచాలు రివ్యూ…

ఇవాళ్టి ఆంధ్రజ్యోతిలో ఆ అరగంట చాలు రివ్యూ ప్రచురితమయింది. రివ్యూ నేను ఊహించిన రీతిలోనే వుంది. పుస్తకం రివ్యూకి ఇచ్చేసమయంలో ఆదివారం ఇన్ చార్జ్ తో జరిగిన సంభాషణనుబట్టి ఇంతకన్నా ఘోరమయిన రివ్యూను ఊహించాను. ఎందుకనో నా మీద దయ తలచారు. ధన్యవాదాలు.

ఆంధ్రజ్యోతి దిన పత్రికలో సమీక్షకు నేను పుస్తకాలు ఇవ్వటం ఎప్పుడో మానేశాను. వారు నా పుస్తకాలను సమీక్షించకపోవటం, కనీసమందినవిలో వేయకపోవటం  వంటి అనుభవాలవల్ల నేను రెండు కాపీలు వ్యర్ధం చేయటమెందుకని ఇవ్వటం మనేశాను. ఇప్పుడీ పుస్తకాన్నిఎందుకిచ్చానంటే కనీసం రివ్యూ వేయకున్నా చదివి భయపడతారని. రివ్యూ చూస్తూంటే భయపడ్డట్టే అనిపిస్తోంది.
తెలిసో తెలియకో నేను రాసిన ముందుమాటను నిరూపించారు. నా స్వోత్కర్శ పూరిత, ప్రనిందా సహిత ఆరుపేజీల సుదీర్ఘ ముందుమాట లక్ష్యానికే తగిలిందన్నమాట.

Enter Your Mail Address

February 10, 2013 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: నా రచనలు.

2 Responses

 1. botsagiridhar - February 10, 2013

  భయానక కథల సంపుటి!
  ‘జాక్ ఆఫ్ ఆల్.. మాస్టర్ ఆఫ్ నన్’- అనేది సాధారణంగా పాత్రికేయులకు వర్తించే నానుడి. రచయితలకు అది వర్తించకూడదు. కానీ కొందరు రచయితలు ప్రపంచంలోని అన్ని విషయాల గురించి ఎటువంటి జంకూ లేకుండా రాయగలుగుతారు. అలాంటి వారిలో కస్తూరి మురళీకృష్ణ ఒకరు. చరిత్ర, సైన్స్‌ఫిక్షన్, సినిమాల నుంచి హారర్ దాకా అన్నిటిపై అలవోకగా రాసే మురళీకృష్ణ ప్రచురించిన తాజా సంకలనం ‘ఆ అరగంట చాలు’ (తెలుగులో భయానక కథల తొలి సంపుటి). వివిధ పత్రికల్లో ప్రచురితమైన భయానక కథల (హారర్ కథలు అని పాఠకులు అర్థం చేసుకోవాలి) సమాహారమిది.

  స్వోత్కర్ష, పరనింద- రచయితలకు ఉండకూడని రెండు ప్రధాన లక్షణాలని పెద్దలు చెబుతూ ఉంటారు. రచయిత రాసిన ఆరు పేజీల సుదీర్ఘ ముందుమాట చదివితే- ఈ రెండు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. తెలుగులో సస్పెన్స్, హారర్ కథలను కొందరు కావాలని తొక్కేస్తున్నారని.. వాటికి విశేషమైన ప్రజాదరణ ఉందని రచయిత గాఢంగా విశ్వసించి ఈ ముందుమాట రాశారు. అది చదివాక పాపం… నిజంగా రచయితకు తీరని అన్యాయం జరిగిందనే భావనకు పాఠకుడు వస్తాడు. కానీ కొన్ని కథలను చదివిన తర్వాత, వాటిని ప్రచురించటానికి సంపాదకులు ఎందుకు తిరస్కరించారో పాఠకుడికి స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకు రచయిత తన భయానక కథల ప్రస్థానంలో మైలురాయిగా భావించే ‘ఫాంటమ్ లింబ్స్’ కథనే తీసుకుందాం. తలుపు పక్కన నిలబడి పిల్లలను ‘భూ…’ అని భయపెట్టినట్లు ఉంటుంది ఈ కథ.

  మన శరీరంలోని కొన్ని అవయవాలను ప్రమాదాల వల్లనో మరే ఇతర కారణాల వల్లనో తీసివేయాల్సి వచ్చినప్పుడు, మన మెదడు అవి లేవనే విషయాన్ని గుర్తించదు. ఆ అవయవానికి కూడా సంకేతాలు పంపుతూ ఉంటుంది. దీని వల్ల రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారం కోసం అనేక మంది శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. డాక్టర్ రామచంద్రన్ అనే నాడీ శాస్త్రవేత్త ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నప్పుడు ఆయనకు నోబెల్ బహుమతి వస్తుందని కూడా కొందరు భావించారు (ఇప్పటికీ ఆ అవకాశం ఉంది). అలాంటి ఒక సబ్జెక్ట్‌ను తీసుకొని రచయిత రాసిన భయానక కథ చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది. పుస్తక ముఖచిత్రం కోసం దాదాపు ఏడాది వేచి చూడాల్సిన అవసరం ఏముందో (రచయితే ఈ విషయాన్ని స్వయంగా పేర్కొన్నారు) – చిత్రాన్ని పరీక్షగా చూసిన తర్వాత కూడా అర్థం కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో చదవాల్సిన సంకలనమిది.
  ఆ అరగంట చాలు, కస్తూరి మురళీకృష్ణ
  పేజీలు : 128, ధర : రూ. 100
  (DETECTIVE SAAHITYAM AA RACHAYITALU LENANDUNA MEERU KANKANAM KATTUKUNNATTU UNDI.HORROR RAASARU.YEKKA DORUKUTHAYI COPY KONTAANU.)
  MARI REVIEW GHORANGA RAASINA JYOTHIPY GOOY MANI LECHAARU.MARI NAVYA KU YELA RAASTUNNARU> OK

 2. gudipati - February 20, 2013

  Dear Murali,

  andhrajyothi review anabade comment chusaa. chadivaa. mee reaction kuda chadivaa.

  pusthakam bayatiki vachhakaa rakaraala comments raavadam mamoole.

  pusthakam meeda comment gurinchi nenu matladabonu. freedom of expression meeku, aa commentator ki unnadi.
  readers judgement different gaa untundi.
  try to welcome more and more comments like this. no problem.

  as a writer meeru yemito meeku telusu.

  all the best.

Leave a Reply