ఈ ఉగాది ఎంతో చేదు, కొంత తీపి…

ఈ సంవత్సరం ఉగాది రోజు ఎమో చేదు కొంత తీపిని అనుభవించాను.
నేను నాలుగేళ్ళుగా అతి ఇష్టంగా రాస్తున్నది, పాథకులు అమితంగా మెచ్చుతున్నదీ అయిన పాడుతా తీయగా శీర్షిక వస్తున్న ఈభూమి మాస పత్రిక ఈ నెల నుంచీ ఆగిపోతోంది. ఇదే పత్రికలో నాది పాథకులు మెచ్చిన మరో శీర్షిక నవల నుంచి సినిమా వరకూ కూడా వస్తోంది. ఈ భూమి ఆగిపోవటం గురించి మరోసారి తీరికగా చెప్తాను. కానీ, కస్స్త బాధగా అనిపించింది. సినిమా సంగీతం గురించి గతంలో రసమయి మాస పత్రికలోనూ రాశాను. అదికూడా సాహిర్ తో ఆరంభించాను. హస్రత్ దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయింది పత్రిక. ఈ శీర్షికకూడా సాహిర్ తోనే ఆరంభించాను. హస్రత్ గురించి నాలుగేళ్ళుగా రాయలేదు. ఈ నెల రాసి పంపాను. పత్రిక ఆగిపోయిందని వార్త వచ్చింది.
చినుకు, కథాకేళి పత్రికలు కూడా ఈనెల ఇంకా ప్రచురితం కాలేదు. చినుకు ఉగాది ప్రత్యేక సంచికకోసమని నేను తెలుగు కథ గురించి ఒక వ్యాసం రాశాను. కథాకేళిలో కథాకళి ఆరంభించాల్సి వుంది.
పాలపిట్ట ఫిబ్రవరి సంచిక మార్చ్ లో విడుదలయింది. మార్చ్ సంచిక ఇంకా రాలేదు. మార్చ్ సంచికకు ఇవ్వాల్సిన వ్యాసం నేను ఇంకా ఇవ్వలేదు. వాళ్ళు నన్ను అడగలేదు.

ఈ చేదు వార్తల నడుమ తీపి వార్త ఏమిటంటే నేను రాసిన జీవితం జాతకం కథలు కన్నడలోకి అనువాదితమవుతున్నాయి. ఇథ్థాన అనే పత్రికలో గతంలో నా అసిధార ప్రచురితమయింది. ఆ పత్రికవారే ఈ కథలను వరుసగా ఏప్రిల్ నెల నుంచీ ముద్రిస్తున్నారు. అంతేకాదు, పత్రికతో సహా రాయల్టీ కూడా పంపారు. ఆ కథను స్కాన్ చేసి పెడతాను. కన్నడ వచ్చిన వారు చదవటానికి వీలుగా.
అందుకే ఈ ఉగాది ఎంతో చేదుగా, కొంత తీపితో ఆరంభమయింది.

Enter Your Mail Address

April 13, 2013 · Kasturi Murali Krishna · No Comments
Posted in: వ్యక్తిగతం

Leave a Reply