1927నాటి వేలూరి గారి అద్భుతమయిన కథ.

వేలూరి శివరామ శాస్త్రి గారి కథ పరిచయానికి వచ్చిన స్పందన చూసి ఉత్సాహంతో కాగడా ఆయనవే మరిన్ని పొలిటికల్లీ ఇన్ కరెక్ట్ విస్ఫోటనాత్మకమయిన కథలను పరిచయం చేయాలని నిశ్చయించుకుంది.

మామూలు కథలు రాసే సాధారణ రచయిత అయినా, ఏదో ఒక ఉద్యమానికి, సిద్ధాంతానికి చెందినవాడయితే అతది పేరును, కథలను ఏదో రకంగా సజీవంగా వుంచుతారు. ముఖ్యంగా, వామ పక్షభావాలు, విప్లవాత్మక భావాలు, ఇతర ఉద్యమాలు, విప్లవాల భావాలు ప్రదర్శించే పిల్లి కూడా మాంసాహర పులులా భయంకర సహితీ వేత్త అయి బహుమతులందుకుంటుంది తెలుగు సాహిత్యంలో. అలాకాక, అతి గొప్ప కథలు రాసిన మహా రచయిత అయినా, భుజానికెత్తుకునే భజనగాళ్ళ విప్లవ గణాలు లేకపోతే మరుగున పడిపోతాడు. భావి తరాలకతనెవరో తెలియని పరిస్థితి వస్తుంది. కథలు, సాహిత్యం గురించి అంతా తెలుసన్నట్టు మాట్లాడేవారు కూడా వజ్రం అంటే తెలియకుండా వజ్రాలలో మునిగి తేలుతున్నట్టు మాట్లాడుతూ మభ్యపెడుతున్నారని వేలూరి లాంటి వారి రచనలు చదువుతూంటే తెలుస్తుంది. విశ్వనాథ అధ్యాపక వృత్తిలో వున్నవాడు కాబట్తి, ఆయనకనేక శిష్యులు, వారిలో కొందరు ఉన్నత స్థానాలలో వుండటం వల్ల ఆయన రచనలు సజీవంగా వున్నాయి, లేకపోతే, ఈ వామపక్ష అభ్యుదయ విప్లవాల అరుపులు కేకల హోరులో ఆయనకూ వేలూరి వారి గతి పట్టేది.

శివరామ శాస్త్రి గారు వేదాంతం, దర్శనాలు, సాంప్రదాయిక శాస్త్రాలు అధ్యయనం చేశారు. తిరుపతి వేంకట కవుల శిష్యులు. అవధానాలు చేశారు. ఆయన గ్రుహస్తాశ్రమాన్ని వాన ప్రస్థంలా కుటీరం నిర్మించుకుని గడిపారు. లోకానికి దూరంగా అధ్యనము, పథనము, రచనలు చేస్తూ గడిపారు. ఆయన స్నేహితులు పూనుకుని కొన్ని రచనలను భద్రం చేశారు కాబట్తి కొన్ని రచనలయినా మనకు లభిస్తున్నాయి. అనెక రచనలాయనవి కాలి బూదిదయిపోయాయి.

కథలలో అత్యంత నిగూఢమయిన, అతి క్లిష్టమయిన తాత్విక సత్యాలను, మీమాంసలను, అతి సరళమయిన రీతిలో ప్రదర్శించటం అత్యధ్భుతమయిన కథ సౌందర్యోపాసనలో కనిపిస్తుంది.

అలకనందుడనే రాజులు లేక లేక విజయవర్మ అనే కొడుకు పుడతాడు. విజయవర్మను రాజు గారాబంగా పెంచుతాదు. విజయవర్మకు సౌందర్యోపాసన అధికము. పిల్లవాదిని గురుకులం పంపే సమయం వస్తుంది. పంపాలా, వద్దా, అని రాజు ఆలోచిస్తూంటే విజయవర్మ స్వయంగా గురుకులానికి వెళ్తాడు. తాను రాకుమారుడయినా, గురుకులంలో పాతించే నియమాలన్నీ విజయవర్మ పాతిస్తూటాడు.

ఇక్కడ రచయిత కొన్ని వ్యాఖ్యలు చేస్తాడు.

వస్తువునందలి యందమును జూచి యానందించుట కొందర ప్రకృతి. అందమగు వస్తువును త్యాగము గావించి యానందించుట కొందర ప్రకృతి. అందమగు వస్తువునుపభోగించుట కొందర ప్రకృతి.

విచ్చిన పూవునందు భగవంతుని జూచి యానందించు వారొకరు. దానిని గోసి తెచ్చి భగవంతుని బూజించి యానందించు వారింకొకరు. దానిని త్రుంచి తురుమున తురుముకొని యానందించు వారు మరియొకరు.

విజయవర్మ ఆశ్రమంలో కొన్ని అందమయిన విషయాలు చూస్తాడు.

మరుసటి రోజునుంచీ ఆశ్రమంలో విద్యార్థుల వస్తువులు మాయమవుతూంటాయి. దాంతో అల్లకల్లోలమవుతుంది ఆస్రమం. రకరకాల కథలు ప్రచారంలోకి వస్తాయి.

ఇది విజయవర్మ మనసులో దొంగతనమంటే ఏమిటన్న మీమాంసను రగిలిస్తుంది.

ఇక్కడే రచయిత ప్రతిభ తెలుస్తుంది. కథా గమనానికి భంగం కలగకుండా, పాథకుడికి ఏదో బఒధిస్తున్నట్తు విసుగు రాకుండా గొప్ప తర్కాన్ని తాత్విక సత్యాన్ని రచయిత చిన్న వాక్యాలు, అలతి పదాల్లో చూపిస్తాడు.

ఒక రాజును జయించి మారియొక రాజు వాని భూమినంతయు గలుపుకొనుచున్నాడు. అది పరాక్రమము.

పొలతిని పురుషుడును పురుషుని పొలతియు పరస్పరమాకర్షించి అపహరించుకొనుచున్నారు. ఇది ప్రేమ.

ప్రతి నిముషము ప్రతివాదును పంచభూతములను అపహరించుచునే యున్నాడు. ఇది దైవర్ణము.

పట్టుపదనిచో రాజు. పట్తుపదినచో దొంగ.

జగత్తంతయు దొంగల కొట్టు.

ఇలా ఆలోచిస్తున్న విజయవర్మకు దొంగతనమంటే ఏమిటో తెలుసుకోవాలని వుంటుంది.చర్చ ఇలా సాగుతుంది.

అయ్యా దొంగతనమనిన నేమి?
ఒకని వస్తువును మరియొకడు వాని యనుమతి లేక తనదిగా జేసికొనుట దొంగతనము. ఇది సామాన్య లక్షణము.

వస్తువొకనిదెటులగును?
ఈ బట్ట నేను నేసికొంటిని. ఇది నాది.
దీనిని దేనితో నేసిరి?
ప్రత్తినూలితో.
ప్రత్తియేడది?
ప్రత్తి మొక్కనుండి వచ్చినది.
ప్రత్తి మొక్క?
భీమినుండి.
భూమియెవరిది?
రేనిది.
రేనిదెటులాయెను?
రేడు జయించెను.
దేనిచే?
సైనికుల శక్తిచే.తన పరాక్రమముచే.
అగుచో రేడు దొంగ కాడా?
దొంగకాదని యెవడందుడు?కాని మిగిలిన దొంగల విప్లవమునుండి లోకుల గాపాడుటకీ గజదొంగ కావలయును. అది అన్యథ సిద్ధమగుచో నీ దొంగతో నంతగా పనిలేదు.

ఈ చర్చ జరిగిన రాత్రి విజయవర్మకొక కల వస్తుంది. ఆ కలలో అతదు ఇతర విద్యార్థులనుంచి దొంగిలించిన వస్తువులు తమ బాధలు చెప్పుకుంటాయి. అన్నీ కలసి విజయవర్మ మీదకు యుద్ధానికి వస్తాయి.

మరుసటి రోజు విజయవర్మ అందరి దగ్గరనుంచీ తాను దొంగిలించిన వస్తువులు వారికిచ్చేస్తాడు. ఈ ప్రపంచమున దొరకన్న వేర దొంగ యెవడు? అని అదుగుతాడు.

అప్పుడు గురువుగారు శిక్షగా అతదికి రాజ్యం కట్టబెడతారు. అందరూ తథాస్తు అంటారు. అప్పుడు విజయవర్మకు సౌందర్యబోధ కలుగుతుంది.

విజయవర్మకేమో గానీ, ఈ కథ చదివిన పాథకుడికి పలు రకాల, పలు ప్లేన్లలో సౌందర్యబోధ కలుగుతుంది.

ఇది ఎంతో గొప్ప కథ. చదివిన పాథకుదికి ఙ్నానం కలుగుతుంది. అవగాహన వస్తుంది, తన గురించి, తన చుట్టూ వున్న అంతహ్ బాహ్య ప్రపంచంగురించీ అవగాహన వస్తుంది.

ఈ కథలో విప్లవాలు లేవు కాబట్టి దీన్ని భావి తరాలకు అందించకపోతే నష్టం ఎవరికి? సమస్త ప్రపంచానికి.

అందుకే, విశ్వనాథ వారు ఒక మాట అన్నారు. సాహిత్యం సిద్ధాంతగతం కాకూడదని, తద్వారా సమాజంలో అసహజమయిన ద్వేష భావనలు చెలరేగుతాయని అందుకే, సిద్ధాంతగత సాహిత్యం సాహిత్యం కాదనీ అంటారాయన.

ఇలాంటి కథలు చదివితే వ్యక్తికి ఉద్రేకాలు, ద్వేషభావనలు కలుగవు. అవగాహన, విచక్షణ అలవడతాయి. విప్లవాలు, ద్వేషాలూ, చంపటాలూ లేకపోతే అది సాహిత్యం ఎలా అవుతుందనేవారికి నమస్కారం పెట్టి మరో అద్భుతమయిన కథ రేపు చెప్పుకుందాం.

Enter Your Mail Address

December 5, 2013 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: sahityakaagada

2 Responses

  1. SIVARAMAPRASAD KAPPGANTU - December 6, 2013

    “…మామూలు కథలు రాసే సాధారణ రచయిత అయినా, ఏదో ఒక ఉద్యమానికి, సిద్ధాంతానికి చెందినవాడయితే అతది పేరును, కథలను ఏదో రకంగా సజీవంగా వుంచుతారు. ముఖ్యంగా, వామ పక్షభావాలు, విప్లవాత్మక భావాలు, ఇతర ఉద్యమాలు, విప్లవాల భావాలు ప్రదర్శించే పిల్లి కూడా మాంసాహర పులులా భయంకర సహితీ వేత్త అయి బహుమతులందుకుంటుంది తెలుగు సాహిత్యంలో. అలాకాక, అతి గొప్ప కథలు రాసిన మహా రచయిత అయినా, భుజానికెత్తుకునే భజనగాళ్ళ విప్లవ గణాలు లేకపోతే మరుగున పడిపోతాడు….”

    చాలా నిజం నిర్భయంగా చెప్పారు మురళీకృష్ణగారూ. విదేశీ ఇజాల వల్ల, తెలుగు సాహిత్యం ప్రభావితం అయినంతగా మరే దేశపు సాహిత్యమూ ప్రభావితం అయ్యి ఉండదు అని నా ఉద్దేశ్యం.

  2. Manohar Chenekala - December 6, 2013

    chaalaa baagumdi.

Leave a Reply