భారతీయ తత్వ చింతన,ఒక పరిచయం పుస్తకం గురించి.

ఈ ఎనిమిది శక్తులు యోగి, యోగలో ఎదుగుతున్న కొద్దీ అతనికి వశమవుతాయి.ఇటువంటి పరిస్థితిలోనే యోగికి మనోనిగ్రహం అవసరమవుతుంది.
ఈ శక్తులన్నీ యోగిని తప్పు దారిపట్టించేవే. ఎప్పుడయితే యోగి తాను సాధించిన శక్తులను చూసి గర్వపడి వాటినిప్రదర్శించటం ఆరంభిస్తాడో అప్పుడే అతని పతనం ఆరంభమవుతుంది. కానీ ఆధునిక సమాజంలో యోగ ద్వారా సాధించిన కొన్ని శక్తులను ప్రదర్శించి ప్రజలను మభ్యపెటి పబ్బం గడుపుకుంటునారు. వీరంతా భ్రష్టయోగులు. కానీ, అసలు యోగి లక్షణాలు ప్రజలకు పరిచయంలేకపోవటం వల్ల, తమ కష్టాలు తొలగి ఏదో ఒరుగుతుందన్న ఆశకొద్దీ ప్రజలు ఈ భ్రష్ట యోగుల ప్రలోభంలో పడుతున్నారు. ఇది చూసుకుని ఇతరులు కూడా ప్రజలను మాయ చేయటం నేర్చుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే యోగ అంటే ప్రజాల్లో గౌరవం పోయేందుకు, యోగులు అపహాస్యంపాలయ్యేందుకు ఇటువంటి అౙ్నానం ప్రధాన కారణం

భారతీయ సామాజిక మనస్తత్వాన్ని వొశ్లేషిస్తూ, భారతీయ తత్వం ఎదుగుదల పరిణామ క్రమాన్ని,ఈ మహాసాగరంలో కలిసిన ఉపనదులు,వాటి ద్వారా తత్వంపరిపుష్టమయిన విధం,చేరిన మలినాలను నిక్కచ్చిగా,నిజాయితీగా సామాన్య పాఠకుడికీ అర్ధమయ్యేంత సరళంగా వివరించిన పుస్తకం భారతీయ తత్వ చింతన,ఒక పరిచయం.

Enter Your Mail Address

January 8, 2015 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

One Response

  1. Krishna Srikanth - January 8, 2015

    నమస్కారం. ఇది అసందర్భం కావచ్చు. కానీ మీ ఈ బ్లాగు చూసాక నేను వ్రాసిన ఆలోచనలకు మీ లాంటి వాళ్ళ అభిప్రాయం కోరుతున్నాను. ఈ లింక్ చూడగలరు – http://krishnasrikanth.in/2014/12/14/svaprakasa-kiranalu-preface/

Leave a Reply