25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథ విశ్లేషణ-18(1)

మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన 7 కథలు 25 ఏళ్ళ ఉత్తమ కథల సంకలంలో ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి. 1997 లో దావత్, 1998లో జమీన్, 2000లో న్యూ బాంబేయ్ టైలర్స్, 2001లో ఖాదర్ లేడు, 2002లో పెండెం సోడా సెంటర్, 2005లో కింద నేల ఉంది, 2010లో గెట్ పబ్లిష్డ్ అనే కథలు ఉత్తమ కథల సంకలనంలో స్థానం సంపాదించాయి.
ఖేఎర్ కథలను విశ్లేషించేముందు కొన్ని విషయాలు చర్చించాల్సివుంటుంది.
తరువాత వ్యాసాల్లో ఖదీర్ బాబు కథల విశ్లేషణ వుంటుంది అని ప్రకటించినప్పటినుంచీ అనూహ్యమయిన స్పందన లభించటం ఖదీర్ బాబు పాపులారిటీని సూచిస్తుంది. ఉదయం లేవగానే నెట్ తెరచి మీ విశ్లేషణ వుందేమో అని చూసి ఆశాభంగానికి గురవుతున్నాము, ఎందుకని ఇంత ఆలస్యం చేస్తున్నారంటూ దేశ విదేశాల్లో ఉన్న తెలుగు సాహిత్యాభిమానులనుంచి ఫోన్లు, మెసేజీలు రావటం ఈ వ్యాసాల ప్రాచుర్యంతో పాటూ రచయితగా ఖదీర్ బాబు ప్రాచుర్యాన్నీ నిరూపిస్తుందనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఫోను చేసినవారిలో అనేకులు, దులిపేయండి, ఎండగట్టండి, ఎంతో పొగరతనికి, పత్రికలో పెద్ద పొజిషన్లో వున్నాడు కాబట్టి చుట్టూ చేరినవారంతా అనవసరంగా పొగడి ఈగో పెంచారు, భూమి మీదకు దించండి….అనే అర్ధం వచ్చేట్టుగానే మాట్లాడేరు. ఇది, ఆయన రచయితగా ఫేమస్సో కాదో వదిలేస్తే, వ్యక్తిగా మాత్రం ఎంతో మంది రచయితలు, అభిమానుల హృదయాలను గాయపరచి కసిని రేకెత్తించాడని మాత్రం అర్ధమవుతుంది.
ఈ సందర్భంగా మరోసారి అందరికీ స్పష్టంగా చెప్పేదెమిటంటే, ఈ వ్యాసాలు, విశ్లేషణలు, ఎవరినో దులపటానికో, చీల్చిచెండాడటానికో, తక్కువచేసి చూపటానికో రాస్తున్నావి కావు. ఈ వ్యాసాల ప్రధనోద్దేశ్యం, తెలుగులో 25ఏళ్ళుగా ఉత్తమ కథలుగా చెలామణీ అవుతున్న కథలను కొన్ని నిర్దిష్ట ప్రామాణికాల ఆధారంగా విశ్లేషించి నిగ్గు తేలచటం. ఈ విశ్లేషణ పూర్తిగా సాహిత్య సంబంధి. ఇందులో వ్యక్తిగతమేమీలేదు. ఈ వ్యాసాల్లో విశ్లేషణకు గురవుతున్న కథలను స్ర్జించిన కథకులలనేకులతో నాకు వ్యక్తిగత పరిచయం వుంది. స్నేహం వుంది. కానీ, కథలను విశ్లేషించేటప్పుడు, నేను ప్రామాణికంగా భావించిన ప్రమాణాల ఆధారంగా నిష్పాక్షికంగా కథలను విశ్లేషించాలని ప్రయత్నిస్తాను తప్ప వ్యక్తిగతంగా కాదు. కాబట్టి, ఎవరయినా ఈ విమర్శలను వ్యక్తిగతంగా భావిస్తే, అది వారి ఆలోచనల్లో లోపం తప్ప నా విశ్లేషణలోని దోషం కాదు. అలాగే, వ్యక్తిగతంగా విమర్సించటమన్నది ఈ వ్యాసాల్లో కనబడదు. నాకు రచయితలతో పరిచయం వున్నా ఏనాడూ, నా పరిచయం సాహిత్య పరిథినిదాటి సన్నిహితం కాలేదు. ఎంతో మంది రచయితలతో నా పరిచయం నేను నా చుట్టూ గీసుకున్న గీత పరిథి దాటదు. ఇది నాతో పరిచయం వున్న వారికందరికీ తెలుసు…కాబోయే వారికి తెలుస్తుంది.
ఈ విశ్లేషణల మరో లక్ష్యం ఏమిటంటే తెలుగు విమర్శకులు అధికంగా కథను చదివి కాక, రచయిత పేరును చూసి కథ విమర్శ చేస్తున్న్నారు. అందువల్ల సాహిత్యం దెబ్బతినటమే కాదు, తెలుగు కథ వికృతరూపులో వేదికలపై పరిచయమవుతున్నది. అసలయిన కథలు, కథకులు ఎక్కదో అజ్ఞాతంగా మిగులుతున్నారు తమ కథలతో. అలాంటి కథలను వెతికి పరిచయంచేయాల్సిన విమర్శకులు భట్రాజ బృందాలు, భజన్ గణాలకన్న కనాకష్టంగా ప్రవర్తిస్తూండటంతో ఒక పీథం ఎక్కి కూచున్న కథల నిగ్గు తేల్చాల్సిన అవసరం వుందన్న ఆలోచనతో చేస్తున్న విమర్శలివి. దీన్లో కథకు తప్ప వ్యక్తిగతానికి తావులేదు. ఈ విశ్లేషణలకు నేను పాశ్చాత్య విమర్శన సిద్ధాంతాలను పరిగణనలోకి తీసుకోవటంలేదు. పూర్తిగా భారతీయ విమర్శన పద్ధతులను, సిద్ధాంతాలను ఆధారం చేసుకొని, సందర్భానుసారం వాటిని విశ్లేషించుకుని, అన్వయించి విమర్శ చేస్తున్నాను. ఇక్కడ కథకు పెద్దపీట. మిగతావన్నీ అప్రస్తుతాలు.
25ఏళ్ళ ఉత్తమ కథల సంకలనాలో ఉత్తమ కథగా ఎన్నుకున్న ఖదీర్ బాబు మొదటి కథ దావత్. ఇది ముస్లిం సమాజంలో పెళ్ళి దృశ్యాన్ని ప్రదర్శిస్తుంది. అయితే, ముస్లింలందరి ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు ఇలాగే జరుగుతాయని చెప్పలేము. ఎందుకంటే, ఎంతో సంస్కారయుతంగా, నవ్వులు, చలోక్తులనడుమ పెళ్ళిళ్ళు జరుగుతాయి. అంతగా విద్యాభ్యాసంలేని ఇళ్ళల్లో , కాస్త దిగువ స్థాయి ఇళ్ళల్లో జరిగే పెళ్ళిళ్ళలు, పైస్థాయి ఇళ్ళల్లో జరిగే పెళ్ళిళ్ళకూ తేడా వుంటుంది. అయితే, అధిక శాతం పెళ్లిళ్ళలో ఏదో ఒక విషయంలో మనస్తాపాలు సంబ్భవించటం సర్వ సాధారణం. అలాంటి ఒక ముస్లిం ఇంట్లో పెళ్ళిని వర్ణిస్తుందీ కథ దావత్. కథ పెళ్ళి తంతుకన్నా, పెళ్ళిలో ప్రధానభాగమయిన విందు సమయంలోని పరిస్థిని ప్రదర్సిస్తుందీ కథ. కథ ఆరంభంలోనే రచయిత ద్ర్ష్టి స్పష్టమవుతుంది.
ఆడోళ్ళని ఎప్పుడు కూసోబెడతారనా…..అంతుంది, అబీదా అనే అమ్మాయి ఆకలి అన్న కొదుకుని చూపిస్తూ
యేందిమే….నకరాలు పడుతుండావు. యిప్పుడే మొగ పెళ్ళోళ్ళు తొలి బంతి కూసున్నారు. వాళ్ళ మొగోళ్ళే ఇంకో రెందుబంతులకు పట్టేంతమందున్నారు. వాళ్ళయ్యాకవాళ్ళ ఆడోళ్ళా…ఆ తర్వాత మనమొగోళ్ళా. అంతా అయ్యాకే మీరు..అంతుందింకో పాత్ర ఆమె ప్రశ్నకు సమాధానంగా….
ఈ సంభాషణ కథ మొత్తాన్ని సూక్ష్మంగా చూపిస్తుంది.
ముస్లీముల పెళ్లిళ్ళలో మగవారికే ప్రాధాన్యం. అందులోనూ మగపెళ్ళివారికే ప్రాధాన్యం. చివరికి ఆడవారికి…ఆడవారు ఎంతో అణచివేతకు అక్రమంగా గురవుతున్నారు. వారిని మనుషుల్లా చూడట్లేదు అని సున్నితంగా చెప్పటం కథ ఉద్దేస్యం అన్నది అర్ధమయిపోతుంది.

కథ ముగింపు వాక్యాలివి
…..అతడి మాటలు ఎవ్వరికీ వినిపించడంలేదు. లోపల మొగోళ్ళు మొగోళ్ళు తిట్టుకుంటూ అడ్డం వచ్చిన వాళ్ళ పెళ్ళాల్ని పడేసి తంతున్నారు….ఆరోజు ఆడపెళ్ళోళ్ళలో యేడ్వని ఆదది లేదు.

కథ మధ్యలో, మాంసం అయిపోవటం, ముక్కలకోసం కొట్తుకోవటం, చివరికీ అదీ అయిపోవటం, ఆ ఇంతి అల్లుడు తన విస్తట్లో ముక్కలు పడలేదని పెళ్లాన్ని చితకబాదటం వుంటుంది….
కథ ముగింపు వాక్యాలకన్నా ముందు …..ఒక ఆడది ఒక మొగోడు కలసి కాపురంవుండాలంటే ఇంత తగాదా ఎందుకురా…ఇన్ని బాధలు ఎందుకురా…ఇంత ఖర్చెందుకురా….ఇన్ని వందలమంది ఎందుకురా…అని అరుస్తాడు పెళ్ళి పెద్ద…
అదీ కథ…..ఈ కథ ప్రధానంగా పెళ్ళి పేరు మీద జరిగే అనవసరమయిన వ్యయం, పెళ్ళిళ్లలోని గొదవలు, వాటి ప్రభావం పెళ్ళికూతురి సంసారంపై వుండటం వంటి విషయాలను చూపుతూ..పెళ్లి తతంగాన్ని విమర్సించటం….పనిలో పనిగా ముస్లిం మహిళల దుస్థితిని చెప్పటం…
ఇది చక్కని కథ. ఆరంభమయితే చివరివరకూ చదువుతాం. చదివించ గలిగే గుణం స్పష్టంగా తెలుస్తూంతుంది. ముఖ్యంగా వ్యక్తులను, ద్ర్శ్యాలను వర్నించిన తీరు సజీవంగా కళ్ళముందు నిలుపుతుంది. అంతే….ఒకవేళ చదివించగలిగే గుణమే ఉత్తమ కథగా ఎంపికయ్యే అర్హతనిస్తే, ఇంతకన్నా ఆసక్తిగా చదివించగలగటమే కాదు, చివర్లో కంటతడి పెట్టించేవీ, మనసును కదిలించేవీ కథలింకా ఎన్నో వున్నాయి. పైగా కథ చివరలో రచయిత చేసిన వ్యాఖ్య టోన్ లో ఆర్ద్రత కన్నా, అవహేళణ, అపహాస్యమే ఎక్కువగా కనిపించి, పాథకుడికి పాత్రలపైనా, పాత్రల పరిస్థితిపైనా సానుభూతికన్నా వ్యంగ్య భావనే ఎక్కువగా కలుగుతుంది. సాధారణంగా పెళ్ళిళ్లలో ఇలాంటి గలాటాలు జరిగేటప్పుడు కొందరు పెద్దలు పూనుకుని సర్దిచెప్తారు. అది ఈ కథలో లేదు.
కేవలం ముస్లిం వివాహ చిత్రాన్ని చూపించిందని, సాంప్రదాయ వివాహ పద్ధతిని విమర్సించిందన్న అంశం ఉత్తమ కథల సంపాదకులకు నచ్చివుంటుంది. రచయిత జర్నలిస్టవటము ఇతోధికంగా తోడ్పడి వుంటుంది. లేకపోతే, ఇది చదివించదగ్గ కథనే తప్ప గుర్తుంచుకుని ఉత్తమ కథగా విశ్లేషించదగ్గ కథ అనిపించదు. రచయితలు సాధారణంగా వ్యక్తిగత అనుభవాన్ని సార్వజనీన అనుభంగా పాఠకుడికి ఆలోచనకలిగే రీతిలో రచనను మలచినప్పుడే అది ఉత్తమ రచన అవుతుంది. వ్యక్తిగత అనుభవం, వ్యక్తిగతానుభవంగానే మిగిలిపోతే, అది ఉత్తమ రచన అవదు. ఒక తిమింగలాన్ని వేటాడటమనే వ్యక్తిగత అనుభవం, ప్రపంచంలోని పాథకులంతా స్పందించే సార్వజనీన అనుభవంగా మార్చటం ఉత్తమ రచనకు ఉత్తమ తార్కాణం.
1998లో ఉత్తమ కథగా ఎంపికయిన జమీన్ కథ టిపికల్ ముస్లిం మైనారిటీ పొలిటికల్లీ కరెక్ట్ కథ. చదవకముందే ఇది సమపాదకులు ఉత్తమకథగా ఎంచుకునే లక్షణాలతో ఉన్న కథ అని అర్ధమయిపోతుంది. చదివిన తరువాత ఆ ఆలోచన స్థిరపడుతుంది.
ఇక్కడ తిపికల్ ముస్లిం మైనారిటీ పొలిటికల్లీ కరెక్ట్ కథ అంటే ఏమిటో చర్చించాల్సివుంటుంది.
ఏదేశంలో మైనారిటీలకు రక్షణలేదు. ఇక్కడ మెజారిటీల పరమత అసహనం, హింసల ఆధారంగా మైనారిటీలు భయంతో ప్రాణాలుగ్గపట్టుకుని బిక్కు బిక్కుమంటూ ఏక్షణాన ఏమూక విరుచుకుపడి చంపేస్తుందోనని భయపడి చస్తూ జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు. ఇక రాజ్యం సైతం పోలీసుకు, సైన్యంద్వారా అమాయక మైనారిటీలను భయభ్రాంతులను చేస్తూ, అక్రమ నిర్భందానికీ చిత్రహింసలకు గురిచేస్తూ చంపేస్తోంది. ముస్లీములు అమాయకులు. పరమత సహనం కలవారు. వారు మెజారిటీ వివక్షకు గురవుతూ, చక్కగా వున్న సంబంధాలు ఇలా హింసాత్మకమవుతున్నాయేమిటని బాధపడుతున్నారు.
ఇంకా ఇలాంటి దేశాన్ని, సమాజాన్ని నెగతివ్గా చూపించే కథలన్నీ మైనారిటీ పొలితికల్లీ కరెక్ట్ కథలక్రిందకేవస్తాయి. దానికి చక్కని ఉదాహరణ జమీన్ కథ.
హుసేన్, బ్రహ్మయ్యలిద్దరూ చక్కని స్నేహితులు. అరమరికలు లేని స్నేహం వారిది. ఎదిగిన తరువాత వారు వేరే వేరే స్థలాలలో వుంటారు కానీ, వారి ప్రేమ తగ్గదు. ముసలివాడయిన తరువాత హుసేన్ కు బ్రహ్మయ్య పక్కనే జాగా కొని స్థిరపడాలనివుంతుంది. బ్రహ్మయ్య రమ్మంటాడు. తీరా హుస్సేన్ వచ్చేసరికి బ్రహ్మయ్య కొడుకు రమణ అసభ్యంగా, అనాగరికంగా ప్రవర్తిస్తాడు.
హుసేన్ ఇంట్లో అడుగుపెట్టడటంతోనే రమణ చివాల్న లేస్తాడు. దుమదుమలాడతా బయటకెళ్ళిపోతాడు. చివరికి బ్రహ్మయ్యని అదిగేస్తాడు హుసేన్ నీ కొదుకలా వున్నాడేమిటని.
కొడుకు ప్రస్తావన రాంగానే మొకం వేలాడేశాదు బ్రమ్మయ్య. వాణ్ణి చూస్తూంటేనే బయంగా వుందిరా. వాడూ వాది చేష్టలా. తెల్లారి లేచి ఇంతెత్తుబొట్టు పెట్టుకుని ఇంత పొడుగు కర్ర పట్టుకొని పోతావుంటాడు. మనకెందుకురా నాయినా అంటే వినడు. ఏందేందో పుస్తకాలు చదువుతాడు. ఇంకేందో మాట్లాడతాడు.
ఇంకా మాట్లాడుతూ, రే వీళ్ళంతా యెవురి మీదరా కర్ర తిప్పతావుండారు? నీ మీద, నీ భార్య మీద, కసాబ్ గల్లీ మీద….అంటాడు.
ఇంకా….చెడ్డీలే ఎసుకోబళ్ళా టోపీలే పెట్టుకోబళ్ళా..అయన్నీ లేకుండానే అంతకంటే కచ్చగా కర్రలు తిప్పడానికి యెంతోమంది తయారవతా వుండర్రా. మంతో కలసిమెలిసి వుండేవాళ్ళని, మనమద్య అమాయకంగా తిరిగేవాళ్ళని, యిగ్రహాలనీ వూరేగింపులనీ చెప్పిలాగుతుండార్రా..పగ పుట్టిస్తున్నార్రా….అంటాడు.
అంతలో రమణ వస్తాడు. అరుస్తాడు.
జీవాల్ని నరికే జాతోణ్ణి తెచ్చి మా నాయన స్థలం అమ్మతా వున్నాడు. యీళ్ళు ముందు జీవాల్ని నరకతారు. తర్వాత మనల్ని నరకతారు. యాడాదినుంచో వీళ్ళొచ్చి చేరేది అందుకేగా…అంతేకాదు…..హిందువు కానోడెవ్వడికీ యీడ ఏ వూరుల్యా..ఏ హక్కూల్యా…. అంటాడు. హుసేన్ ను గెంటేస్తాడు. హుసేన్ వెళ్ళిపోతాడు.
చీకటి మరింత దట్టమై ఆ యింటి మీద నల్లగా కమ్ముకుంది…అంటూ కథ ముగుస్తుంది…
కథ చదివిన తరువాత ఇది ఉత్తమ కథగా సంపాదకులు ఎందుకెంచుకున్నారో తెలిసిపోతుంది.
హిందూ మతతత్వ వాది. చెడ్డీలు, కర్రలు, కాషాయబొట్లు…..అంతా స్పష్టమే….హిందువుకానోదికి హక్కుల్లేవు అనటమూ…స్నేహంతో, ప్రేమగా హిందూ స్నేహితుడి దగ్గరకొచ్చి అవమానాలపాలై వెనుతిరిగిన ముస్లీమూ….ఇంతకన్నా లౌకిక పొలిటికల్లీ కరెక్ట్ కథ ఏముంటుంది? ఇది కాకపోతే ఉత్తమమైన లౌకిక భ్యుదయ మైనారిటీ కథ ఇంకేముంటుంది????//
మతకల్లోలాలు ఆరంభమయ్యేదంతా ముస్లీములు అధికంగా వుండే ప్రాంతాలలోనే అన్నది మన తెలుగు లౌకికవాద కథకులకు అవసరంలేని నిజం.
ఎక్కడెక్కడ హిందువులు అధిక సంఖ్యలో వుంటారో, అక్కడ అందరూ, అన్ని కులాలు మతాల వారు ప్రశాంతంగా బ్రతుకుతారు. కానీ, ముస్లీంలు అధికంగా వున్నచోట ఇతరు వుండరు, వుంటే బిక్కు బిక్కుమంటూంటారు. తీవ్రవాదులంతా ముస్లీంల ఇళ్లల్లోంచే వస్తూంటారు. వాళ్లు కాలాష్నికోవ్లూ, బాంబులూ పట్టుకొస్తే భయంలేదు కానీ, కాషయం బొట్టు పెట్టుకుని ఖాకీ నిక్కరేసుకుని కర్ర పట్టుకుంటే భయం భయం..ఘోరం అనర్ధం….కాష్మీర్ లో స్థానికులు తప్ప మరొకరికి భూఇ కొనే హక్కులేదన్న చట్టం వల్ల ఇప్పుడు జరుగుతున్న అనర్ధం మన కళ్ళెదురుగానే వుంది. అంత అమాయక పరమత సహనం కల మైనారిటీలు మెజారిటీలయిన స్థలంలో ఇతర మతాలవాళ్ళకేగతిపట్తిందో మనమంతా చూస్తూనేవున్నాం. మన లౌకికవాద అభ్యుదయ మైనారిటీ కథకులు, వారిని మెచ్చి ఉత్తమ కథలుగా నిలిపి మన దేసంలో మైనారిటీల కడగండ్లను ప్రపంచానికి చూపేవారు, మెజారిటీ మతతత్వమూ రాక్షసత్వమూ, ఊహాజనితమే అయినా ప్రపంచానికి ప్రదర్శిస్తూనే వున్నారు. ఇందుకు భిన్నంగా మైనారిటీ పెర్సెక్యూషన్ మనస్తత్వాన్ని ప్రదర్సించకుండా వారి జీవితాలను, సమాజంలో నెలకొని వున్న స్నేహ సౌభ్రాతృత్వ వాతావరణాన్ని ప్రదర్సించి, తాము మైనారిటీ రచయితలం కాదు, తెలుగు రచయితలం, భారతీయ రచయితలం అని నిరూపిస్తూ కథలు రాసే శశిశ్రీ( కలంపేరులో కూడా మైనారిటీ కనబడకూడదని, తన దేశంలో తాను మైనారిటీ ఎలా అవుతాడనీ భావించిన కథకుడు) ఒక్క కథకూడా 25ఏళ్ల ఉత్తమ కథల సంకలనంలో కనబడడు.. సలీం ఒక్క కథ మాత్రం ఎలాగో ఎంపికయింది.
మిగతా వచ్చే వ్యాసంలో

Enter Your Mail Address

April 14, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply