25ఏళ్ళ ఉత్తమ తెలుగు కథ విశ్లేషణ-18(3)

2002లో ఉత్తమ కథలలో ఒకటిగా ఎంపికయిన ఖదీర్ బాబు కథ పెండెం సోడా సెంటర్ ఏ కోణంలోంచి చూసినా ఉత్తమకథనే. ఈ విషయంలో సందేహంలేదు. కథ చెప్పిన విధానం అతి సుందరంగా వుంటే కథాంశం అతి చక్కది. సమాజంలో ఒక మూడు నాలుగు దశాబ్దాలలో మానసికంగా, వ్యాపారపరంగా, సామాజికంగా వచ్చిన మార్పులను అతి సరళంగా ఎదకు హత్తుకునే రీతిలో ప్రదర్శించిన కథ ఇది. కావలిలోని పెండెం సోడా సెంటరునేకాదు, ఆ కాలంలో ప్రతి వూళ్ళోనూ వుండే ఇలాంటి గోలీ సోడా సెంటర్లను, చంద్రయ్యలను మళ్ళీ సజీవంగా కళ్ళముందు నిలుపుతుందీ కథ. అయితే, ఈ కథ ఇంతకుముందరి ఖదీర్ కథలు న్యూ బాంబేయ్ టైలర్స్, ఖాదెర్ లేడుల్లాగే ఒకే కోవకు చెందిన కథ. సమాజంలో వస్తున్న మార్పులు దానికి తట్టుకుని మొండిగా నిలబడిన వాళ్ళు. కానీ, ఖాదర్ లేడుకు భిన్నంగా ఈ కథ ఫోకస్ ఒకే పాత్ర ఒకే అంశం పైన వుండటంతో కథలో ప్రధానపాత్ర, ప్రదర్శించాలనుకున్న అంశం నుంచి పాఠకుడి దృష్టి చెదరదు. అడుగదుగునా న్యూ బోంబే టైలర్స్ గుర్తుకువస్తున్నా, ఈ కథ దానికదే ప్రత్యేకంగా నిలుస్తుంది.
2005లో ఉత్తమ కథగా ఎంపికయిన కింద నేల ఉంది ఒక విచిత్రమయిన కథ. దీన్ని కథ అనాలా? ఇంకేదయినా అనాలా అన్న ఆలోచన వస్తుందీ కథ చదువుతూంటే.. వేర్వేరు కథలను ఒక చోట గుదిగుచ్చి చెప్పాలని చేసిన ప్రయత్నం అనిపిస్తుంది. దానితో కథ ఒక స్థాయి దాటిన తరువాత విసుగువస్తుంది. చదవటం భారమనిపిస్తుంది. కథపై దృష్టి పెట్టటం కష్టం అనిపిస్తుంది. అలాగని రచయిత కథను చెప్పిన విధానం బాగాలేదని కాదు. రచయిత అలవాటయిన కథన సంవిధానం కథను చదివేట్టు చేస్తుంది. కానీ కథ నిడివి పెరగటంతో చదవటం కష్టమయిపోతుంది. పైగా, కథలో ఆసాంతం పట్టి చదివించేంత పట్టులేకపోవటంవల్ల రచయిత ఈ కథద్వారా ఏంచెప్పాలనుకున్నాడో, అసలీకథ ఎందుకు చెప్పాలనుకున్నాడో అర్ధంకాని గందరగోళం మొదలవుతుంది.
ఇతర కథలలో ప్రధానపాత్ర కథ చెప్తూ సామాజిక పరిణామాలు, మనస్తత్వాలను ప్రదర్శించినట్టే ఈ కథలోనూ ప్రధాన పాత్ర కథ చెప్తూ సామాజికంగా వ్యవస్థలోనూ, మనస్తత్వాల్లోనూ జీవన విధానాల్లోనూ వస్తున్న మార్పులను ఈ కథలోనూ రచయిత ప్రదర్శించారు. కానీ, ఇతర కథల్లో వున్న సాంద్రత ఈ కథలో లోపించింది. ఏమాత్రం జాగ్రత్తగా చదివినా ఈ కథ కాస్త కసి తీర్చుకోవటానికి రాసిన కథ అనిపిస్తుంది తప్ప, పాత్ర పట్ల సానుభూతి, పరిస్థితిపట్ల అవగాహన కనిపించవు ఈ కథలో. అది ఈ కథను దెబ్బ తీసిన అంశం.
కథను చెప్పే రచయిత అభిమాని లక్ష్మి అనే డాక్టర్. ఆమెకు తనకొడుక్కు సంగీతం నేర్పించాలని వుంటుంది. ఆ అబ్బాయికి సంగీతం మాస్టారిని చూపించేందుకు మన కథకుదిని తీసుకుని కారులో వెళ్తుంది డాక్టర్. ఆ అబ్బాయికి ఇవేవీ పట్టవు. సెల్ ఫోనుతో ఆడుతూంటాడు. సంగీతం గురువు కుదరక పోవటంతో ఆమె నిరాశ చెంది మన కథకుడికి తన కథ చెప్పటం మొదలుపెడుతుంది. వాళ్ళది మంగలి కుతుంబం. ఆమె తండ్రి డాక్టరు. ఈమెని డాక్టరు చేస్తాడు. ఈమె మరో డాక్టరుని పెళ్ళిచేసుకుంతుంది. అప్పుడే ప్రభుత్వంలో డాక్టర్ల నియామకాన్ని నిశేధించటం, ఫైవ్ స్టార్ కార్పొరేట్ ఆస్పత్రులు రావటం, ఇంకా పూర్తిగా ఫామిలీ డాక్టర్ల వ్యవస్థ పోకపోవటంతో వీళ్ళకు బ్రతకటం కష్టమవుతుంది. ప్రైవేత్ ఆస్పత్రిలో ఆమె చేరుతుంది. అతడు డబ్బు కోసం రియద్ వెళ్తాడు. ఇంతలో ఈమె గర్భవతి అవుతుంది. చిన్నప్పటి ఆర్త్రిటిస్ మళ్ళీ వస్తుంది. దానికి ఇచ్చిన ట్రేట్మెంట్ వల్ల ఈమె కళ్ళలో నీటి ఉత్పత్తి దెబ్బతింటుంది. డ్రై ఐస్ అన్నమాట. దాంతో చూపు దెబ్బతిని ఆమె కళ్ళల్లో కృత్రిమంగా నీటి డ్రాప్స్ వేసుకుంతూంటుంది. ఆమె అతడిని ఇంటికి తీసుకువెళ్తుంది. అందుకు బాబు అనుమతి తీసుకుంటుంది. ఎందుకంటే రియధ్ వెళ్ళిన తరువాత పిల్లవాడికి తండ్రికి సాన్నిహిత్యం పెరిగి పిల్లవాడీమె ఏ మగవాదితో మాట్లాడినా అనుమానిస్తూంటాడు. ఆమె పిల్లవాదికి నిద్రమాత్రలిచ్చి పదుకోబెట్టి ఇతనితో తాగుతూ తన కథ చెప్తుంది. ఇప్పుడామె దాదాపుగా గుడ్దిది. పిల్లవాదికి సంగీతం రావటంలేదు. అంతా నిరాశ..ఫ్రస్ట్రషన్, డిప్రెషన్…చెప్పీ చెప్ప్పీ ఆమె పడుకుంటుంది. మన కథకుడు ఇంతికి వచ్చేస్తాడు. తరువాత ఆమె పిల్లవాడికి సంగీతం నేర్పాలని ప్రయత్నించి విఫలమవుతుంది. ఇంతలో వాద్డికి చెట్ల పిచ్చి మొదలవుతుంది. దానితో ఫ్లాట్ వదిలి ఖాళీ స్థలమున్న నేల కొని నేలపై బ్రతాకాలనుకుంటుంది.
కన్నీళ్ళు ఇంకి తడి ఆరిపోయిన ఈ కథలో కాసింత చెమ్మను చీల్చుకుని పచ్చటి మొక్కలు తలెత్తుతున్న దృశ్యం రచయితకు కనిపిస్తూంటే కథ ముగుస్తుంది.
కథ బాగుంది. అర్ధం పర్ధం లేని కథ అనిపిస్తుంది. డాక్టర్ల ఉద్యోగ పరిస్థితి బాగానే అనిపించినా ఏపాత్రా సరిగ్గా ఎదగదు. సామాజిక దౌష్ట్యం, రిజిడిటీ వంటివి కథలో వున్నా, ప్రస్తుత వ్యవస్థ పట్ల విసుర్లూ విమర్శలూ వున్నా కథలో ఎపాత్ర పట్ల సానుభూతి కలగదు. ముగింపు మరీ గందరగోళంగా అనిపిస్తుంది. పిల్లవాడు మొక్కలు పెంచి వాటితో మాట్లాడుతూ అమ్మ ఎవరితో తాగుతోంది, ఎవరిని ఇంటికి తెస్తోందో పట్తించుకోకపోవటంతో కొత్త పచ్చటి చెట్లు చిగురుస్తాయా? అమ్మాయి మానసికి వ్యధ తీరిపోతుండా? వాళ్ళ డబ్బు సమస్యలు తీరిపోతాయా? పిల్లవాడి ఒబేసిటీ, మానసిక వ్యాధులు నయమయిపోతాయా? అదీగాక, ఎంత అభిమాన రచయిత అయినా, అలా ఇళ్ళకు తీసుకెళ్ళి తాగుతూ, జీవిత కథలు విప్పి చెప్తారా? ఒక దశలో ఇదేదో సృంగార కథగా మళ్ళుతుందేఅమో అనిపిస్తుంది. పైగా, మహిళ పాత్ర మీద ఎలాంటి సానుభూతి కలగకుండా పిల్లవాడు మళ్ళీ ఎవరిని తెచ్చుకుని ఎందుకు తాగుతున్నావని అడిగే సంఘటను కల్పించి ఆమెకు ఇలా మగవారితో తాగి తన కథ చెప్పటం అలవాటే అన్న చులకన భావన కలిగించాడు రచయిత. ఇలా అత్యంత లోప భూయిష్టమూ, అడుగడుగునా అసంబద్ధమనిపించే రీతిలో ఉన్న ఈ కథను ఉత్తమ కథగా సంపాదకులు ఎందుకు ఎంచుకున్నారో అర్ధమయిపోతూన్నా, ఈ కథను ఉత్తమ కథగా ఆమోదించటం కష్టమే. పైగా, ఈ కథ చదువుతూంటే రచయితకు మహిళలంటే, ముఖ్యంగా కాస్త సామాజికంగా పై స్థాయిలో వున్న మహిళలంటే చాలా చులకన అభిప్రాయము, అదో రకమయిన కసి( క్రింది స్థాయినుంచి పై స్థాయికి ఎగబ్రాకలేక, మధ్యలో మిగిలి పైకి ఆశగా చూస్తూ, వున్న దానితో సంతృప్తిపడలేక, అందని ద్రాక్షలు పుల్లన అన్న రీతిలో రాళ్లు విసిరే కసి లాంటిది హై క్లాస్ మహిళల గురించి రాస్తున్నప్పుడు రచయితలో యాధృఛికం కాదేమో!!!! బహుషా ఈ నిర్ణయానికి రావటం వెనుక రచయిత ఇతర రచనలు, బియాండ్ కాఫీ కథల సంపుటి కథల ప్రభావం వుంటే దోషం నాదికాదు, రచయితదే. కనబడ్డ వాడితో సెక్స్ కో మనసు విప్పేసి మాట్లాడేయటానికో మహిళలు ఒంటరితనపు ఫ్రస్ట్రేషంతో అల్లల్లాడిపోతున్నారని చూపించటం ఆధునికమఊ అభ్యుదయమూ అని ఊరేగేవారికి…నమస్కారం. వారు చేయబోయే అన్ని విమర్శలకూ ఒకటే సమాధానం..సబ్ కుచ్ సీఖా హమ్నే నా సీఖీ హోషియారీ)
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. రచయితకు మహిళల మనస్తత్వంతో ముఖ్యంగా భర్తకు దూరంగా వున్న మహిళల మనస్తత్వంతో అస్సలు పరిచయం వున్నట్తులేదనిపిస్తుంది. మేల్ ఫాంటసీల అలల సృంగాలపై తేలియాడుతూ కథలో ఫ్రస్ట్రేటెడ్ మహిళల పాత్రను సృష్టించాడనిపిస్తుంది. రచయితలో వున్న ఆత్మ న్యూనతా భావానికి, దాన్ని తన కథలో ఎదుతువారిని తక్కువగా చూపి ఆత్మవిశ్వాసంగా మార్చుకోవాలని చేసే ప్రయత్నానికీ కిందనేల వుంది కథ చక్కని ఉదాహరణ.
ఇందులో అమ్మాయి డాక్టరయి వుండి, మందుల వాడకం వల్ల చూపు దెబ్బతిని వుండి, పర పురుషుడితో తన గోడు చెప్పుకోవటానికి నిద్ర మాత్రలిచ్చి రావటం అత్యంత హేయమైన చిత్రణ. కనీసం డాక్టర్లు పిల్లలకు అలా విచక్షణ రహితంగా నిద్ర మాత్రలివ్వరు. అలా ఇచ్చేవారిపై ఎలాంటి సానుభూతి చూపాల్సిన అవసరమూ లేదు. ఒక గంట వుండిపోయే వాడికి, జీవితాంతం తనతోవుండి తన బాధ్యత అయిన పిల్లవాడికన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం అన్నది మానసిక రోగానికి పరాకాష్ట. అలాంటి మానసిక రోగానికి గురయినవారు పిల్లవాదు చెట్లు పెంచితేనో, ఇల్లు కిందనేల మీదకు మారితేనో పచ్చగా ఎదగరు. తమ మానసిక అశాంతిలో ఇంకా కూరుకుపోతారు. ఎందుకంటే నిరాశా నిస్పృహలు బయటనుంచి రావు. వ్యక్తి లోలోపలేవుంటాయవి. బయట ఎంత మారినా లోపల మారకపోతే ఫలితం వుండదు. ఈ గ్రహింపులేకుండా అడ్డదిడ్డంగా ముగుస్తుంది కథ. అందుకే, రచయితగా ఖదీర్ రాసిన ఈ సంకలనంలోని ఉత్తమ కథల్లో ఈ కథను అందరూ గొప్పగా పొగిడే నీచమైన కథగా భావించవచ్చు.
ఇక్కడే మరో విషయం ప్రస్తావించాలి. సయాన వోహై జో పత్ ఖద్ మేభీ సజాలే గుల్షన్ బహారోన్ జైసా..అంటారు. ఎడారిలో, రాళ్ళగుట్టలనడుమకూడా తోటలో పూవులా వికసించేదే ఉత్తమ వ్యక్తిత్వం. రచయితలు అలాంటి వ్యక్తిత్వాలను చూపి పాఠకులలో ఆశాభావాన్ని రేకెత్తిస్తే రచయితగా చీకత్లోనూ చిరుదివ్వె చూపినవారవుతారు. అలాకాక, ఒకరిద్దరు మానసికరోగుల కథలను రాసి, అవే సకల సమాజానికి దర్పణాలుగా ప్రచారం చేసుకుంటే సమాజానికి చెదు చేసినవారవుతారు. అలాంటి తెల్లగుడ్డపైని నల్ల చుక్కను అత్యంత వికృతంగా, ఒక vicarious pleasureతో చూపిన కథ ఇది . అందుకే, వ్యక్తిగతంగాన్నొ, ఒక రచయితగానూ కూడా ఏమాత్రం నచ్చని కథ ఇది.
మిగతా కథల విశ్లేషణ తరువాత వ్యాసంలో…

Enter Your Mail Address

April 27, 2017 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply