పుస్తకాల అమ్మకంలో నా అనుభవాలు-3

వార్త ఆదివారం మాగజీన్ కు కవర్ స్టోరీ తయారు చేసాను. మిగతా పనులు చూసుకుని అతి అయిష్టంగా పుస్తక ప్రదర్శన వైపు వెళ్ళాను. ఇవాళ్ళ శ్రీపతి శర్మ తన భార్యతో వస్తానన్నాడు. ఆవిడ ఫోను చేయటం వల్ల నా అర్ధాంగి కూడా వస్తానంది. వాళ్ళ ఆఫీసు నుంచి ప్రదర్శన స్థలానికి బస్సు లేదు. ఆటో లో రావాల్సి వచ్చింది. ఈరోజు కేపీ అశోక్ కుమార్ కూడా వస్తానన్నాడు. సరయిన బస్సులేక ఆయన సెక్రెటేరియట్ నుంచి నడుస్తూ వచ్చాడు. అప్పుడు అనిపించింది, పుస్తక ప్రదర్శనకు ప్రజలు పెద్ద ఎత్తున రావటంలేదని వాపోతున్నాము, కానీ నెక్లేసు రోడ్డులో ఈవైపు రావాలంటే స్వంత వాహనం వుంటేనే సులవవుతుంది. పైగా, ఇక్కడికి వచ్చేవారంతా ప్రేమికులో, సాయంత్రం కాస్త సమయం రిలాక్సుగా గడపాలనుకునేవారో. కేవలం పుస్తకాల కోసమే అఫీసయినతరువాత, ఇంత దూరం నడక మీద వచ్చేవారెంతమంది? ప్రేమికులకు పుస్తకాలతో పనిలేదు. రిలాక్సవ్వాలనుకున్నవారికీ పుస్తకాలతో పనిలేదు. కాబట్టి, ప్రజలు పెద్ద సంఖ్యలో రావటంలేదని అనుకునేకన్నా, వస్తున్న వారిని చూస్తే, ఇంత మంది నిజమయిన పుస్తకప్రేమికులున్నారన్న సంతృప్తి కలుగుతుంది.

ఇవాళ్ళ నేను వచ్చేసరికి ఆలస్యమయింది. వార్తలో కవర్ స్టోరీ ఇచ్చి, గుడిపాటితో, ఎడిటర్ టంకశాల అశోక్ గారితో ముచ్చటించి తీరికగా వచ్చాను.

నేను వచ్చేసరికి మా స్టాలులో యుద్ధం జరుగుతోంది.

డాక్టర్ నగేష్, అతని అనుచరులు ప్రాక్టికల్ సైకాలజీ అనే ఆయన పత్రికను పట్టుకుని వచ్చారు. మొత్తం ఒక టేబిల్ నిండా వరుసగా ఆ పత్రిక కాపీలు పరచారు. దాంతో అటు కమ్మ వారు, ఇతు తెలంగాణా వారు అతనితో యుద్ధానికి దిగారు. నేను చేరే సరికి ఇదీ పరిస్థితి.

ఇది రచయితల స్టాలు. అందరమూ స్థలాన్ని పంచుకోవాలి.ఇదొక పరస్పసహకార పుస్తకల అమ్ము వేదిక. ఒక్కరే అంతా ఆక్రమిస్తే కుదరదు. అందరి పుస్తకాలూ కనబడాలి అని చెప్పా. నగేష్ అనుచరుదు వినలేదు. వుండనీ సార్ అంటూ మా పుస్తకాల మీద పత్రికలు పరచేస్తున్నాడు.

అసలే ఒక రకమయిన వైరాగ్యంలో వున్నాను. సమయం ఇక్కడ అనవసరంగా వ్యర్ధం చేఉకుంతున్నానన్న భావనతో వున్నాను. ఇంత్లో నేను చదవాల్సిన పుస్తకాలు నన్ను పిలుస్తున్నాయి. రోహింటన్ మిస్త్రీ, శశి దేష్పాండే, జాన్ గ్రిబ్బిన్, పాలగుమ్మి పద్మరాజు, ఎనుగంటి వేణు గోపాల్, సీ నరసిమ్హారావు, మార్క్ త్వెయిన్ లు నాకోసం ఎదురుచూస్తున్నారు. నేను ఇక్కడ ఎండాకాలంలో వస్తాయో రావో తెలియని, వచ్చినా, వర్షిస్తాయో లేవో తెలియని నల్ల మేఘాల కోసం ఎదురుచూస్తున్నట్టు ఎదురుచూస్తూ, ఆ వొచ్చే మేఘాలు రాల్చీ రాల్చని చినుకు కోసం ఆత్ర పదుతూ, వారి దృష్తిని ఆకర్సించాలని స్థలం కోసం పోరాడాల్సి రావటం అత్యంత చిరాకుని కలిగించింది.

మరో మాటకు ఆస్కారం లేకుందా, వారి పత్రికలు జరిపి అన్నితినీ ఒకే వరుసలో ఒక దాని క్రింద ఒకటి పెట్టి మిగతా వారి పుస్తకాలన్నితికీ స్థలం కల్పించాను. ఆ అబ్బాయి ఏదో మాత్లడబోతే, నేను నీతో కాదు మీ నగేష్ తోనే మాట్లాడతాను, ఆయననే రమ్మను అన్నాను. అని తల ఎత్తి చూస్తే ఎదురుగా నగేష్ ఉన్నాదు.

ఆయన్ అనన్ను ఆప్యాయంగా పలకరించాదు. మీ రచనలు అత్యంత ఆసక్తిగా చదువుతానని అన్నాడు. ఆయనకు చెప్పాను, ఇక్కడ వున్న స్థలంలోనే అందరమూ సర్దుకోవాలని. ఆయన తన అనుచరుడికి అదే చెప్పాడు. మళ్ళీ కలుదాము, మీతో మాత్లాడాలి చాలా అన్నాడు వెళ్తూ. ఆయనకు నేను రాసిన adolescent psychology ఇతివృత్తం కల అంతర్మధనం కాపీ ఇచ్చాను. తీసుకుని వెళ్ళిపోయాదు.

ఇదంతా జరిగే సరికి మనసు పాడయిపోయింది. ఇంత్లో నా సామ్రాజ్యంలో కూచుని మంచి పాతల రస ప్రవాహంలో తేలుతూ, పుస్తకాలు చదువుతూ అవి సృష్తించో అద్భుత ప్రపంచంలో తేలుతూనో, లేకపోతే నేను వినూత్న ప్రపంచాన్ని స్ర్జిస్తూనో హాయిగా వుండేవాడిని, నాకీ స్థలాల గోల ఏమిటి, అమ్మకాల ఆత్రం ఏమిటీ అనిపించింది.

స్టాలు వదలి దూరంగా కూచున్నాను. శ్రీపతి అతని భార్య వచ్చారు. పద్మ వచ్చింది. అలా తిరుగుతూ ఒక సారి స్టాల్ వైపు చూసా. ప్రాక్టికల్ సైకాలజీ, కమ్మ పుస్తకాలు, తెలంగాణా పుస్తకాలు రాజీపది ఒప్పందానికి వచ్చాయి. అన్ని ఇతర పుస్తకాలపైన తమ ఆధిక్యాన్ని నెరపుతున్నాయి. పట్టించుకోలేదు. ఇంతలో వేరే మితృలు వస్తే వారితో మాట్లాడుతూ సమయం గదిపాను. ఒక పుస్తకావిష్కరణ ప్రహసనం చూసాను. ఆతరువాత నేను శ్రీపతి రిలాక్సుదుగా కూచున్నాము.

ఇంతలో, పప్పు అరుణ వచ్చారు. నా పుస్తకాలు కొంటానన్నారు. పుస్తకాలు కొంటానని మొదతి రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి వచ్చారు. ఇంతలో ప్రొఫెసర్ పిల్లమర్రి రాము గారు వచ్చారు. అసిధార, జీవితం జాతకం కొన్నారు. అరుణ గారు వచ్చిన వేళాఅ విషేషమేమిటో కానీ దుకాణం మూసిన తరువాత నా పుస్తకాలు కొనటానికి అందరూ రావటం ఆరంభమయింది. ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గారు జీవితం-జాతకం కొన్నారు.వీరికి పుస్తకాలిచ్చి చూసేసరికి అరుణగారు లేరు. నా పుస్తకాలు తీసుకుని, ఈఎ తెలుగు దగ్గరకు వెళ్ళాను. అవి చూసి ఆవిడ, అన్నీ మీ పుస్తకాలేతెచ్చారు. నాకు మనీ ప్లాంట్ కావాలి అన్నారు. నా పొరపాతు అర్ధమయింది. నేను రచయితగా ప్రవర్తించాను. ప్రచురణ కర్తగా ఆలోచించలేదు. వెంటనే స్టాలుకు రమ్మన్నాను. నల్లమోతు శ్రీధర్ కూడా మనీప్లాంట్ కావాలన్నాడు. ఇద్దరినీ స్టాలుకు తీసుకెళ్ళాను. మొహమాటపెట్టి వారు కొనాలనుకున్న వాటికన్నా ఎక్కువ పుస్తకాలే కొనిపించాను. కానీ ఏదో ఉత్సాహము, ఆనదమూ కలిగాయి. నిజంగా, ఈ బ్లాగు బంధం ఏనాతిదోకదా! బ్లాగ్మితృల నుంచి ఇంతగా ప్రోత్సాహం లభిస్తోంది అనిపించింది.బయట ప్రపంచం పట్టించుకోకున్నా, గుర్తించకున్నా బ్లాగ్లోకం నన్ను ఇంతగా ఆదరిస్తోంది! గంగి గోవు పాలు గరిటెడయినను చాలు అన్నారు. బయట లక్షల సంఖ్యలో మెప్పు పొందేకన్నా, బ్లాగులో వందల సంఖ్యలో లభించే అసలు సిసలయిన ఆదరణే అమూల్యం.

అయితే, పుస్తకాలు కొన్న బ్లాగ్మితృలందరికీ మనవి. కొన్న పుస్తకాలు తప్పనిసరిగా చదవాలి. చదివి వదిలేయకుండా అభిప్రాయం నిర్మొహమాటంగా రాయాలి. పుస్తకం నచ్చితే దాన్ని పదిమందికీ పరిచయం చేయాలి. చదివించాలి. పుస్తకం గురించి చర్చించాలి. ఈరకంగా మంచి పుస్తకానికి ప్రచారము, ఆదరణలను కలిగించాలి. ఇజాలు, సంకుచితాల రంగుటద్దాల మోజులో పడి, గిరిగీసుకుని తనపై తానే పరిమితులు విధించుకుంటూ సహిత్య ప్రపంచం ఏం కోల్పోతోందో, మన బ్లాగు ప్రపంచం చూపించాలి. అసలు సిసలు సాహిత్యాన్ని ఆదరించి పెద్దపీట వేయాలి. మరోసారి బ్లాగ్మితృలందరికీ బహు కృతఙ్నతలు.

ఈరోజు పుస్తకాల అమ్మకానికి నేను రావటంలేదు. ఎందుకంటే నేనీవారం ఇంకా పవర్ పాలిటిక్స్ రాయలేదు. ప్రతివారం ఈ రచన నాకొక యఙ్నం లాంటిది. కాబట్టి ఈరోజు స్టాలులో స్థలం వేరేవారికి వదిలి, పోటా పోటీ ప్రపంచంలో బొటాబొటీగా పుస్తకాలమ్మేందుకు రేపు వస్తాను.

Enter Your Mail Address

December 23, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

No Responses

 1. chavakiran - December 24, 2008

  మీ పుస్తకాలకు రివ్యూలేమయినా ఉంటే పంపుతారా

  అన్నట్టూ,

  మీరు పుస్తకానపై ఆటోగ్రాఫ్ చెయ్యటం మర్చిపోవటంలేదు కదా. ఇలా రచయిత కనిపిస్తే ఆటోగ్రాఫ్ తీసుకోటం సంప్రదాయం

 2. నంద - December 24, 2008

  నిన్న మీరు మన ఇ-తెలుగు స్టాల్ కి వచ్చి, శ్రీధర్ గారిని, అరుణగారిని తీసుకెల్లడం చూసాను గానీ, మీతో పరిచయం లేకపోవడం వల్ల మీ రచనలు చూడలేకపోయాను. తప్పనిసరిగా రేపు (గురువారం) మీ స్టాల్‍కి వస్తాను. ఇంతకి మ్

 3. కె.మహేష్ కుమార్ - December 24, 2008

  వింటున్నా..వింటున్నా!!!

 4. cbrao - December 24, 2008

  ఇలా స్టాల్ లో పుస్తకాలు అమ్మటం – పుస్తకాలు అమ్ముడయినా,
  కాకపోయినా కొత్త వ్యక్తుల పరిచయం, కొత్త అనుభవాలు మిగులుస్తాయి. అవి మీరు మాతో పంచుకున్నందుకు సంతోషం. నేను హైదరాబాదులో ఉండి ఉంటే మీ ఆటోగ్రాఫ్ కోసమైనా మీ పుస్తకాలు కొనేవాడిని.

 5. సుజాత - December 24, 2008

  మీ పుస్తకాలు తెచ్చి మీకే ఇస్తున్నాను 25న!
  మీరు ఆటోగ్రాఫ్ చేసి నా పుస్తకాలు నాకిచ్చేయండి మర్యాదగా!

 6. కస్తూరి మురళీకృష్ణ - December 24, 2008

  స్పందించినవారందరికీ కృతఙ్నతలు.
  సుజాతగారూ, నన్నింతవరకూ ఆటోగ్రాఫ్ అడగలేదెవ్వరూ. కాంప్లిమెంటరీ ఇచ్చేవారికి, వారు వొద్దన్నా నేనే సంతకం చేసి ఇస్తున్నాను. కాబట్టి, ఇప్పటినుంచే సంతకం పెట్టటానికి సిద్ధమవుతూ ప్రాక్టీస్ చేస్తున్నాను.

  మనం విదేశీయుల నుంచి బోలెడు నేర్చుకున్నాము కానీ, పుస్తకాలను, రచయితలను గౌరవించటం నేర్చుకోలేదు. అది రావాలంటే రచయితలు మారాలి, రచనలు మారాలి. విమర్శకులు మారాలి. విమర్శలు మారాలి. మొత్తంగా సాహిత్య ప్రపంచమూ, సాహితీ వేత్తలలో మార్పురావాలి. నేను అనంత ఆశావాదిని. నా జీవిత కాలంలో ఆ మార్పు వస్తుందనే నమ్ముతున్నాను.

 7. కస్తూరి మురళీకృష్ణ - December 24, 2008

  చావా కిరణ్ గారూ, రచయిత కనిపిస్తే సంతకం తీసుకోవటం ఎవరి సాంప్రదాయమో కానీ, అక్కడ ఎవరికీ నేను రచయితగా కనబడటంలేదు. పుస్తకాల దుకాణంలో పుస్తకాలమ్మేవాడిని మాత్రమే. అలా కనబడటమూ వారి తప్పుకాదు.

Leave a Reply