పుస్తకాల అమ్మకంలో నా అనుభవాలు-4

ఇవ్వాళ్టితో దాదాపుగా నా అమ్మకాలు అయిపోయినట్టే. ఇంకా మూడు రోజులు ప్రదర్శన వున్నా, నా రాతలు, కోతల వల్ల మళ్ళీ ఆదివారమే ప్రదర్శనకు రాగలుగుతాను. అదీ మిగిలిన పుస్తకాలను మూటకట్టుకుని పోవటానికీ, నేను నాకు నచ్చిన పుస్తకాలను కొనుక్కోవటానికే1

ఇవాళ్ళ ఈ తెలుగును మహిళా బ్లాగర్లే చూస్తారని అనుకున్న నాకు, ఇంకా నల్లమోతు శ్రీధర్ గారు ఇతరులు కనబడటం ఆశ్చర్యమనిపించింది. మహిళా బ్లాగర్లు నెట్ లో తెలుగు వాడకాన్ని వివరిస్తారని నా కొలీగులను(మహిళలే) రమ్మన్నాను. ఇదే శ్రీధర్ తో చెప్తూంటే పక్కనే వున్న కొల్లురి సోమశంకర్ అపార్ధం చేసుకున్నాడు. తనని బలవంతం చేసి తీసుకు వచ్చానీరోజు. మన బ్లాగర్లు వస్తారు. సంతకం పెట్టి పుస్తకాన్ని అమ్మే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇప్పుడొచ్చింది. మళ్ళీ మన జీవిత కాలంలో ఎప్పుడు వస్తుందో తెలియదు. అందరినీ కలిసే వీలు కూడా ఇలా మళ్ళీ మళ్ళీ రాదని బిసీగా వున్న అతడిని లాక్కు వచ్చాను. అయితే, మహిళా బ్లాగర్లు వస్తారని నా మితృలందరికీ చెప్పాను, రమ్మన్నాను అని శ్రీధర్ తో అనగానే, నేను అందుకు రాలేదు యాద్ధ్రుచ్చికంగా వచ్చాను అని సోముడు ఉడుక్కున్నాడు. అతని సున్నిత మనస్తత్వం తెలుసు కాబట్టి కాస్త ఏడిపించి వదిలేశా. నాతో కాస్త పరిచయమున్న బ్లాగర్లందరూ అందరినీ కొద్ది కొద్దిగా ఏడిపించి తమాషా చూసే నా స్వభావాన్ని ఈపాటికే అర్ధం చేసుకునివుంటారు.

అయితే, మా దుకాణం దగ్గరకు వెళ్ళగానే నాకు పుస్తకాలమ్మాలన్న కోరిక నశించింది. మళ్ళీ తెలంగాణా, కమ్మ, ఆధ్యాత్మిక, ప్రాక్టికల్ సైకాలజీ లకు ఇంకో ముసలాయన అయిన్స్టీన్ మీద ఏదో రాశాడు, ఆయన తోడయ్యాడు. వాళ్ళు టేబిళ్ళను కూడా ఎలా జరిపేరంటే, వచ్చిన వారికి కేవలం తెలంగాణా, కమ్మ పుస్తకాలే కనిపిస్తాయి. మా పుస్తకాలను కూడా మీరే అమ్మంది అని తెలంగాణా అయనతో అన్నాను. దానికి ఆయన నా పుస్తకాలే ఏమవుతున్నాయో నాకు తెలియదు అన్నాడు. విస్తుపోయా. ఎందుకంటే, ఆయన్ లేని సమయంలో ఆయన్ పుస్తకాలను అమ్మి అణాపైసలతో సహా లెక్కకట్టి ఇచ్చాను నేను. అయితే ఇక్కడ మరో సంఘటన జరిగింది.

ఆయన నాదెండ్ల భాస్కర రావు జీవిత చరిత్రను ఎవరో ఇస్తే చదివేడట. అది అతని ప్రచురణకాదు. కానీ దాన్ని అమ్మకానికి పెట్టాడు. అదేమిటని అడిగా. చదివేశాను. ఇంక నాకీ పుస్తకం అవసరం లేదు. అమ్మితే, ఎన్ని డబ్బులొచ్చినా లాభమే అన్నాడు. నేను ఆస్చర్యం నుంచి తేరుకోనేలేదు, ఒక మాజీ ఎమ్మెల్లే వచ్చి ఆపుస్తకాన్ని అడిగాడు. 200/- ఆ పుస్తకం. దాన్ని 190/- నుంచి బేరమాడి, 150/- కి అమ్మాడు. ఇదే పనిగా, అంతవరకు, 20/- వున్న ఒక పుస్తకం వెల తుడిపి 35/- చేసి 10 శాతం తగ్గించి అమ్ముతున్నాదు.

యే నహీ హై యే నహీహై జిందగీ, యే నహీ
ముఝ్ కొ యే నరక్ న చాహియే, ముఝ్ కొ ఫూల్ ముఝ్ కొ చీజ్, ముఝ్కొ ప్రీత్ చాహియే ముఝ్కొ చాహియే బహార్

అనిపాడుకుంటూ పరుగున బయటకు వచ్చాను.

వార్త ఆదివారం ఇంచార్జ్ గుడిపాటి వచ్చాడు. అతడిని ఈ తెలుగు వారికి పరిచయం చేశా. అతనితో తిరిగా. ఆతరువాత మా ఆఫీసు స్నేహితులు వస్తే వారినీ ఈతెలుగుకు పరిచయం చేశా. ఏరీ ఆడవాళ్ళు? అని వాళ్ళాని మోసం చేసి పుస్తకాల ప్రదర్శనకు రప్పించినట్టు చూశారు భార్యలతో సహా వచ్చిన నా కోలీగులు.

ఇంతలో మనసులోమాట సుజాత గారు వచ్చారని సోముదు చెప్పాడు. వెంటనే పెన్ను తీసి పట్తుకున్నా. ఎక్కడా కనబడలేదు సుజాత గారు. వారు వస్తే నేను మా దుకాణంలో వున్నానై చెప్పమని శ్రీధర్ కి చెప్పి మా దుకాణంలో కూచున్నా.కానీ, మళ్ళీ అక్కడ కూచుంటే నాకు యేదున్యా, యే మహఫిల్ మెరే కాంకీ నహీ అని బిగ్గరగా పడుతూ పరుగెత్తాలనిపించింది.

యె మహెలో యె తఖ్తో యె తాజోంకి దునియా అని జుట్టు పీక్కుంతూ, యె దునియా జహా ఆద్మీ కుచ్ నహీహై, వఫా కుచ్ నహీ, ఒదోస్తీ కుచ్ నహీ హై అని అరుస్తూ జలాదో జలాదో జలాదో అని గొంతు చించుకోవాలనిపించింది.

వెంటనే నేను తెచ్చిన పుస్తకాలు తీసుకున్నా. అసిధార కొద్ది కాపీలే వున్నాయి. ఈ రోజు ఒక్క కాపీ అమ్మలేదు కానీ నేను తెచ్చిన 5 కాపీలు మాయమయ్యాయి. దాంతో మిగిలిన పుస్తకాలు తీసుకుని వచ్చేస్తూంటే, చదువరి గారు కలిశారు. వారికి ఒక నవల కథ వినిపించాను. వారి సతీమణి వరూధిని గారు అసిధార కొనాలనుకుంతున్నారని చెప్పారు. వారు ఒకతి కొనాలనుకుంటే నేను రెండు అంటగట్టా. ఇంతలో ఇవాళ్ళ నేను ఎదురుచూస్తున్న ఆక్షణం రానే వచ్చింది. మనసులో మాట సుజాత గారు కనిపించారు!

నాకు ఆనందం ఆగలేదు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అనుకుంటూ నా జీవితంలో తొలి ఆటోగ్రాఫ్ ఇచ్చేందుకు ఉత్సాహంగా ముందుకు దూకుతూ గొప్ప చిత్రలేఖనం గీయబోతున్న మైకెలాంజిలోలా పెన్ను పట్టుకుని ఏదీ పుస్తకం? అని అదిగా.

ఇంట్లో మరచిపోయానన్నారు సుజాత గారు.

ఇంతేలే రచయితల బ్రతుకులు, అవి ఏనాడూ బాగు పడని రాతలూ అనుకుంటూంటే, నా మీద జాలిపడి కాబోలు, జీవితం-జాతకం తీసుకుంటా సంతకం పెట్టండి అన్నారు సుజాత గారు.

అప్పటికే వరూధిని గారు కొన్న అసిధార పుస్తకం పై సంతకం పెట్టిన వూపులో జీవితం-జాతకం కూడా వారి పేర రాసేసాను. దాంతో వారికి దాన్నె కొనక తప్పలేదు. ఆతరువాత సుజాత గారి పుస్తకాంపైన కూడా సంతకించాను.సోముడు మనీప్లాంట్ కూడా సంతకంతో ఇచ్చాడు. దాంతో ఒకేసారయినా మేమిద్దరమూ ఆటోగ్రాఫ్ లిచ్చే రచయితల జాబితాలో మా పేర్లు చేర్చేసుకున్నాము. మాకీ అవకాశం ఇచ్చి గౌరవించిన వరూధిని గారికీ, సుజాత గారికీ బహు కృతఙ్నతలు.

ఇంతలో మహిళా బ్లాగర్ల సందడి ప్రారంభమయింది. వెళ్ళిపోదామనుకుంటూ జ్యోతి గారేరి? అని అడిగా. నా పక్కనే ఒక కెమేరాను పట్టుకుని అర్జునుడి ఏకాగ్రతతో ఫోటో తీస్తున్న జ్యోతి గారిని చూపారు.

నమస్కారాలు అన్నాను.

ఒక నిముషం అన్నారు ఏకాగ్రత చెడకుండా

నమస్కారాలు అన్నాను. వారు ప్రతి నమస్కారం చేసేవరకూ నమస్కారాలు అంటూనే వున్నాను.

ఆతరువాత వారింతికి నన్ను నేనే ఆహ్వానించుకున్నాను. వారి వంటల రుచి చూడాలనే జీచా(జిహ్వ చాపల్యం)తో. పనిలో పనిగా పక్కనే వున్న మహేష్ కుమార్ ను కూడా ఆహ్వానించాను. జ్యోతి గారిచ్చిన స్వీట్లు తింటూ బయటపడ్డాను.

ఇదీ ఈసారి పుస్తక ప్రదర్శనలో నేను పుస్తకాలమ్మటమనే ప్రహసనము జరిగిన విధానము. జరిగినదంతా జరిగినట్టు చెప్పాను. పుస్తకాలు కొని ప్రత్సహించిన బ్లాగ్మిత్రులందరికీ మళ్ళీ మళ్ళేఎ ధన్యవాదాలు. మీరు పుస్తకాలను చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తపరచాలని నా సవినయ మనవి.

జనవరి ఒకటవ తేదీ నుంచి విజయవాడలో ఇంకో పుస్తక ప్రదర్శన మొదలవుతుంది. దాన్లో నావి రెండు పుఇస్తకాలు విడుదలవుతాయి. అక్శరాంజలి అని ఆంధ్రభూమి వార పత్రికలో నేను చేసిన 50 పుస్తక పరిచయాల సంకలనం, వార్తలో ఆదివారాలు నేను రాసిన రియల్ స్టోరీలు 50, స్ఫూర్తినిచ్చే వాస్తవ విజయ గాధలు, విడుదలవుతాయి. తేదీ నిర్ణయం కాగానే చెప్తాను. ఆ విడుదల సందర్భంగా విజయవాడ వస్తున్నాను.

అక్షరాంజలి 280 పేజీల పుస్తకం. రియల్ స్టోరీలు 300 పేజీల పుస్తకం. రెండు పుస్తకాల ధర చెరో 125/- వీటిని ఎమెస్కోవారు ప్రచురించారు.

Enter Your Mail Address

December 25, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

No Responses

 1. సుజాత - December 25, 2008

  మురళీ కృష్ణ గారు,
  నేను ఇంట్లో మర్చిపోలేదండి వాటిని, కార్లో మర్చిపోయాను. తీసుకున్నాననే అనుకున్నాను గానీ స్టాల్ దగ్గరికి వచ్చి చూసుకుంటే నా చేతిలో ఉన్న కవర్లో మంచి నీళ్ళ బాటిల్ మాత్రమే ఉంది. మళ్ళీ పార్కింగ్ లో కెళ్ళే ధైర్యం చేయలేకపోయాను. ఎలాగైనా ఆ రెండు పుస్తకాల మీద కూడా మీ సంతకం తీసుకుంటాను చూడండి.!

  నాకు రచయితలంటే బహు గౌరవం. నేను జీవితం – జాతకం మొదటి రోజు కొనకపోవడానికి కారణం అదే! ఎలాగూ మళ్ళీ వస్తానని తెలుసు..అప్పుడైనా మీ చేతిమీదుగా తీసుకోవాలనే!

 2. jyothi - December 26, 2008

  మురళీకృష్ణగారు,
  భలేవారండి. అందరిని లేడీస్ వస్తారని పట్టుకొస్తారా?? … అదేదో సినిమాలో చెప్పినట్టు వెంటబడి మరీ నమస్కారం పెట్టారు కదండి.. హా. హా.. హా…

 3. aswinisri - December 27, 2008

  హి హి హి!
  మేము మీ పుస్తకాలు ఉత్తినే చదువుతాముగా,కానీ ఖర్చు చేయకుండా!

 4. srichat - December 27, 2008

  కస్తూరీజీ,

  శ్రీచాత్ బ్లాగ్ మొదలయింది!

  బుక్ ఫెయిర్కి బుక్ అయి వారం రోజులుగా కాళ్లు వాచి యున్నాయి!

  తొలి రోజు ఎవరి సినిమాకో షూటింగు అవుతుంటే జనం వచ్చారు. ఈ బుక్ ఫెయిర్ వాళ్లే షూటింగు ఏర్పాటు చేసారని అనుకున్నాను!

  ప్రపంచ క్రికెట్ కప్పులో చియర్ గర్ల్సును ఏర్పాటు చేసినట్లు ఇక్కడ కూడా అలా ఏర్పాటు చేసి గంతులు వేయిస్తే ఎలా ఉండేదో అనిపించింది.

  పుస్తకాలలో జీవించేవారు రెండు అట్టల మధ్యనా, అట్టడుగునా నలిగిపోవటం సహజం. మన పుస్తకాలు అటూ ఇటూ ఇద్దరి హడావుడి మధ్య కూడా నలిగిపోవటం చూశాము. అయినప్పటికీ బాగానే స్పందన లభించింది!

  శలవు…శ్రీపతి

 5. srichat - December 28, 2008

  నేను వ్రాయబోతున్న అంశములు:

  1. వార్తాలాపం-గత వారంలోని ఒక వార్త మీద విశ్లేషణ
  2. వారఫలాలు: రాశి ఫలాలు
  3. నిత్య యౌవ్వనం: ఒక పాత పుస్తకం, ఒక కొత్త పుస్తకం మీద వ్యాసములు
  4. నవీనం:ఒక పాత చలనచిత్రం, ఒక కొత్త చలనచిత్రం మీద వ్యాసం
  5. ఇంకా ఎన్నో…

Leave a Reply