తెలుగు స్టాలు ఫలితం ఈ-మూడు బ్లాగులు.

పుస్తక ప్రదర్శనలో ఈతెలుగు స్టాలు గురించి ఎవరో ఒక తమాష అయిన వ్యాఖ్య రాశారు. వారి సెన్సాఫ్ హ్యూమరుకు ఆనందం కలిగింది.

అయితే, వారు ఈస్టాలు నిర్వహణను ఎంతగా వ్యంగ్యం చేసినప్పటికీ నేను గత సంవత్సరంగా సాధించలేనిది ఈ స్టాలులో మన బ్లాగర్ల వల్ల సాధ్యమయింది.

అది నా మిత్రుదు శ్రీపతి శర్మ, అతని భార్య సత్యవతి, నా భార్య పద్మ లు తమ తమ బ్లాగులను ఆరంభించటం!

నేనెప్పటినుంచో బ్లాగమని వీరి వెంటపడుతూన్నాను. నా మాటలు నవ్వుతూకొట్టేసేవారు. తరువాత చూద్దాం లే అనేవారు.ఇప్పుడొద్దులే అనేవారు. మేమేమి రాస్తాం అనేవారు.

కానీ, మన బ్లాగరులంతా కలవటం, కలసి ఆనందించటం చ్చొసినతరువాత వీరు నా ప్రమేయం లేకుండా, బ్లాగులను ఆరంభించేశారు.

శ్రీపతి శర్మ బ్లాగు www.sreekaram.wordpress.com. అతని భార్య బ్లాగు www.himakusumaalu.wordpress.com

పద్మ బ్లాగు, www.sripadmakasturi.wordpress.com.

ఈ మూడు బ్లాగులను, బ్లాగరులను మన బ్లాగ్ప్రపంచానికి ఆహ్వానించి, ఆదరించి, సలహాలతో సూచనలతో ప్రోత్సహించవలసిందిగా నా ప్రార్ధన.

హేళన ఊపుగా, వెక్కిరింత ఊతేజంగా, వ్యతిరేకత ప్రేరణగా మన బ్లాగ్ప్రపంచం మరింత విస్తృతమవ్వాలని కోర్కుంటున్నాను.

ఈ మూడు బ్లాగులను అందరూ సందర్శించి, ఆహ్వానించి, ఆదరించగలరని ఆసిస్తున్నాను.

Enter Your Mail Address

December 30, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

No Responses

 1. Sarath - December 30, 2008

  మీ శ్రీమతి ఓ బ్లాగు మొదలెట్టారు – మా శ్రీమతి బ్లాగులు చూడటం మొదలెట్టింది.

 2. కొత్తపాళీ - December 30, 2008

  చాలా సంతోషం. అభినందనలు.
  ఇంతకీ ఆ చమత్కార వ్యంగ్య వ్యాఖ్య ఏమిటి? ఎక్కడ రాశారు?

 3. నల్లమోతు శ్రీధర్ - December 30, 2008

  మీ సహధర్మచారిణి, మీ మిత్రులు, అతని భార్యలకు సాదరంగా బ్లాగు ప్రపంచానికి ఆహ్వానం. మన కుటుంబం పెరుగుతోందంటే సంతోషమేగా.

 4. durgeswara - December 30, 2008

  శుభయాత్ర కు శ్రీకారం చుట్టిన కొత్తబ్లాగర్లకు మా అభినందనలు తెలియజేయండి

 5. చిలమకూరు విజయమోహన్ - December 30, 2008

  ఇక మీ కంప్యూటర్లకు విశ్రాంతి దొరకదన్నమాట.

 6. Sujata - December 30, 2008

  Ok. inka mee illu prasantam gaa vuntundi. :D New Year lo new computer koni pettandi padma gariki mari.

 7. కె.మహేష్ కుమార్ - December 30, 2008

  “హేళన ఊపుగా, వెక్కిరింత ఊతేజంగా, వ్యతిరేకత ప్రేరణగా మన బ్లాగ్ప్రపంచం మరింత విస్తృతమవ్వాలని కోర్కుంటున్నాను. “..ఈ ఆశీర్వచనం భలే వుందే!

 8. NNMuralidhar - December 30, 2008

  ఒక తమాష అయిన వ్యాఖ్య రాశారు అది ఏంటి ఎక్కడ వ్రాసారు?

 9. నెటిజన్ - December 31, 2008

  ఒక చిన్న పొడుగింపు, హేళన ఊపుగా, వెక్కిరింత ఉత్తేజంగా, వ్య్తతిరేకత ప్రేరణగా, విమర్శ ని సద్విమర్శగా మన బ్లాగ్ ప్రపంచం మరింత విస్తృతంగా, విస్తారంగా వ్యాప్తి చెందుతూ, ఫరిడవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..”

  మీకూ, మీ కుటుంబ సభ్యులకు,
  మీ బ్లాగ్మిత్ర దంపతులకు,
  నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  http://etelugu.org/typing-telugu
  netijen.blogspot.com

 10. lalitha - December 31, 2008

  ఠాగుర్ సినిమా లో చిరంజీవి ఆశయం లా (ఒకరు ముగ్గురికి సాయం చేసి ఆ ముగ్గురూ మరో ముగ్గురికి సాయం చెయ్యమనం డి అని ) మీ వంతుగా మూడు కొత్త బ్లాగులు మొదలు పెట్టించారన్నమాట .ఆముగ్గూరూ మరో తొమ్మిది ….అలా…అలా….అలా

 11. రవి - December 31, 2008

  మీ శ్రీమతి గారికి, మీ మిత్రులు Mr & Mrs శర్మ గారికీనూ, బ్లాగ్లోకపు స్వాగతం.

Leave a Reply