శ్రీ విశ్వనాథ సత్యనారాయణ-ఒక పరిచయము.

నిజానికి విశ్వనాథ వారి సాహిత్యాన్ని పరిచయమ్ చేస్తూ సీరీస్ గా రాయాలని అనుకున్నాను. కానీ ఈలోగా ఇటీవలె ఒక బ్లాగులొ ఆయన గురించిన ఒక సమీక్శ చదివిన తరువాత ముందు అడుగు వేస్తే మంచిదనిపించింది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే దెబ్బ వేయాలి. చర్చలు వాడిగా వున్నప్పుడే వాదించాలి.

విశ్వనాథ వారిని విమర్శించటం చాలా సులభమ్. అందుకోసమ్ కొత్త పదజాలాన్ని వెతకనవసరంలేదు. కొత్తగా పరిశొధనలు చేయనవసరం లేదు. ఆయనను విమర్శించటమ్వల్ల లాభాలే తప్ప నశ్టాలేవే లేవు. ఆధునిక వాదిగా గుర్తింపు పొందవచ్చు. అభ్యుదయవాదిగా, కుల, మత, వర్గ, వర్ణ సంకుచిత భావాలు లేని విశాలహ్రు్దయుడిగా అందరినీ నమ్మించవచ్చు. ఆయనను దూశించటమ్వల్ల మన లోపాలను, పాపాలను కప్పిపుచ్చుకోవచ్చు.

అందుకే తెలుగు భాశ రానివారయినా సరే, తెలుగు గురించి ఏమీ తెలియనివారయినా సరే, ఎంత సంకుచిత భావాలకు దాసులయిన వారయినా సరే విశ్వనాథ వారిని తిడితే వారి పాపాలన్ని పోయి పుణ్యాత్ములయిపోతారు. సర్వ జనామోదాన్ని పొందుతారు.

అయినా సరే విశ్వనాథ వారి సాహిత్యాన్ని చదివినవారు ఆయనని అభిమానిస్తారు. ఆయనను ఆరాధిస్తారు. ఎన్ని అడ్డంకులను, ప్రతికూలతలను ఎదుర్కొంటూ కూడా ఆయనను సమర్ధిస్తారు.

ఆయనను చాలా మంది పండితుడని కొట్టేస్తారు. బూజు పట్టిన పాత భావాలను అనుసరిస్తాడని ఈసడిస్తారు. కఠిన గ్రాంథికమ్ రాస్తారని. ఎవారికీ అర్ధంకాని రాతలు రాస్తాడని వెక్కిరిస్తారు. ఒకటొ, రెండో ఆయన రచనలు చదివిన వారు అన్నీ చదివేసినట్టు, ఇక చదవాల్సినవేవీ లెఅనట్టు మాట్లాడతారు.

కానీ, ఆయన వల్ల ప్రెఅరణ పొందిన వారు మాత్రమ్ ఆయనను గురుతుల్యునిగా భావించి పూజిస్తారు. ఆయన బాట అనితరసాధ్యమ్ అని తెలిసినా ఆ బాటలో తప్పటడుగులు వేయాలని ప్రయత్నిస్తారు. ఆ తప్పటడుగులవల్ల వారి ప్రతిభకు మించిన గుర్తింపు పోందుతారు. అలాంటి వారిలో నేనూ ఒకడిని. అందుకే పనికట్టుకుని ఆయనను పరిచయమ్ చెఅస్తున్నాను.

అందరూ ప్రయాణించే దారిలో ప్రయాణం చాలా సులభం. కొత్తదారి కనుక్కోవటం చాలా కశ్టమ్. కానీ, పాత దారిలో ప్రయాణిస్తూ, ఆ దారిని కొత్త పుంతలు తొక్కించటం సామాన్యులకు సాధ్యమ్ కాదు. అలాంటి అసామాన్యుడు విశ్వనాథ.

ఆయన ఎవరికీ అర్ధం కాని భాశలో రాస్తాడనే వారు విశ్వనాథ వారిని చదవలేదు.

విశ్వనాథ వారి సాహిత్యాన్ని చదివితే, ఏకవీర నాటి, ఆయన తెలుగుకూ, నందిగ్రామ రాజ్యమ్ నాటి తెలుగుకూ ఎంతొ తేడా కనిపిస్తుంది. పురాణ వైర గ్రన్థమాల తెలుగుకూ, పులుల సత్యాగ్రహం తెలుగుకూ తెఅడా వుంటుంది. రాజతరంగిణి తెలుగుకూ, విశ్ణు శర్మ ఇంగ్లీశు చదువుకూ తెఅడా వుంటుంది. వరలక్శ్మి త్రిశతి తెలుగుకూ కిన్నెరసాని తెలుగుకూ తెఅడా వుంటున్ది. ఆయన్ మధ్యాక్కరలకూ, కల్ప వ్రుక్శానికి తెడా వుంటుంది. జేబు దొంగలు నవలకూ, దమయంతీ స్వయంవరానికీ, చెలియలికట్టకూ తెఅడా వుంటుంది. అంటే, వీళ్ళంటున్నట్టు, ఆయన ఎదుగుదల, కదలిక లేని, మురుకిగుంట కాదు, నిరంతరమ్ ప్రవహిస్తూ, పరిణామశీలి అయిన అనంత జల ప్రవాహం. ఇది తెలుసుకోకుండా, తెలుసుకున్నా, నిజం చెప్తె, ఎక్కడ తమ నైచ్యం బయట పడుతుందో నన్న భయమ్తో, ఈనాటికి కూడా ఆయనను అవే విమర్శలతో, అదే రకంగా దూశిస్తూనె వున్నారు. ఇది గమనిస్తేనే, ఆయన గొప్పతనమ్ తెలుసుకోవచ్చు. ఒక వ్యక్త్యి మరణించి ఇన్నేళ్ళయిన తరువాత కూడా, పేరు చెప్తేనే ఉలిక్కిపడే వారింత మంది వున్నారంటే ఇక ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఇది ఆరంభం మాత్రమే. ఇక వీలు వెంబడి విశ్వనాథ వారి రచనలను పరిచయం చెఅస్తాను.

ఆయనను కుల తత్వ వాది అనేవారెందరో అనేక సందర్భాలలో ఇతర కులాల పైన ద్వెఅశాన్ని, తక్కువ కులాలవారి పైన చులకనను, స్వకులం వారి పైన ప్రేమను బహిరంగంగా చూపారు. అయితే, విశ్వనాథ వైపు వేలు చూపించి, ద్రుశ్టిని తమ వైపు నుంచి మళ్ళించుకున్నారు.

మన దేశం లో కుల భావనకు అతీతంగా ఎవ్వరూ లేరు. కానీ, అందరో విశ్వనాథ వారి వల్ల తమ నేరాన్ని కప్పిపుచ్చుకోగలుగుతున్నారు. చివరికి, జాశువా కూడా, మతం మారినా కులం మారలేదని వాపోయాడు. క్రీస్తును ఆశ్రయించినా, మాలా క్రీస్తు వేరు, మాదిగ క్రీస్తు వేరు అని ఖండికలు రాసి, వేదనను వెళ్ళ గ్రక్కుకున్నాడు.

కాబట్టి, విశ్వనాథను తిట్టటం మాని ఆయన సాహిత్యం గురించి. తెలుసుకుని, చదివి ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఆదిశగా, ప్రోత్సహించేందుకు, నేను, నా వ్యాసాల ద్వారా, ఆయన రచనల పరిచయాల ద్వారా నా వంతు ప్రయత్నాలు చేస్తాను. అందుకు ఇది నాందీ ప్రస్తావన మాత్రమే!

Enter Your Mail Address

January 5, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

No Responses

 1. అభిమాని - January 5, 2009

  తప్పొప్పుల పట్టిక
  తప్పు ఒప్పు
  ——— ————–
  నశ్టాలేవే నష్టాలేవీ
  విశాలహ్రు్దయుడిగా విశాలహృదయుడుగా
  దూశించటమ్వల్ల దూషింటం వల్ల
  లెఅనట్టు లేనట్టు
  ప్రెఅరణ ప్రేరణ
  చెఅస్తున్నాను చేస్తున్నాను
  కశ్టమ్ కష్టం
  గ్రన్థమాల గ్రంధమాల
  తెఅడా తేడా
  విశ్ణు శర్మ ఇంగ్లీశు చదువు విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు
  ద్వెఅశాన్ని ద్వేషాన్ని
  ద్రుశ్టిని దృష్టిని

 2. R Vemuri - January 5, 2009

  మంచి విషయమే ప్రస్తావించేరు కాని విశేషంగా అచ్చుతప్పులు దొర్లాయి. లేఖిని లాంటి ఉపకరణం వాడితే ఎప్పటికప్పుడు రుజువు చూసుకోవచ్చుకదా. రచనాంశం ఎంత బాగున్నా పంటికింద రాయిలా తప్పులు తగులుతూ ఉంటే మీకృషి ఫలించదు.
  -వేమూరి వేంకటేశ్వరరావు

 3. bezawa - January 5, 2009

  మీ అభిప్రాయంతొ నేనూ ఏకీభవిస్తాను. విశ్వనాధ వారి రచనలు నేను చదవక పొయినా , ఆయన రచనలు చదివి, ఆకళింపు చేసుకొని, వారిని గురుతుల్యులు గా భావించే వారిని నేనెరుగుదును.

  (ఈ వ్యాసం లో చాలా అచ్చుతప్పులు ఉన్నాయి. దయచెసి వాటిని సవరించగలరు.)

 4. kasturimuralikrishna - January 5, 2009

  అచ్చుతప్పులకు క్షమించండి. నేను లేఖినికి అలవాటుపడుతున్న సమయం లో నా దృష్టి బరాహా వైపు మళ్ళింది. అది అలవాటు ఇంకా కాక పోవటం తో రాత వరాహమై పోయింది. వానరమయి చెట్టెక్కింది. అందుకే మళ్ళీ లేఖినికి పార్టీ మార్చేస్తున్నాను. కనీసం రాయబోయే టపాలలోనయినా వీలయినన్ను అచ్చుతప్పులను తగ్గించుకుంటాను. ధన్యవాదాలు.

 5. కె.మహేష్ కుమార్ - January 6, 2009

  పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. కాకపోతే ఒక్క విషయం, గొప్పవాళ్ళ “గొప్పతనాన్ని” ప్రశ్నించకపోతే వాళ్ళ గొప్పతనం మరుగున పడిపోతుంది. అందుకే సద్విమర్శలతోపాటూ కువిమర్శలూ కావాలి. అభినందనలతొపాటూ ఖండనలూ రావాలి.

 6. gaddeswarup - January 6, 2009

  There seem to be some hints fromViswanatha himself how to judge him:
  “Mine is the language people use.
  My style
  is deep. I aim at delight and meaning.
  To create delight, you have to
  know the world.
  There’s no poetry without the
  world.”
  From a tranlation by Velcheru Narayana Rao in “Hibiscus on the Lake”.

 7. సుధాన్షు - January 6, 2009

  “సద్విమర్శలతోపాటూ కువిమర్శలూ కావాలి. అభినందనలతొపాటూ ఖండనలూ రావాలి”

  గొప్పతనం ను ప్రశ్నించడానికి కువిమర్శలు కావాలా? దీని భావమేమి తిరుమలేశ? ఇలాంటివాళ్ళు కూడా ఇంకా ఉన్నారా అని అనిపిస్తోంది.

 8. కె.మహేష్ కుమార్ - January 7, 2009

  @సుధాన్షు: ఒక బ్లాగులో కువిమర్శ లేకుంటే, కస్తూరి వారు ఇంత శ్రమకోర్చి ఈ వ్యాసాలు రాసేవారు కాదని గమనించండి.

 9. నెటిజన్ - January 7, 2009

  ఏకవీరడు
  ———-
  శ్రీమాన్ విశ్వనాథ సత్యనారాయణ
  గారి శ్రీమద్రామయణ
  కావ్యం రోజూ పారాయణ
  చేసేవ్ళ్ళేవరూ లేరా యన
  ఉన్నానని ఒకడేనా అంటే సంతోషిస్తారయన.

  – శ్రీస్కీ

 10. నెటిజన్ - January 7, 2009

  పై చేతికి క్రింది చేయి ఎప్పుడు లోకువే లాగున, రాసే బ్లాగర్‌కి వ్యాఖ్యానించే వాడు ఎప్పుడూ లోకువేనా!
  మాస్టారు, ఈ అప్పుతచ్చులు మా వల్ల కాదు మహాప్రభో, ఎన్ని సార్లు, ఎన్ని మార్లూ, ఎన్ని తూర్లు, మీకు చదువరులు విజ్ఞప్తులు చేసుకున్నారు, మహాశయా!
  ఇక సాకులు మానివేయండి!
  లేకపోతే ఇటు రావడమే మానుకోవలసి వస్తుంది. ఆ.
  ఐనా మీ ముద్రిత గ్రంధాలలో కూడ ఇలాగున ముద్రారాక్షాసాలను విరివిగా వాడుతున్నారా?

 11. bollojubaba - January 7, 2009

  పై నెటిజన్ గారి వాఖ్య చూసాకా ఇది గుర్తుకొచ్చింది.
  సరదాగానే
  ఎప్పుడు ఎవరు వేసినా తెలుగు పుస్తకాల్లో అచ్చుతప్పులు తప్పకుండా ఉండాలనే శాపమూ, శాసనమూ ఏవన్నా ఉన్నాయేమో! ——- స్మైల్. (ఈమధ్యనే గతించిన తెలుగు కవి)

 12. Sudhanshu - January 7, 2009

  “ఒక బ్లాగులో కువిమర్శ లేకుంటే, కస్తూరి వారు ఇంత శ్రమకోర్చి ఈ వ్యాసాలు రాసేవారు కాదని గమనించండి.”

  మీ తర్కవిచక్షణకు జేజేలు. బ్లాగులో వ్యాసాలు రాయటానికి కువిమర్శ కావాలా? ఇన్నాళ్ళూ కత్తి కత్తి అని అందరూ మాట్లాడుతుంటే ఏవరో అనుకున్నా… ప్రత్యక్షంగా చూసాను మహాప్రభో! తెలుగు బ్లాగులను జీసస్ రక్షించు గాక! ఆమెన్

 13. rayraj - February 2, 2009

  Off the topic:
  నాకు బరాహా యే నచ్చింది. బరాహా ime పెట్టుకొని ఎక్కడపడితే అక్కడ తెలుగులో టైపు చేసేసుకోవచ్చు.(కాపీ పేశ్ట్ చెయ్యక్కర్లేదు. పైగా రాత ఎక్కవైన కొద్దీ, అందులో నావిగేషన్ కష్టం.)

  సులువుగా ఉంటుంది. ఓ మెమరీ స్టిక్ లో బరాహా ఉంచుకు తిరగటం బెటరేమో!

  మీరు ప్రింట్ మీడియా కాబట్టి, మీకు వేరే కీబోర్డు వాడే అలావాటేమో! ఆ కీబోర్డ్ తో యూనికోడ్ వచ్చే మార్గమేమయినా దొరికితే చెప్పండి.

  విశ్వనాథగారివే చాలా ఉంటాయి గాబట్టి, వర్గీకరణలో అయన పేరుతో ప్రత్యేకంగా ఒకటి పెడితే, నా లాంటి వాళ్ళు సీదా (డైరెక్టుగా ) దానికి వెళ్ళి చదువుకుంటారు.

  (ఇంతకీ డైరెక్టుగా అనటానికి అసలు తెలుగు పదమేమిటబ్బా!?!? :? )

 14. kusumakumaru - March 3, 2009

  *nEnU viSvanaatha gari rachana aBimaanini.
  CaMdO badhdhaMgaa raayaDa manaku ,chEta kaadu, kaabaTTi aayana (VAmtI MAHAA PAmdITULA) goppa tanaanni oppukOvaali.
  paaMDiTIprakarshanu gauraviMchaDamuu ” aMTE ‘mana saMkRtI,vij~naanaalanu manamu gauraviMchukOvaDamE!

Leave a Reply