ప్రొఫెసర్ వీరభద్రప్ప భగవద్గీత- సమీక్ష!

లోపభూయిష్టమయిన దృష్టితో ప్రపంచాన్ని చూస్తూ, తన దృష్టి లోపాలను ప్రపంచానికి ఆపాదిస్తాడు మనిషి. అలాంటి లోపభూయిష్టమయిన దృష్టితో భగవద్గీతను చూస్తూ, తమ మెదళ్ళలోని లోపాలను హైందవ ధర్మానికి ఆపాదించిన కువిమర్శక పరిశీలన గ్రంథం కన్నడంలో ప్రొఫెసర్ వీర భద్రప్ప రచించిన భగవధీత. దాన్ని తెలుగులోకి అనువదించి అందించారు వల్లంపాటి వెంకట సుబ్బయ్య, వివినమూర్తి.

ఆరంభంలోనే రచయిత భారతీయ తాత్విక సాంప్రదాయాన్ని తనదైన దృష్టితో పరిచయం చేస్తాడు. భారతీయ ధర్మం సర్వం ప్రతీకల మయం. పదాలు పైకి ఒక అర్ధాన్నిస్తాయి. తమలో వేరే అర్ధాన్ని దాచుకుంటాయి. చూసేవారు తమ దృష్టినిబట్టి అర్ధాన్నివ్వగలుగుతారు. అందుకే పైపై అర్ధాలను చూసి విశ్లేషిస్తే వికృతమయిన అపార్ధాలు జనిస్తాయి. అందుకే రంధ్రాణ్వేషణ దృష్టితో చూసేవారికి అనంత నిధులు భారతీయ తాత్విక గ్రంథాలు. మొదటి వాక్యం నుంచీ రచయిత భారతీయ ధర్మాన్ని తక్కువ చేయటమనే లక్ష్యంతోనే రచన ఆరంభించారని స్పష్టమవుతుంది.

ఇలాంటి దృష్టితో మొత్తం భారతీయ చరిత్రను కులం దృష్టితో( అర్జునుడు, కృష్ణుడూ క్షత్రియులు, బ్రాహ్మణులు బౌద్ధాన్ని దెబ్బతీయటానికి పన్నిన కుట్ర లాంటివి), సంకుచిత మనస్సుతో చూసి దానికి సవిమర్శక పరిశీలన అని పేరు పెట్టటంలోనే రచయిత ఉద్దేశ్యం అర్ధమవుతుంది. ఆయన భగవద్గీతను ఎలా పరిశీలిస్తాడో తెలిసిపోతుంది. పుస్తకం మొత్తం శ్రీకృష్ణుడిని, వైదిక ధర్మాన్ని, వైదిక సిద్ధాంతాలనూ దూషించటం, అపహాస్యం చేయటం, బ్రాహ్మణులను క్రూరులుగా, కర్కోటకులుగా చూపటం కనిపిస్తుంది. ఏదో గొప్ప విశాల భావాలను ప్రదర్శిస్తున్నట్టు ప్రకటించుకుంటూ కళ్ళకు సంకుచిత రంగుటద్దాలను బిగించుకుని, మనస్సులలో కులాల సంకుచితాలను నింపుకుని, సమస్త భారత జాతి గర్వించదగ్గ ఉన్నత భావాలపై బురదజల్లి, తమ ఉద్దేశాలను వాటికి ఆపాదించి సమాజం సిగ్గిలి, న్యూనతా భావంతో మగ్గేట్టు చేయాలన్న ఆశ ఈ పుస్తకం ప్రతి అక్షరంలో ఉట్టిపడుతూంటుంది. అయితే ఇలాంటి దూషణలెన్ని చేసినా, బురద ఎంతగా చల్లినా, భారతీయ ధర్మం మరింతగా అభివృద్ధి చెందుతుంది. హిమాలయాలపై మట్టిబెడ్డ విసరటం వల్ల హిమాలయాలకు నష్టం లేదు. అందుకే హిందూ ధర్మాన్ని ఎంతగా విమర్శిస్తూంటే ప్రజలలో అంతగా భక్తి పెరుగుతోంది.

భగవద్గీత, మూలం; ప్రొ వీరభద్రప్ప. వెల; 50/- విశాలాంధ్ర ప్రచురణ.

ఇది, 12.2 2009, ఆంధ్రభూమి వార పత్రికలో నేను రాసిన సమీక్షలోని కొన్ని ప్రధాన అంశాలు.

Enter Your Mail Address

February 10, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

No Responses

 1. ప్రదీప్ - February 10, 2009

  కృష్ణుడు క్షత్రియుడా… హతవిధీ….. గోపాల కృష్ణున్ని క్షత్రియున్ని చేసారు కదా… జన్మత: క్షత్రియుడు కావచ్చు. కానీ కృష్ణుడు యాదవ బాలుడే కదా …

 2. rayraj - February 11, 2009

  డోంట్ వర్రీ మురళీ కృష్ణ గారు.

  భగవద్గీత ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి చెబ్తుంది. సర్వం తానే అయిన భగవంతుడు వారికి చూపిన విశ్వరూప పార్శ్వం అది – అని సరిపెట్టుకుందామా!

  అర్జునిడిలా! – భయముగొలిపే ఈ రూపం వద్దు. ఎప్పటిలా అందంగా, ప్రేమగా ఉన్న నా కృష్ణునిలా చాలునని చెప్పి చూసుకుందామా!

 3. independence - February 12, 2009

  ముందు నువ్వు కులపు పిచిని వదులుకో….దేవుడనే వాడు నిజంగా కులాలను స్రుస్టించాడో లేడో కూడా ఒక సారి ఆలోచించు……నువ్వు మారు తర్వాత నీతులు చెప్పు…కులం పిచి నీకు ఆయనకు కాదు…నీను కూడ గీత చదివాను ….అందులో అన్ని లోపాలు అని చెప్పను కాని దాన్ని కరెప్ట్ చేసారని మాత్రం కచితంగా చెబుతాను…చేసిన వాల్లు బ్రామ్మలు అని కూడా చెబుతాను

 4. Sri Krishna - February 12, 2009

  …have you ever read my geeta….idiot…by seeing your review I understood that you are the great a..h i have ever known….What did I say to you….chant my name….live my name…and get the “Moksha”….but what you did…you read it like a book ….you never applied what I say to you….the professior is correct…idio’…..that is what anybody gonna realize after following my geeta…..So you have no right to comment….Brahmins corrupted it…be careful….

  From,
  Sri Krishna,
  Vaikuntam,
  Srikrishna@geeta.com
  or visit http://www.krishnaisgreat.vaikuntam.universe.love.peace.krishna

Leave a Reply