నా బ్లాగుకు సెలవలు!

నా బ్లాగుకు సెలవలు వచ్చేశాయి. నేను, పద్మ సోమవారము నుంచి మళ్ళీ వచ్చే సోమవారం వరకు ఊళ్ళు తిరుగుతాము. అందుకని నా బ్లాగుకు తప్పని సరి పరిస్థితులలో సెలవులివ్వాల్సివస్తోంది.

సోమవారం రాత్రి బయలు దేరి మరుసటి రోజు హోస్పేట చేరతాము. తెలుగు తేజానికి, భారతీయ ధర్మ రక్షణకు ప్రతీక, వైరులకు మృత్యువు దరి అయిన హంపి ని దర్శించుకుంటాము. హంపీ నగరాన్ని పాడు చేయటానికి తురకల సేనలకు ఆరునెలలు పట్టింది. ఏక దీక్షగా, అదే పనిగా, పునాదులతో సహా సర్వం పెకిలించినా, గత  వైభవ చిహ్నాలనేకం ఇంకా మిగిలి వున్నాయంటేనే మన వారి గొప్పతనాన్ని అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుతం, దివ్య ధాత్రి అనే మాస పత్రిక ( ఋషి పీఠం వారిదే ఇంకో పత్రిక ఇది) లో ద్రష్ట అనే సీరియల్ రాస్తున్నాను. మధ్య యుగంలో, మాలిక్ కాఫుర్ అనే తురకల సేనా నాయకుడు దక్షిణ భారతం పైకి దండెత్తి వచ్చాడు. దక్షిణ భారతంలో అడుగిడిన తొలి మహమ్మదీయ సైన్యాధికారి ఇతడు. మధురై వరకు గెలిచాడు. అడుగిడిన చోటల్లా మారణ హోమం సృష్టించాడు. బృహదీశ్వరాలయం పై దాడి చేశాడు. మధుర మీనాక్షి ఆలయాన్ని కొల్లగొట్టాడు. శ్రీరంగంలో అకాండ తాండవం చేశాడు. చిదంబరం మందిరాన్ని పునాదులతో సహా పెకిలించివేసాడు.( ఇప్పుదు మనము చూస్తున్న మందిరం పురర్ణిర్మాణం తరువాతది). ఆ మాలిక్ కాఫుర్ దండ యాత్ర ఫలితంగా భారతీయ మనస్తత్వంలో, సాంఘిక జీవన విధానంలో చెలరేగిన అల్లకల్లోలాన్ని, దానికి మన సమాజ ప్రతిస్పందననూ వర్ణించటం నవల ప్రధానాంశం.

హంపీ లో శిథిలాలను చూస్తూ, జరిగినది ఊహిస్తే, నా రచన మరింత శక్తివంతమవుతుందని ఆశ.

హంపీ నుంచి బయలు దేరి ఉడిపి చేరతాము. ఉడిపి కేంద్రంగా, గోకర్ణం, హోర్నెడు, మురుడేశ్వర్, మూకాంబిక, సుబర్మణ్యం, నవ బృందావనం శ్రంగేరి లను దర్శించాలని పథకం.

ఉడిపి నుంచి, మంగళూరు, అటు నుంచి బెంగళోరు వచ్చి కర్ణూలు చేరాలి. ఒకటవ తారీఖు సాయంత్రం కర్నూలు లో ఒక ఉపన్యాసం ఇవ్వాలి. ఆరోజు రాత్రి కర్నూలు లో రైలెక్కి మరుసటి రోజు తెల్లారికల్లా సికందరాబాదు చేరాలి. అదే రోజు ఆఫీసుకి వెళ్ళాలి.

ఇదీ మా పర్యటన పథకం. బ్లాగరులెవరికయినా, ఇంకా ఈ స్థలాలలో చూడదగ్గ ప్రదేశాల గురించి తెలిస్తే వివరాలందిస్తే వీలుంటే వాటిని సందర్శిస్తాము. ఈసారి కుదరకపోతే మరో సారి చూస్తాము.

మేము సాధారణంగా, మూడు నెలలకోసారి ఏదయిన ఓ చూటికి వెళ్తూంటాము. నాందేడ్ మా ఆ పర్యటనలకు భంగం కలిగించింది. ఇప్పుడు మళ్ళీ మా పర్యటనలను పునః ప్రారమభిస్తున్నాము.

అయితే, ఫిబ్రవరిలో మాత్రం తప్పనిసరిగా వెళ్తాము. దీనికి మేమిద్దరమూ పెళ్ళి అప్పుడు చేసుకున్న ఒక నిర్ణయం కారణం.

ప్రతి సంవత్సరం, మా పెళ్ళి రోజును ఇలా పర్యటనలలో గడపాలన్నది, మేము, మా మొదటి హానీమూన్ లో తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు మేము వెళ్తున్నది మా పదహారో ప్రేమ యాత్ర. ఈ వంకన, ఒక వారంపాటు, అందరికీ, అన్నిటికీ దూరంగా గడుపుతాము. బోలెడన్ని అనుభవాలు, ఙ్నాపకాలూ మూటకట్టుకుని వస్తాము.

వారం పాటు వుండను కాబట్టి, ఈ వారమే వచ్చేవారం ఇవ్వల్సిన రాతలన్నీ రాసి ఇచ్చేయాలి. నాకు, శీర్షికలకు ఒక్కవారమయినా break ఇవ్వటం నచ్చదు. break ఇస్తే ఇక ఆ శీర్షిక ఆగిపోతుంది. మళ్ళీ రాయాలనిపించదు. అందుకని, రెండు వారాలకు సరిపడ ఇచ్చివెళ్తాను. అవన్నీ రాయాలి కాబట్టి, వెళ్ళేది సోమవారమయినా ముందే సెలవులు ప్రకటించేస్తున్నాను. ఈలోగా ఏదయినా వీలయితే, బ్లాగుతాను. లేకపోతే సెలవులే!

చివరగా, పది రోజులు బ్లాగులు చూసే వీలు లేదు కాబట్టి, పదకొండో రోజు బ్లాగులు తెరిచేసరికి అన్నీ కళకళలాడుతూండాలని, ఆలోచనలతో, అనుభవాలతో, అభిప్రాయాలతో, ఆరోగ్యకరమయిన వాదనలతో, ఆనందకరమయిన అనుభూతులతో కనిపించాలని కోరుకుంటున్నాను.

సెలవు పుచ్చుకునేముందు మరోమాట, ఇది అందరికీ తెలిసినదే,  an eye for an eye makes the world blind. కాబట్టి, దెబ్బకు దెబ్బలు, పగలు ప్రతీకారాలు వీలయినంత వరకూ వదిలేద్దాం. హాయిగా, మంచి విషయాలతో బ్లాగు ప్రపంచంలో ఆలోచనల రంగవల్లులు తీర్చి దిద్దుదాము.

exercising utmost restraint under extreme provocation is the hallmark of great men అంటారు. కాబట్టి, రెచ్చగొడితే రెచ్చిపోవటం, నన్ను అన్నారు కాబట్టి నేననంటాను అన్నట్టు కాక, విద్యావంతులమూ, విచక్షణ ఉన్నవారమూగా బ్లాగ్లోకాన్ని ఉన్నతమయిన భావనల మయం చేద్దాం. సుందరమయిన అనుభూతులను కలసి పంచుకుందాం. మనమతా ఒకటి. మనకు గ్రూపులులేవు. ముఠాలు లేవు. కలసి వుండే నాలుగు ఘడియలు, వ్యంగ్యాలు, విద్వేషాలలో గడపేబదులు, అవగాహనతో, సమన్వయం సాధిస్తూ ప్రశాంతంగా గడుపుదాము. బ్లాగుని భలే అందమయిన అనుభవంలా మిగులుద్దాము.

ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః!
let noble thoughts come from all sides.

Enter Your Mail Address

February 19, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

No Responses

 1. psmlakshmi - February 19, 2009

  ఆఖరి పేరా అందమైన పేరా. అందరికీ పనికివచ్చే పేరా. పాటించటం…..అందరూ విజ్ఞులే.
  psmlakshmi
  psmlakshmi.blogspot.com

 2. sujata - February 19, 2009

  good luck. have a happy holiday.

 3. Aruna - February 19, 2009

  కుక్కుటేశ్వర స్వామి ఆలయం చిక్మంగళూరు లోనే అనుకుంటా. ఇక్కడ శ్రీకాళహస్తి లో వలే కుజ దోష నివారణ పూజలు జరుగుతాయి. ఇక ధర్మస్థళ ఇక్కడి పేరుగాంచిన పుణ్యక్షేత్రం. వీలైతే మీ పర్యటనలో దీనిని కూడా దర్శించండి.
  ఇక శృంగేరి విషయానికొస్తే, భారతీ తీర్థ స్వామీజీ కి ఈ పాటికి చాతుర్మ్యాస దీక్ష అయిపోయి వుండాలి. కాబట్టి ఇక్కడే వుంటారో వుండారో తెలియదు. స్వామి వుండేట్టైతే ఆశీర్వాదం తీస్కోండి. ఇక్కడ ఆలయ ఆఫీసులో స్వామి వారి పాద పూజకి సంబంధించిన టికెట్టు ఇస్తారు. ఆశీర్వాదం కూడా కావాలి అనుకుంటే దానికి కూడా టికెట్ తీస్కోవాలి. మాకైతే వాళ్ళే పూజా ద్రవ్యాలు ఇచ్చారు. వుదయం తొమ్మిది గంటలకి నరసిమ్హ వనంలోని హాల్ లో పూజ జరుగుతుంది. పూజ తరువాత స్వామి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీస్కోవచ్చు. మీరు గుంటూరు అందునా నర్సరావుపేట నుండీ అయితే ఒకటి రెండు కుశల ప్రశ్నలు, మీ వివరాలు కూడా అడుగుతారు. :)

  ఇక శృంగేరి పక్కనే కిగ్గ అని ప్రాంతం వుంది. ఇక్కడ ఋష్యశృంగ ముని తపస్సు చేశారు. చాలా బాగుంటుందిట అక్కడి ప్రశాంత వాతావరణం. అయితే ఇక్కడికి నుండి శృంగేరికి చివరి బస్సు సాయంత్రం 6.45 గంటలకు. కాబట్టీ 4 గంటలకి కిగ్గ వెళితే 6.45 బస్సులో వెనక్కి రావచ్చు. కిగ్గ లో బస చెయ్యడానికి వసతి గృహాలు లేవు.

  చెప్పడం మర్చిపోయాను శృంగేరి లో ఆలయం బయట KSRTC reservation counterకి వెళ్ళే దారి లో ఒక చిన్న హోటలు వుంది. అక్కడి పెసర పచ్చడి, దోసెలు అద్భుతం. పేరు గుర్తు లేదు. ఇక్కడ ఇంట్లోనే ఒక చిన్న హాలు లో నేల మీద బంతి చాపలు పరిచి అరిటాకు లో టిఫిన్ పెడతారు.

 4. చిలమకూరు విజయమోహన్ - February 19, 2009

  మీయాత్ర శుభప్రదమూ,ఫలప్రదమూ కావాలని కోరుకుంటూ….

 5. laxmi - February 20, 2009

  Have a wonderful vacation and wish you a memorable and safe trip

  -Nenu-laxmi

Leave a Reply