మన సినెమాలు నిజంగా మారుతున్నాయా?

(మన సినెమాలు అంటే నా ఉద్దేశ్యంలో తెలుగు,హిందీ సినెమాలు}.ఈమధ్య చాలా మంది విమర్శకులు మన సినిమాలు మారుతున్నాయని అంటున్నారు.ఇందుకు ఉదాహరణగా వారు కొన్ని హిందీ సినిమాలను చూపిస్తారు.బ్లాక్,రంగ్దే బసంతీ,తారే జమీన్ పర్,ఇంకా ఇటువంటి కొన్ని సినెమాల జాబితా చెప్తారు.ఇవన్నీ మామూలు మూస సినిమాల కన్న భిన్నమయినవే అయినా మౌలికంగా మన ధోరణిలో మార్పు రాలేదనిపిస్తుంది.ఎందుకంటే, మన ఇండస్ట్రీ లో ఒరిజినల్ స్క్రిప్టులు లేవు. ఈ కొత్త సినెమాలలో మన వాతావరణం కనబడదు.అవి హాలీవుడ్ సినిమాల స్థాయిలోనేకాదు,అవి హాలీవుడ్ సినిమాలలాగే వుంటున్నయి.అందులో కనపడే పాత్రలు,సన్నివేశాలు,వారి మనస్తత్వాలు అనే అరువువే.అవి చూస్తూంతే మనము వారిలాగా అయిపోయామా అనిపిస్తుంది.రంగ్దె బసంతీ,తారే జమీన్ పర్, గాంధీ మై ఫాదెర్ లాంటి కొన్నిటిని వదిలేస్తే మిగతావన్నీ పాత సినెమాల కాపీలో ,హాలీవుడ్ కు నకళ్ళో అవుతాయి.ముఖ్యంగా భట్ సినెమాలు,సంభాషణలతో సహా హలీవుడ్ దిగుమతులే.కొందరు ఈ సినెమాలను తెలివిగా మనకు తగ్గట్టు మారుస్తే ఇంకొందరు అంత కశ్టం కూడా పడటంలేదు.మాటల్లో కూడా ఆంగ్ల పదాలు బోలెడన్ని దొర్లుతాయి.కొన్ని సినిమాలలోనయితే నటీ నటులు అనర్గళంగా ఆంగ్లంలోనే మాట్లాడేస్తారు. ఎన్ని కొత్త కొత్త హాలీవుడ్ కథలు దిగుమతి చేస్తున్నా వాటిలో ప్రేమ,ఐటం పాట వంటివి తప్పటంలేదు.తారే జమీపర్ సినిమాలో కూడా మన పాత సినిమల్లోలాగ హీరో సకల సద్గుణాల రాశి.అతడికితప్ప పిల్లలగురించి ఇంకెవరికి తెలియదు.మిగతా టేచర్లు పనికిరానివారు.ఆ సినిమా ఆమీర్ఖాన్ కబట్టి ధైర్యం చెయగలిగాడు.మరెవ్వరూ అది తీయగలిగేవారు కారు.అంటేనే అర్ధం అవుతుంది మనం మారలేదని.
ఇక తెలుగు సినెమాల దగ్గరకు వస్తే,హిందీలో కనీసం మారె ప్రయత్నం జరుగుతోంది.మన చిన్న హీరోలు ఇంకా వందమందిని తంతూనే వున్నారు.గాలిలో ఎగుర్తూ ఫైటింగులు చేస్తూనే వున్నారు. నాయికలు వొళ్ళు చూపేందుకు, ముద్ద్లు వొలికేందుకే వుపయోగపదుతున్నారు.కథతో సంబంధం లేకుండా హస్యగళ్ళు వెకిలి వేశాలు వేస్తూనే వున్నారు. సాంకేతికంగా మనం హాలీవుడ్ స్థాయిలో వున్నా స్క్రిప్ట్ పరంగా మాత్రం ఎటువంటి అభివ్రుద్ధి లేదు.హీరొయిజం కు వున్న ప్రాధన్యం సినిమాకు లేదు.హిందీ అయినా తెలుగు అయినా అందుకే మనం మారుతున్నామనీ,మన స్థాయి హాలీవుడ్ స్థాయి అని అనుకుంటూన్నా మనం మాత్రం మన పాత సినిమాలతో పోల్చుకుంటే దిగజారుతున్నము తప్ప ఎదగటం లేదు.పాత వాళ్ళు పరాయి సినెమాలను స్ఫూర్తిగా తీసుకున్నా వాటిని స్వంత సినెమాలుగా మలచేవారు.టేమింగ్ ఆఫ్ ద శ్రూ అనే డ్రామా హిందీ లొ ఆన్ గా,తెలుగులో గుండమ్మ కథ గా మరిందంటే నమ్మలేము.అలాగె బెక్కెట్ అనే సినెమా తెలుగులో ప్రా
న స్నేహితులు గా,హిందీలో నమక్ హరాం గా మారిందటేకూడా నమ్మలేము.అందుకే మనము మారుతున్నమా దిగజారుతునామా అని నా సందేహం. 

Enter Your Mail Address

March 21, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.

No Responses

 1. KRISHNA RAO JALLIPALLI - March 21, 2008

  very very shocking news. అందాల నటుడు శోభన్ baabu ఇక లేరు అంటే నమ్మబుద్దవడం లేదు. అన్ని t.v. channels వారు చాల చాల బాగా coverage ఇచ్చి వారి అభిమానాన్ని చాటుకోవడం హర్షణీయం. ఈ మద్యనే శోభన్ బాబు గారి గురించి చక్కటి ఆర్టికల్ చదవడం సంభవించింది ee bloglo.
  - నిగర్వి, నిరడంబురుడు శోభన్ బాబు కి flops చాల తక్కువ.
  - NTR, ANR రాజ్య మేలుతున్న కాలం లో కృష్ణ గారు శోభన్ గారు ఒకే సారి stardam అందుకున్నారు. స్వశక్తి తో తమ తమ స్థానాలని పదిల పరుచుకొన్నారు.
  - ఆయన నటించిన చిత్రం ‘మోస గాడు’ విలన్ ఎవరో తెలుసా – మన చిరంజీవే.
  - ఆయన మనసుని ఎవరైన నొప్పించారో ఏమో గాని – చాల కాలం నుండి ఆయన సినీ పరిశ్రమకి దూరంగా ఉన్నారు. ఎ సభలకి, సమావేశాలకి attend అవడం లేదు. ఎ functions కి కూడా హాజారు అయిన దాఖలాలు లేవు. ఆఖరకి ఈ మధ్య జరిగిన వజ్రోస్తావాలకి కూడా హాజారు అవలేదు. కారణాలు తెలియదు. వివాదలకి ఎప్పుడు దూరం గా ఉండే శ్రీ శోభన్ బాబు గారికివే నా నివాళులు.

Leave a Reply