నేను చదివిన మంచి పుస్తకం-1

మన తెలుగు సాహిత్య ప్రపంచములో విమర్శ అన్నది అంతగా విశాలం కాలేదు.దీనికి అనేక కారణాలు వున్నాయి.వుద్యమ సాహిత్యానికిచ్చిన ప్రాధాన్యం మానవతా విలువలున్న సాహిత్యానికి ఇవ్వటంలేదు.పేరున్న రచయితలకు ఇచ్చిన ప్రాధన్యం కొత్త రచయితలకు ఇవ్వటం లేదు.తెలిసినవారు,ఎవరినయినా పొగిడితే లాభం వుండేవారు,తాము నమ్మిన ఇజాన్నే నమ్మేవారు ఇటువంటి వారి రచనలను ఆకాశానికి అర్హత లేకున్న ఎత్తేయటం జరుగుతొంది.ఇవన్నే లేకపోతే మంచి రచన చేసినా అవి మరుగున పడిపోతున్నాయి.ఎందుకంతే విమర్శకులు వాటిని పాథకుల ద్రిష్టికి తేవటం లేదు.వారికి తమ లాభం తప్ప సాహిత్య అభివ్రుద్ధితో పని లేదు.అందుకే తెలుగు లో ఇప్పటికే కొంతమంది పాత రచయితల పేర్లే వినిపిస్తూంటాయి.కొత్త రచయిత పేరు వినిపిస్తే ఆ రచయిత పేరు వినపదటం వెనుకు బోలేడన్ని కథలుంటాయి.ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే రచయిత పేరుతో,పార్టీ తో, సామజిక స్థాయితో సంబంధం లేకుండా చూస్తే ఎక్కువమందికి తెలియని అనేక రచయితలు అద్భుతమయిన కథలు రచిస్తూ కనిపిస్తారు.అటువంటి రచనలను పరిచయం చేస్తాను నేను వీలున్నప్పుడల్లా.నా వాదనకు రుజువుగా పరిచయం చేస్తున్న మొదటి కథా సంకలనం “అమ్మకు అభినందనలు.రచయిత్రి పేరు “ం.హేమలత”.

ఈ సంకలనంలో కథలు చదువుతూంటే ఆశ్చర్యం కలుగుతుంది.ఎందుకని ఈ రచయిత్రి కథలగురించి చర్చలు జరగటంలేదు?ఎందుకని ఈమె పేరు మంచి రచయితల జాబితాలో వినిపించదు?ఎందుకని ఏ విమర్శకుడూ ఈమె పేరు ప్రస్తావించడు?

ఈ సంకలనం లోని కథలన్నీ ఒక ప్రయొజనం వున్నవే.ప్రతి కథలో నిత్యజీవితంలో మనము ఎదుర్కొనే సమస్యల చిత్రణ,వాటి వివరణ,పరిశ్కారాలూ ప్రతిభావంతంగా ప్రదర్శితమవుతాయి.సాద్గారణంగా మన రచయితలు కథాంశాలుగా ఎంచుకోని వైద్య సంబంధిత అంశాలు కేంద్ర బిందువుగా అనేక కథలు నడుస్తాయి.మన అపోహలు తొలగించి సరయిన ద్రుక్కోనాన్ని ఇస్తాయి.అల్జేమియర్,మ్ర్సీ కిల్లింగ్,హిస్టెరెక్టొమీ వంటి విశయాలను వివరించి సందేహాలు తీరుస్తాయీకథలు.ఇంత మంచి కథలగురించి ఏ విమర్శకుడూ విశ్లేశించడు.ఏ సంస్థా బహుమతులివ్వదు.కాబట్టి విమర్శకులతో సంబంధం లేకుండా పాథకులే మంచి కథలను వెతుక్కోవాలి.వాటిని బ్రతికించు కోవాలి.కథకులకు ఉత్సాహాన్నీ,ప్రోత్సాహాన్నీ ఇవ్వాలి.తెలుగు సాహిత్యాన్ని పరిపుశ్టం చేయాలి.

Enter Your Mail Address

March 25, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu, పుస్తక పరిచయము

No Responses

 1. kolluri soma sankar - March 25, 2008

  Good observation. Please let us inform the shops where we can get the book you mentioned in your post.

 2. chavakiran - March 25, 2008

  ఇంకొన్ని వివరాలు ఇస్తే బాగుండేది
  వెల
  ప్రతులకు సంప్రదించవలసిన చిరునామా
  పేజీలు
  కథలు
  కథల టైటిల్స్

 3. tethulika - March 25, 2008

  నిజమేనండీ. నేను కూడా ఇలాగే అనుకుంటున్నాను. విమర్శలూ, బహుమానాలూ రచనల సాంఘికప్రయోజనం అన్నపేరుతో కొందరికే పరిమితమైనందున, కొన్ని మంచికథలు, మీరన్నట్టు మానవతావిలువలు గల కథలు వెలుగు చూడడం లేదు. మీకృషి అభినందనీయం.

 4. కొత్త పాళీ - March 25, 2008

  Please give publication details
  the year it was published.
  Most books also contain “contact for copies” information.
  thank you.

Leave a Reply