ఈ వారం నా రచనలు-5

ఈ ఆదివారం వార్త అనుబంధంలో బ్లాగ్ స్పాట్ శీర్షికన మడోన్నా బ్లాగు పరిచయం వుంటుంది. ఈ బ్లాగ్ స్పాట్ శీర్షికను పలువురు మెచ్చటం నాకు ఆనందంగానేవున్నా, ఈ శీర్షికన రచయితగా నా నైపుణ్యాన్ని చూపించేవేలులేదన్న అసంతృప్తి మాత్రం నన్ను వదలటంలేదు. అందరూ ఇష్టంగా చదువుతున్నారి కాబట్టి కొనసాగించమంటారు ఎడిటర్. ఇందులో రచయితగా నా కేమీ లేదు, కాబట్టి, మరేదయిన సృజనాత్మకమయినది రాస్తానని నేను గొడవచేస్తున్నాను. కానీ, పాఠకులకు నచ్చిన శీర్షిక కాబట్టి ఇంకొన్ని రోజులు కొనసాగించకతప్పదు.

ఆదివారం ఆంధ్రప్రభ అనుబంధంలో సగటుమనిషి స్వగతం లో, ఈ వారం సగటు మనిషి ప్రేమల గురించి తన గోడు వెళ్ళబోసుకుంటాడు. ఒక్క వాలెంటైన్ డే రోజు ప్రేమికులు కలవకూడదు. మిగతా రోజులు ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించినా ఫరవాలేద్న్నట్టున్న ప్రవర్తనలోని అయోమయాన్ని సగటుమనిషి చెప్పుకుంటాడు.

ఆంధ్రభూమివారపత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికలో ఈవారం తీవ్రవాద నేపధ్యంలో పాకిస్తాన్ రాజకీయాలు, మనపై వాటి ప్రభావాల గురించిన విశ్లేషణ వుంటుంది. అదేమిటోగానీ, చరిత్రలో ఎప్పుడెప్పుడు మనకు శక్తివంతమయిన నాయకత్వం అవసరమయిందో అప్పుడప్పుడు మనకు శక్తివంతమయిన నాయకులు కరవయ్యారు. ఇప్పుడూ అదే జరుగుతోంది.

నా కొత్త పుస్తకం తీవ్రవాదం దాదాపుగా తయారయిపోయింది. నా ముందుమాట కోసమే ఆగింది. ఈవారంలో అదీ ఇచ్చేస్తాను. ఏప్రిల్ చివరి వారానికల్లా పుస్తకం మీ ముందుంటుంది.

నేను రాసిన సైన్స్ ఫిక్షన్ కథల సంకలనం జరుగుతోంది. తెలుగులో సైన్స్ ఫిక్షన్ ప్రక్రియ అంతగా అభివృద్ధి చెందలేదు. సైన్స్ ఫిక్షన్ రచనలంటే అంత అవగాహన కూడాలేదు. సైన్స్ ఫిక్షన్ కూ, సైన్స్ ఫాంటసీకీ తేడా తెలియదు. సైన్స్ ఫిక్షన్ ను నిర్వచించి, లక్షణాలను వివరించి , వాటిని అనుసరిస్తూ ఆంధ్రభూమి మాస పత్రికలో 10 సైన్స్ ఫిక్షన్ కథలు రాశాను. వాటి సంకలనం ఇది. త్వరలో మీముందుంటుంది.

Enter Your Mail Address

April 5, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

No Responses

  1. రాజ మల్లేశ్వర్ కొల్లి - April 10, 2009

    కాబట్టి.., రచయత గానే కాదు, పాఠకుడిగా కూడ మీ సృజనాత్మకత ను ప్రదర్శిస్తున్నారన్నమాట..!
    ఆభినందనలు.

Leave a Reply