నా ఎలక్షన్ డ్యూటీ అంబర్ పేటలో!

మా ఆఫీసులో అడ్మిన్ వింగ్ వైపు అందరూ పరుగెత్తటం, గుంపులు గుంపులుగా నిలబడి వేడి వేడిగా వాడి వాడిగా చర్చించుకోవటం చూసి ఏమయిందో నని నేనూ ఆ గుంపులోకి లంఘించాను.

అప్పుడు తెలిసింది, మేము ఎక్కడ ఎలక్షన్ డ్యూటీ చేయాలో తెలియ చెప్పే ఉత్తరాలు వచ్చేశాయని.

ఒకరొకరు తమ నియోజకవర్గాన్న్ని చూసుకుని సంతోషిస్తున్నారు. నవ్వులు కురిపిస్తున్నారు.

అంబర్ పేట్, ముషీరాబాద్, మలక్ పేట్ వంటి నియోజకవర్గాలలోనే అందరికీ పోస్టింగ్ వస్తోంది. అంతవరకూ చాంద్రాయణ గుట్ట అని దిగాలుపడి అప్పగింతలు, ఆస్తిపంపకాలు చేసిన వారందరి ఆశలు చిగురించాయి. వందేళ్ళు కాకపోయినా కనీసం ఈ ఎన్నికల తరువాతయినా బ్రతికి వుంటామని అందరూ సంతోషించేస్తున్నారు.

ఇదంతా చూస్తూంటే నా పోస్టింగ్ ఎక్కడో తెలుసుకోవాలన ఆత్రుత పెరిగిపోయింది. ఇంతలో నా కోలీగుకు చార్మినార్ అని తెలిసింది. అందరూ ఆనందిస్తూంటే వాడొక్కడు, డెత్ వారంటు పుచ్చుకున్నట్టు, మీసాలు పెదిమలు కలిపి కొరుక్కుంటూ ఒక మూల కూచుని శూన్యంలోకి చూస్తూ నిట్టూర్పులు విడిచేయటం ఆరంభించాదు.

మురళీ నా మీద ఒక పాట రాసిచ్చెయ్ 16 లోపల ఇదే నా చివరి కోరిక అని అడిగాడు.

వాడిని ఎలా ఓదార్చాలో తెలియలేదు.

ఇంతలో నా వంతి వచ్చింది. నాకూ అంబర్ పేటలోనే!

కనీసం నువ్వన్నా చార్మినార్ లో నాకు తోడుగా వస్తావనుకున్నాను, అన్నాడు నా ఫ్రెండు.

మొత్తానికి నేను అంబర్ పేటలో ప్రజలచేత వోట్లు వేయించాలన్నమాట.

రేపు, నిజాం కాలేజీలో రోజంతా ఒక ట్రైనింగ్ వుంటుంది. ఆతరువాత 15, 16 రోజులలో ఎలక్షన్ కమీషన్ కు అప్పగించుకోవాలి. మళ్ళీ 17 కు విడుదల.

ఈ అన్నిదశలలో నా అనుభవాలను మీతో పంచుకుంటాను.

నియోజక వర్గం మారినా చిరాకుమాత్రం తగ్గలేదు. ఎందుకంటే, నా బాధ నియోజక వర్గం వల్ల కాదు. మౌలికంగా ఎలక్షన్ డ్యూటీ పట్ల నా నిరసన్.

ఈ రాజకీయ నాయకులు, వీళ్ళ గొడవలూ చూస్తూంటే, ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇలాంటి పాలకుల పాల బడ్డాము అనిపిస్తొంది. అంతలో, వీళ్ళను తిట్టుకునీ లాభంలేదు. వాళ్ళలా బాధ్యతల నిర్వహణకు వేరే ఎవరూ ముందుకు రాకపోవటం వల్లనే కదా వీళ్ళే మనకు మిగిలారు అనిపిస్తుంది.

ఈ ఆలోచన వచ్చిన తరువాత నేనూ మా అఫీసులో ట్రేడ్ యూనియన్లలో చురుకుగో పాల్గొంటే ఎలావుంటుంది అన్న ఆలోచన వస్తోంది.

  చూదాం, ఏది ఎలా అవుతుందో!

Enter Your Mail Address

April 10, 2009 ·  · 4 Comments
Posted in: Uncategorized

4 Responses

 1. chavakiran - April 10, 2009

  Trade Union ZBD.

 2. కంది శంకరయ్య - April 10, 2009

  కస్తూరి మురళీకృష్ణ గారికి నమస్కారం.
  మీ ఎలక్షన్ డ్యూటీ అనుభవాలను చదవాలనే ఆసక్తితో కూడలి లింకు ద్వారా మీ బ్లాగు లోకి ప్రవేశించాను. కాని దురదృష్టం … నాకు మీ బ్లాగులో అక్షరాలు ముక్కలు ముక్కలై కనిపిస్తున్నాయి. యూనికోడ్ లో ఉన్న మిగిలిన బ్లాగుల్లో అక్షరాలు సరిగానే కనిపిస్తున్నాయి. దీనికేదైనా తరుణోపాయం చెప్తారా?

 3. Shashank - April 11, 2009

  మురళీకృష్ణ గారు, అంబరపేట్ అంటే మా నియోజికవర్గమండి. అదీ తిలక్ నగర్ లో వస్తే ఇంకా మంచింది. ఇప్పటి వరకు అసలు తిలక్ నగర్, నల్లకుంట ఆ ప్రదేశల్లో ఎప్పుడు అల్లర్లు జరలేదు. మా మేనత్త ఉండేన్ని రోజులు ఈ ఎన్నికల డ్యుటీ గురించి చాలా ఆత్రుత పడేది. మేము కూడా తనకి ఎక్కడ పడుతుందో డ్యుటీ అని కొంచం ఆరాట పడే వాళ్ళం. అంబరపేట్ కాబట్టి mostly tension free. అయ్యాక చెప్పండి. wishing you good luck.

 4. A. Subbarao Babji - April 11, 2009

  Dear Murali Krishna,
  your experiennce of election duty is good.
  Here I want to comment on the last line” What sins that are committed by us to bear these politicians” ( transillation to your lines)

  The sins are ours only. Eventhough some leaves are healthy no one want to see the flower that is eaten by pests. We only made this situation. For centuries together we slept without updating the systems that are incorporated in the society for its smooth running in those days. Old systems that are not suitable for this century is being followed without knowing the meaning or purpose of the same. As a result we lost major chunk of the society in the name of untouchbles, we devided the society in fragments of casts and creeds. because of this we are under slavery and that slavery poised more our minds.
  The result is the words uttered by you.
  These are not alone your words But you have represented many of our dumb voices.

  Regards

  Babji

Leave a Reply