ఈ వారం నా రచనలు-6

మరో ఆదివారం వచ్చేసింది.

ఒకప్పుడు ఆదివారం వస్తోందంటే ఎంతో రెలీఫ్ గా వుండేది. ఏదో గొప్ప సాధించినట్టుండేది. టీవీల్లో కార్యక్రమాలుకూడా ఆత్రంగా ఎదురుచూసేట్టు చేసేవి.

రామాయణ్, మహాభారత్, కాస్మోస్, దిఫెరెంట్ స్ట్రోక్స్ లాంటి కార్యక్రమాల కోసం వారమంతా ఎదురుచూసి, చూసినతరువాత మరో ఆదివారం కోసం ఎదురుచూపులు మొదలయ్యేవి. ఇప్పుడు చానెళ్ళు పెరిగాయికానీ, అన్నీ ఒకేలా, ఒకదానికి మరొకటి నకలులా వుండటంతో ఆదివారం తన ప్రత్యేకతను కోల్పోయింది.

అయినా, ఆదివారం పూర్తిగా ప్రత్యేకతను కోల్పోకపోవటానికి కారణం, ఈ రోజు వచ్చే అనుబంధాలలో నా అర్టికల్సుండటమే!

వార్త ఆదివారం అనుబంధంలో బ్లాగ్ స్పాట్ శీర్షికన, ఈవారం శేఖర్ కపూర్ బ్లాగ్ పరిచయం వుంటుంది. ఇతని బ్లాగులో రాతలు చూస్తూంటే శేఖర్ కపూర్ ఆలోచనల లోతు, మనిషి వొంటరితనాలు అర్ధమవుతాయి.

ఆదివారం ఆంధ్రప్రభ అనుబంధంలో సగటుమనిషి రకరకాల ఏడుపుల గురించి పాఠకులతో పంచుకుంటాడు. సగటు మనిషి ఎవరూ ఏడవటం చూడలేడు. ఎవరినయినా చూస్తే. వారిఏడుపుతోపాటూ సగటు మనిషికీ ఏడుపు వస్తుంది. సీట్లు దొరకక రాజకీయనాయకులు ఏడ్చే ఏడ్పులు చూస్తూంటే సగటు మనిషికి కలిగే అనేక రకాల ఏడ్పులను పాఠకులతో ఈవారం పంచుకుంటాడు సగటు మనిషి తన స్వగతంలో.

ఆంధ్రభూమి లో పవర్ పాలిటిక్స్ శీర్షికన ఈవారం రాష్ట్ర రాజకీయాల తీరు తెన్నుల విశ్లేషణ వుంటుంది.

ఇవీ ఈవారం వివిధ పత్రికలలో వెలువడే నా రచనలు. చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్త పరచాలని ప్రార్ధన.

Enter Your Mail Address

April 12, 2009 ·  · 2 Comments
Posted in: నా రచనలు.

2 Responses

  1. cbrao - April 12, 2009

    మీ వ్యాసాలకు లంకెలు ఇవ్వగలరు.

  2. వేణు - April 12, 2009

    వార్త ఆదివారం అనుబంధంలో మీ ‘బ్లాగ్ స్పాట్’ శీర్షిక బాగుంటోంది. ఆ కథనాలను
    ఇక్కడ మీ బ్లాగులో ఇస్తే పాతవి మిస్ అయినవారు చదువుకునే వీలుంటుంది కదా!

Leave a Reply