భలే మాంచి చౌక బేరమూ!

భలే మంచి చౌక బేరమూ, ఇది సమయమున్ మించినన్ దొరుకదు, త్వరన్ గొనుడు సుజనులార భలే మాంచి చౌక బేరమూ!!1

నిజంగానే ఇది భలే మంచి చౌక బేరమే!

నేను రచించిన పుస్తకం తీవ్రవాదం ప్రింటుకు వెళ్ళిపోయింది. పాలపిట్ట ప్రచురణలీ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు.

నేను ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన తీవ్రవాదానికి సంబంధించి రాసిన వ్యాసాల సంకలనం ఇది. ఇందులో, సెప్టెంబర్ 2001 కన్నా ముందునుంచీ తీవ్ర వాదం వల్ల ప్రపంచానికి వున్న ముప్పును గురించి హెచ్చ రిస్తూ రాసిన వ్యాసాలున్నాయి.

తీవ్రవాదం నిర్వచనంతో సహా, తీవ్రవాదానికి కారణాలు, అది పెరిగిపోవటానికి దోహదపడే పరిస్థితులు, తీవ్ర వాదాన్ని అణచివేసేందుకు తీసుకోవలసిన చర్యల వంటివి సందర్భానుసారంగా ఆయా వ్యాసాలలో పొందుపరచివున్నాయి.

అఫ్ఘనిస్తాన్, లిబియా, పాకిస్తాన్, చెచెన్యా, ఇండోనేషియా లతో సహా మన దేశంలో ఈశాన్య భారతంలోని తీవ్రవాదం వంటి అంశాలను మూలాల్లోకి వెళ్ళి ప్రకటించే వ్యాసాలివి. అంటే, ఈ వ్యాసాలు వేర్వేరు సమయాల్లో రచించినవయినా వీటిలో పొందుపరచిన అంశాలు ఈనాటికీ పనికివస్తాయి. విలువ తరగనివి. ఎల్లప్పటికీ రెఫెరెన్స్ కు పనికివస్తాయి.

మొత్తం 36 వ్యాసాలున్నాయీ సంకలనంలో. 2000 నుంచి 2008,31 డిసెంబరు  వరకు తీవ్రవాదానికి సమబంధించిన వ్యాసాల సంకలనం ఇది. ఇందులో కాశ్మీర్ తీవ్రవాదానికి సమబంధించిన రెండే వ్యాసాలున్నాయి. ఎందుకంటే కాశ్మీర్ కు సంబంధించిన వ్యాసాలే 90 పేజీలు దాటాయి. ఇవన్నీ, భారతీయ సమస్యలకు సమబంధించిన వ్యాసాల సంకలనంలో జోడించటంతో పునరుక్తిని తప్పించుకొనేందుకు ఈ సమకలనంలో చేర్చలేదు.అదీకాక, ఇప్పటికే 264 పేజీలయింది పుస్తకం. వెల 100/- మాత్రమే. ఇంకా పేజీలు పెరిగితే వెల పెంచాల్సివస్తుంది. అందుకనే కాశ్మీర్ వ్యాసాలని ఈ పుస్తకంలో చేర్చలేదు.

అయితే, పాలపిట్ట ప్రచురణలవారు ఈ పుస్తకాన్ని ప్రె- పబ్లికేషన్ ఆఫర్ గా 75/- కే ఇవాలని సంకల్పించారు. పుస్తకం కావాల్సినవారు సంప్రతించవలసిన చిరునామా;-

పాలపిట్ట ప్రచురణలు
16-11-20/6/1/1
403, విజయ సై రెసిదెంచ్య్
సలీం నగర్, మలక్పేట్
హైదరాబాద్-500036.
సెల్ నంబర్;- 9848787284.

ఈ భలే మంచి చౌక బేరావకశాన్ని వినియోగించుకుంటారనే ఆశిస్తున్నాను.

పుస్తకం చదివిన తరువాత మీ సలహాలు, సూచనలు, నిర్మొహమాటమయిన అభిప్రాయాలను తెలియపరచాలని ప్రార్ధన.     Power- Plolitics Title.pmd

Enter Your Mail Address

April 29, 2009 ·  · 3 Comments
Posted in: నా రచనలు.

3 Responses

 1. కె.మహేష్ కుమార్ - April 29, 2009

  మీ అసిధార నవల మీద నా అభిప్రాయం బ్లాగులో పెట్టాను. చూడగలరు.
  http://parnashaala.blogspot.com/2009/04/blog-post_29.html

 2. rayraj - April 30, 2009

  ఓ అభ్యర్ధన/విన్నపం :
  ఓపిక చేసుకొని, అసలు తెలుగు పభ్లిషింగ్ ప్రాసెస్ – తెలుగు రచయిత ఎలా రాస్తున్నాడు నుంచి తెలుగు పుస్తకం ఎలా విక్రయించ బడుతోంది అన్న విషయం వరకు ఓ సమగ్రమైన వ్యాసం దయచేసి రాసిపెట్టండి.స్ట్రెస్ ఆన్ పభ్లిషింగ్ (రచన విలువల గురించి కాదని మనవి)

  “అఫ్ఘనిస్తాన్, లిబియా, పాకిస్తాన్, చెచెన్యా, ఇండోనేషియా లతో సహా మన దేశంలో ఈశాన్య భారతంలోని తీవ్రవాదం వంటి అంశాలను మూలాల్లోకి వెళ్ళి ప్రకటించే వ్యాసాలివి” – నేనెప్పుడూ చూడలేదు.ఆసక్తి కరంగా ఉంది.మిడిల్ ఈస్ట్ లో విషయాలు ఇందులో కవర్ చేయలేదా!? ఒక్కసారి ఆ తీవ్రవాదం మీద మీరిచ్చిన నిర్వచనం ఇక్కడ వేస్తే,మరింత ఆసక్తికరంగా ఉంటుంది; (కొంతమంది వెనుదిరిగి పోయే అవకాశం కూడా ఉంది.ఆలోచించుకొని,ఆ నిర్వచనం వెయ్యమని విన్నపం.)

 3. కస్తూరి మురళీకృష్ణ - May 1, 2009

  రేరాజ్ గారూ

  త్వరలో తీరిక, ఓపిక చేసుకొని మీ కోరికను తీరుస్తాను. మిడిల్ ఏస్ట్ తీవ్రవాదం కూడా పుస్తకంలో వుంది. ఇవన్నీ, ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన వారం వారం రాసిన వ్యాసాలు. ప్రతి వారం ఆ వారంలో ప్రాధాన్యం వహించిన రాజకీయ సంఘటనను విశ్లేషిస్తూ ఈ శీర్షికన వ్యాసం వుంటుంది. అలాంటి వ్యాసాలలోంచి తీవ్రవాదానైకి సంబంధించిన వ్యాసాల సంకలనం ఇది. ఇంకా, భారతీయ సమస్యల వ్యాసాల సంకలనం, అంటే, రామ జన్మభూమి, రామ సేతు, ఆర్ధిక సమస్యలు, ప్రాంతీయ సంకుచితవాదాలు, కుల తత్వము, రిజర్వేషన్లు, వగైరా వగైరా లన్నిటి పైన వచ్చిన వ్యాసాలతో ఒక పుస్తకం తయారవుతోంది. విదేశాల రాజకీయ సమస్యల వ్యాసాల సంకలనం ఒక పుస్తకం సిద్ధమవుతోంది. అలాగే, ఈ శీర్షికనే వచ్చిన అమెరికా రాజకీయాలు, ఇతర దేశాలతో అమెరికా ఆడే పవర్ పాలిటిక్స్ ఆటలకు సంబంధించిన వ్యాసాల సంకలనం ఇంకో పుస్తకం. ఈ వ్యాసాలను ఇలా అమ్షం ఆధారంగా వర్గీకరించి మొత్తం నాలుగు పుస్తకాలుగా వెలువరించాలని పధకం. దాన్లో మొదటిది తీవ్రవాదం. ఇక తీవ్రవాదం నిర్వచనం గురించి… తినబోతూ రుచెందుకు? పుస్తకం మీ ముందుకె వస్తోందిగా?

Leave a Reply