ఈవారం నా రచనలు-9

ఈవారం  ఇతర పనులతో కాస్త బిజీగా వుండటంతో కంప్యూటర్ దగ్గరకు వచ్చే వీలు చిక్కటమే లేదు. అందుకే ఒక పది నిముషాలు దొరకగానే రేపు ప్రొద్దున్న వుంచాల్సిన పోస్టు ఇవాళ్ళే వుంచేస్తున్నాను. ఎందుకంటే, రేపు కూడా కంప్యూటరు దగ్గరకు వచ్చే వీలు చిక్కటం కష్టం!

ఈవారం ఆదివారం వార్త అనుబంధంలో కవర్ స్టోరీ నేనే రాశాను. అది ఐపీఎల్ కు సంబంధించినది. ఐపీఎల్ విదేశాలకు వెళ్ళటం నుంచి, క్రికెట్ భవిష్యత్తు వరకూ వీలయినంత తేలికగా విషయాలను చర్చించాను. అయితే, వార్తలో నాకు బ్లాగ్ స్పాట్ అనే శీర్షిక వుంది. కవర్ స్టోరీ ఐపీఎల్ కు సంబంధించింది కావటంతో ఈసారి బ్లాగ్ స్పాట్ ను కవర్ స్టోరీ కి అనుబంధంగా ఐపీఎల్ సంబంధిత బ్లాగులు పరిచయం చేశాను. లలిత్ మోడీ బ్లాగును, ఫేక్ ఐపీల్ బ్లాగర్ బ్లాగునూ పరిచయం చేశాను. కవర్ స్టోరీ చదివి మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా తెలపాలి.

ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సగటు మనిషి హఠాత్తుగా చెప్పులు విసరటానికి పెరిగిన ప్రాధాన్యం గురించి తన భావాలను, ఆలోచనలను పంచుకుంటాడు.

ఈవారం ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన, కేంద్ర రాజకీయాలలో జరుగుత్న్న పొత్తులు వాతి పరిణామాల గురించిన చర్చ వుంటుంది.

ఆంధ్ర ప్రభ గురువారం చిత్రప్రభ అనుబంధంలో ఈవారం బాలల చిత్రాల స్క్రిప్తు రచన గురించిన విమర్శనాత్మక వ్యాసం వుంటుంది.

ఈనెల కౌముది వెబ్ పత్రికలో కథాసాగర్ మథనం శీర్షికన మార్చ్ నెలలో ప్రచురితమయిన కథల్లోంచి ఎంచుకున్న విభిన్నమయిన కథల విశ్లేషణ వుంటుంది.

ఈనెల ఈభూమి పత్రికలో శంకర్-జైకిషన్ ల సంగీత పరిచయం వుంటుంది, పాడుతా,తీయగా అనే శీర్షికన. శంకర్ జైకిషన్ లు పాటల బాణీలు కట్టటంలో చూపిన వైవిధ్యమూ, నేపధ్య సంగీతంలో తెచ్చిన విప్లవాత్మకమయిన మార్పులు, ఎలా వారివల్ల సంగీత దర్శకుడు హీరో హీరోయిన్లంత ప్రాధాన్యం వహించాడో ఈ వ్యాసంలో వివరించాను.

తీవ్రవాదం పుస్తక్ అచ్చయిపోయింది. కవర్ అచ్చవుతోంది. విడుల తేదీ త్వరలో ప్రకటిస్తాను.

అలాగే, రసమయిలో పరిచయం చేసిన సినీ గేయ రచయితల పరిచయాలు పుస్తక రూపంలోకి రావటం వేగవంతమయింది, వాతిని, ఒకో రచయిత పైన ఒకో పుస్తకంలా తేవాలని హాసం ప్రచురణల వారు నిర్ణయించారు. అంటే సాహిర్, మజ్రూహ్, షకీల్ లొక్కరిపేరుమీద ఒకో పుస్తకమన్నమాట.

ఆంధ్రభూమి మాసపత్రికలో నేను రాసిన సైన్స్ ఫిక్షన్ కథల సంకలనం ప్రూఫ్ రేడింగ్ స్థితిలో వుంది. మొత్తం పది కథల సంకలనం ఇది. దీని గురించిన వివరాలు త్వరలో ప్రకటిస్తాను.

ఇవీ ఈవారం నా రచనలు. చదివి  మీ నిర్మోహమాటమయిన అభిప్రాయాన్ని వ్యక్త పరచండి.

Enter Your Mail Address

May 2, 2009 ·  · No Comments
Posted in: నా రచనలు.

Leave a Reply