మా ఇంటి ముందు వ్రేలాడుతున్న వైర్లు!

పొట్టనొప్పికి మందిస్తే తలనొప్పి వచ్చిందిట. మా  కాలనీలో విద్యుత్ స్థంభాల మధ్య దూరం చాలా ఎక్కువగా వుంది, వైర్లు వదులుగా వున్నాయి, ఖాళీ స్థలం కావటంతో గాలి బాగా వేగంగా వీస్తుంది. దాంతో ఎలక్ట్రిక్ వైర్లు తెగి అనవసర ప్రమాదాలు సంభవించే వీలుందని కంప్లయింట్ ఇస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ వారు వెంటనే స్పందించారు.

ఒకరోజు వచ్చి కొలతలు తీసుకున్నారు. మరో రోజు వచ్చి మార్కింగులు గీసుకున్నారు. ఇంకో రోజు వచ్చి ఇంటి ముందు లోతయిన గుంట తవ్వారు. ఆతరువాత రోజు వచ్చి ఒక పెద్ద సిమెంటు స్థంభం పాతి వెళ్ళారు. మరుసటి రోజు వైర్లను స్థంభం పైనుండి లాగి బిగించి కడతామనీ, ఇక ఎంత పెద్ద తుఫానొచ్చినా వైర్లు తెగిపడటం వల్ల ప్రాణాలు పోయే వీలుండదనీ హామీ ఇచ్చారు.

మరుసటి రోజు ఆఫీసునుంచి సాయంత్రం ఇల్లు చేరే సరికి ఇదీ పరిస్థితి. Image010వ్రేలాడే వైర్లు ఉయ్యాలలూగమని ఆహ్వానిస్తున్నాయి. మా ఇంటికి వచ్చేవారందరినీ మా కన్నా ముందే ఆప్యాయంగా పలకరించేందుకు సిద్ధంగా వున్నాయి. కాలికి మందేస్తే వేలు తీసేయాల్సిన పరిస్థితి  తెచ్చే మనవారి అధ్భుత సృజనాత్మక కళా కౌశలాన్ని మీ అందరితో పంచుకుని ఆనందించాలనిపించింది. పనిలో పనిగా మా ఇల్లునుకూడా చూపించినట్టవుతుందికదా అనిపించింది. వ్రేలాడే వైల్ర్ల వెనుక మబ్బులలో దాగిన తాజ్ మహల్ లా దాగిన మా ఇంటినీ చూడండి.

Image016

 

Image017

Enter Your Mail Address

May 9, 2009 ·  · 2 Comments
Posted in: వ్యక్తిగతం

2 Responses

  1. cbrao - May 10, 2009

    ఈ వ్రేలాడే తీగల ఛాయాచిత్రాలు Press కు కూడా విడుదల చెయ్యవచ్చును. పేపర్లో వస్తే వేడిపుట్టి త్వరగా పరిష్కారం లభిస్తుంది.

  2. athram - May 10, 2009

    http://pgportal.gov.in/ indulokelli mee problom rayandi. panicheste makuda cheppandi. eaa madye telisindi.

Leave a Reply